అత్యున్నత శిఖరాలు అధిరోహించాలి !

అభినందన సభ లో….


జాతీయస్థాయి ఎంట్రన్స్ పరీక్షలలో పోటీపడి ర్యాంకులు సాధించిన మీరు. భవిష్యత్తులో ఉన్నత విద్యారంగం లోను అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని విద్యార్థులను ఎల్ఐసి డెవలప్మెంట్ అధికారి సంగనభట్ల నరహరి రావు @ దివాకర్, అభినందించారు.
ధర్మపురి మున్సిపల్ పరిధి లోని 3వ వార్డ్ కౌన్సిలర్ సంగనభట్ల సంతోషి దినేష్ అధ్వర్యంలో మంగళవారం స్థానిక శ్రీవాణి విద్యాలయం లో ఉన్నత లక్ష్య సాధకులు నీట్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన బొజ్జ శాంభవి,.బగ్గారపు సంవేధ్య, ఇందారపు హరిణి,.రమీష ఫిధౌస్, మరియు JEE ADVANCE లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పాలేపు శ్రీవర్థన్, సుందరకారి సుముఖ్, ద్యావల్ల కృష్ణ శాండిల్య, గుండి రఘురామ్, లతో పాటు ఇటీవల తెలంగాణా రాష్ర్ట పవర్ లిఫ్టింగ్ లో బంగారు పథకం సాధించి, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన విరంచి స్వప్నిక లను అభినందించి శాలువా కప్పి, మేమొంటో అందజేసి సన్మానించారు.


ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంగన భట్ల సునీల్ (ప్రధానపోధ్యాయులు), .అల్వాల దత్తాత్రి ( Ritd ప్రిన్సిపల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల) S. నరహరి రావ్.(LIC డెవలప్మెంట్ ఆఫీసర్) కౌన్సిలర్లు వేముల నాగలక్ష్మి, జక్కు పద్మ, గరిగే అరుణ, పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం విద్యార్థులు బంధు వర్గం కౌన్సిలర్ సంతోషిని దినేష్ ల ను సన్మానించారు.