ఆయుర్వేద వైద్యం కోసం విదేశీయులు రాక !

బైంసాలోని ఆరాధన వైద్య నిలయం కు!


(J. Surender Kumar)
ఆయుర్వేద వైద్య సేవలు పొందుటకు విదేశీయులు భారతదేశంకు వస్తున్నారు.


రాష్ట్రంలోని, నిర్మల్ జిల్లా బైంసా, పట్టణంలోని ఆరాధన ఆయుర్వేద వెల్నెస్అండ్ రీసెర్చ్ సెంటర్ లో, గత 25 రోజుల క్రితం స్పెయిన్, కాంబోడియా దేశాలకు చెందిన ఐదుగురు  15 రోజులపాటు వైద్య చికిత్సలు చేయించుకొని సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఆరోగ్యంతో  ఆనందం వ్యక్తం చేస్తూ  వారు  తమ దేశాలకు వెళ్లారని, ఆయుర్వేద నిలయం,  ఎండి  డాక్టర్ గొపిడి రాజారెడ్డి తెలిపారు. 

అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, గల్ఫ్ దేశాల నుంచి గత కొన్ని సంవత్సరాలుగా అనేకమంది తమ ఆయుర్వేద కేంద్రంలో వైద్య చికిత్సలు పొందుతున్నారని ఆయన అన్నారు.  స్పెయిన్, కాంబోడియా  దేశస్తులు రావడం  మొదటిసారి అని అన్నారు.

ఆరాధన ఆయుర్వేద కేంద్రం

దాదాపు 30 సంవత్సరాలు అనుభవం ఉన్న రాజు రెడ్డి తన 10 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో, పచ్చని చెట్లు, కాంక్రీట్ కట్టడాలు లేకుండా,  ప్రశాంత్ పల్లె వాతావరణం తలపించేలా  ఆయుర్వేద కేంద్రం ఏర్పాటు చేశారు.

వైద్య సేవలు

తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్  రాష్ట్రాల నుండి  వైద్య సేవలకు ఇక్కడికి రోగులు వస్తుంటారు.

డాక్టర్ రాజారెడ్డి, సిఎండి


ప్రత్యేక నిపుణుల డాక్టర్ ల బృందం !
డాక్టర్ రాజారెడ్డి, ఎండి, ఆయుర్వేదం, (వ్యవస్థాపకుడు).  డాక్టర్ సంతోష్ ఎండి, (ఆయుర్వేద). సీనియర్ కన్సల్టెంట్, డాక్టర్ దీపశ్రీ, ఎం ఎస్, ఆయుర్వేదిక్  గైకానలిస్ట్, డాక్టర్ శ్వేత, ఎం.డి (ఆయుర్వేద)  పంచకర్మ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్,  డాక్టర్ రాజ్ కుమార్ ,బి ఏ ఎం ఎస్ (కేరళ), డాక్టర్ అరుణ్, బి ఎ ఎం ఎస్, (కేరళ) వీరిద్దరూ సీనియర్ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్ గా తమ కేంద్రంలో అందుబాటులో ఉంటారని డాక్టర్ రాజారెడ్డి వివరించారు.

జలగ వైద్యం చెడు రక్తం తొలగించే విధానం

దీర్ఘకాలిక, మొండి వ్యాధులకు, కేరళ పంచకర్మ ,ఆయుర్వేద పద్ధతులలో చికిత్స సేవలు మా ఆరాధన సెంటర్లో అందుబాటులో ఉంటాయని ఆయన వివరించారు.


ప్రత్యేకంగా  పక్షవాతం, అధిక బరువు, మధుమేహం, మద్యం మాన్పించడం, గుండె సంరక్షణ, కిడ్నీ, థైరాయిడ్ సమస్యలు, మైగ్రేన్, ఫిట్స్, ముఖపక్షపాతం, న్యూరోపతి, సయాటికా, సర్వికల్ స్పాండిస్ టైల్స్ , నడుం నొప్పి రుమటాడ్ ,

మహిళలకు సంబంధిత అనారోగ్య సమస్యలు చిన్నపిల్లల ఆరోగ్యం, మానసిక రుగ్మతలు, మూత్ర , కిడ్నీ వ్యాధులు శ్వాసకోశవాదులు, తదితర ఆరోగ్య సమస్యల పట్ల. మా వైద్య బృందం సిబ్బంది. అనారోగ్య బారిన పడిన వారి పట్ల ప్రేమతో, ప్రత్యేక శ్రద్ధతో సేవలు అందిస్తారని ఆరాధన ఆయుర్వేద వెల్నెస్ అండ్ రీసెర్చ్ సెంటర్. వ్యవస్థాపకుడు , నిర్వాహకుడు డాక్టర్ రాజారెడ్డి వివరించారు.

తమ తమ ఆయుర్వేద వైద్యశాల వెబ్సైట్ www.aradhanaayurveda.com లో సమగ్ర సమాచారం ఉందని ఆయన స్పష్టం చేశారు.