బాపూజీ సేవలు చిరస్మరణీయం
మంత్రి ఈశ్వర్ !


( J. Surender Kumar )


కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవాల సందర్భంగా మంగళవారం జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఆయన విగ్రహానికి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పూలమాలలతో ఘన నివాళులు అర్పించారు, .
ఈ సందర్భంగా బాపూజీ సేవలు చిరస్మరణీయంగా వర్థిల్లుతాయాని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు రుద్ర శ్రీనివాస్, ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు పేట భాస్కర్, సీనియర్ పాతికేయలు బలిజ రాజారెడ్డి, కౌన్సిలర్ ఎంబేరి నాగభూషణం, విగ్రహ కమిటీ అధ్యక్షుడు ముల్క ప్రసాద్, బిసి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గడ్డం మధు, .కటుకం వినయ్, చెన్న శ్రీనివాస్, ఎక్కల్దేవి నవీన్, చింతకింది ప్రేమ్, .రుద్ర శ్రీనివాస్, బండి సురేష్, అది తదితరులు పాల్గొన్నారు.
ఆడపడుచులకు పుట్టింటి కట్నమే బతుకమ్మ సార మంత్రి కొప్పుల
తెలంగాణ రాష్ట్ర పథకాలు దేశానికి ఆదర్శమని, మహిళల అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని, ఇలాంటి పథకాలు దేశంలో ఏరాష్ట్రాల్లో కూడా లేదన్నారు, బతుకమ్మ పండుగకు దేశవ్యాప్త గుర్తింపు వచ్చేలా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో నిర్వహించడం జరుగుతుందని, ఆడపడుచులకు బతుకమ్మ చీర అందించడం పుట్టింటి కట్నం లాంటిదని, మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
మంగళవారం కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోరుట్ల మండల గ్రామాల్లోని ఆడపడుచులకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు లతో కలిసి ఆడపడుచులకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.


ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ…
👉రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరు అడగకముందే ప్రజలకు కావాల్సిన సంక్షేమాన్ని గుర్తించి అందిస్తున్నారన్నారు. ఆడపడుచులకు ప్రత్యేక పండుగ ని వారికి పుట్టింటి వారి కట్నంగా చీరను అందించాలనే ఉద్దేశంతో బతుకమ్మ చీరలను పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు.
👉బతుకమ్మ పండుగ కాకుండా రంజాన్, క్రిస్మస్ పండుగలకు కూడా ఆడపడుచులకు చీరలను అందించడం జరుగుతుందన్నారు.
👉రాష్ట్రంలో సుమారు కోటి 50 లక్షల మంది ఆడపడుచులకు పండగల సందర్భంగా చీరలు అందించడం జరుగుతుందని తెలిపారు కులమతాలకు అతీతంగా ముఖ్యమంత్రి సంక్షేమ అందిస్తున్నారని తెలిపారు, ఆడపిల్లల పెళ్లిళ్లకు కల్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ పథకాల కింద ₹ లక్ష 116/- అందిస్తున్నారన్నారు.


👉అదేవిధంగా గర్భిణీ స్త్రీలతో పాటు పుట్టిన పిల్లలకు పౌష్టికాహారం అందిస్తూ కేసీఆర్ కిట్టును అందజేస్తున్నారని తెలిపారు.
ఆడపిల్ల పుడితే రూ ₹ 13 వేలు బాబు పుడితే రూ ₹ 12వేలు వేలు అందిస్తున్నారని తెలిపారు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు, ప్రసూతి అయిన తర్వాత ప్రభుత్వ వాహనంలోనే తల్లి పిల్లలను ఇంటికి చేరవేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ పథకాలే కాకుండా రైతుబంధు రైతు రుణమాఫీ రైతు బీమా 24 గంటల కరెంటు ఇస్తూ అన్నదాతలను ఆదుకోవడం జరుగుతుందని అన్నారు.
ప్రతి ఎకరానికి మీరు అందించి తెలంగాణ రాష్ట్రాన్ని శశ్యామలం చేశారని తెలిపారు.
👉దళితుల అభ్యున్నతి కోసం దళిత బంధు కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టారని అర్హులైన దళితునికి రూ ₹ 10 లక్షలు అందించి ఆ కుటుంబాలు అభివృద్ధి చెందేలా కృషి చేస్తున్నారన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే దేశంలో ఏ రాష్ట్రంలో అందించని సంక్షేమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్నారని తెలిపారు.
👉దేశంలోని ఇతర రాష్ట్ర అలా ప్రజలు తెలంగాణ లో జరుగుతున్న అభివృద్ధిని సంక్షేమాన్ని చూసి తమ రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా జరగాలని కోరుకుంటున్నారని తెలిపారు, దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని ఆహ్వానిస్తున్నారని అన్నారు, రాబోయే రోజుల్లో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళతారని అన్నారు.
ఆడపడుచులు బతుకమ్మ పండుగను భక్తిశ్రద్ధలతో సంప్రదాయ బద్ధంగా జరుపుకోవాలని కోరారు. అనంతరం ఆడపడుచులకు బతుకమ్మ చీరలను అందజేశారు.


ఈ కార్యక్రమంలో జడ్పిటిసి దారిశెట్టి లావణ్య రాజేష్ , ఎం.పీ.పీ తోట నారాయణ, రైతు బంధు జిల్లా అధ్యక్షుడు చీటి వెంకటరావు, వైస్ ఎంపీపీ చీటి స్వరూపారాణి, కోరుట్ల పట్టణ టిఆర్ఎస్ అధ్యక్షుడు అన్నం అనిల్, నాయకులు బలిజ రాజారెడ్డి, టిఆర్ఎస్ యూత్ పట్టణ, మండల అధ్యక్షులు జాల వినోద్, నత్తి రాజ్ కుమార్, ఉపాధ్యక్షుడు బలిజ శివప్రసాద్, మండలంలోని పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, సింగిల్ విండో చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
ధర్మపురి మండల పరిషత్ లో..


ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు!
స్వాతంత్ర్య సమరయోధుడు తెలంగాణ పోరాటయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 107వ జయంతి  సందర్బంగా  ఈరోజు మండల పరిషత్ కార్యాలయం, ధర్మపురిలో వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు ఎడ్ల చిట్టిబాబు , జిల్లా ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు శ్రీమతి బత్తిని అరుణ , DCMS చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి , AMC చైర్మన్ అయ్యోరి రాజేష్ , వైస్ యం.పి.పి. గడ్డం మహిపాల్ రెడ్డి తిమ్మాపూర్ ఎంపీటీసీ కాళ్ళ సత్తయ్య కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ధర్మపురి మున్సిపల్ కార్యాలయంలో..


స్వాతంత్ర సమరయోధుడు తెలంగాణ ఉద్యమకారుడు కొండ లక్ష్మణ్ బాపూజీ 107వ జయంతి సందర్భంగా స్థానిక మున్సిపల్ కార్యాలయంలో చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించిన మున్సిపల్ చైర్ పర్సన్, సంగి సత్యమ్మ, డీసీఎంఎస్ చైర్మన్ , మార్కెట్ చైర్మన్, మున్సిపల్ వైస్ చైర్మన్, కమిషనర్, కౌన్సిలర్స్ లు, కో ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా గ్రంధాలయ కార్యాలయంలో…


కొండా లక్ష్మణ్ బాపూజీ పద్మశాలి సేవ సంఘానికి ఎంతో సేవ చేసినారు. మన స్థానిక కొత్త బస్టాండ్కు ప్రయాణ ప్రాంగణముకు కొండ లక్ష్మణ్ బాపూజీ పేరు నామకరణం చేయాలని, దానికి అనుగుణంగా మన జగిత్యాల ఎమ్మెల్యే కలెక్టర్ దగ్గరికి ప్రతిపాదన తీసుకుపోవాలని కోరుకుంటున్నాను జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ అన్నారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ హేమంత్ వైఫ్ ఆఫ్ శ్రీలత గైనకాలజిస్ట్ గారి అబ్బాయి నీట్ ఎగ్జాంలో పాస్ అయి తెలంగాణలో 2000 ర్యాంకు తీసుకొచ్చిన సందర్భంగా బాబును గ్రంధాలయంలో నిర్వాహకు లు సన్మానం చేశారు.


ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ సురేష్ ,ముసిపట్ల లక్ష్మీనారాయణ , అడ్వకేట్ మహేందర్ , గ్రంధాలయ సిబ్బంది శకుంతల ,రాజు, అనిల్,.స్టూడెంట్స్ తదితరులు పాల్గొన్నారు.
కోరుట్ల మునిసిపాలిటీ కి మరొక జాతీయ అవార్డ్
స్వచ్చతా లీగ్ అవార్డ్ కి ఎంపిక


స్వచ్చ సర్వేక్షన్- 2022 పోటీలో తెలంగాణ నుండి కోరుట్ల మున్సిపాలిటీకి అవార్డ్ లభించిన విషయం తెలిసినదే. అలాగే “ఇండియన్ స్వచ్చతా లీగ్” లో భాగంగా దేశంలో నుండి 1850 పట్టణాలు ఇండియన్ స్వచ్చతా లీగ్ కి పోటీ పడగా అందులో తెలంగాణ నుండి కోరుట్ల కి అవార్డ్ లభించింది. ఇట్టి అవార్డ్ కి తెలంగాణ నుండి కేవలం 3 మునిసిపాలిటీ లు మాత్రమే అవార్డ్ కి ఎంపిక కాబడినాయి అందులో కోరుట్ల ఒకటి.
ఇట్టి అవార్డ్ ని ఢిల్లీ లో సెప్టెంబర్ 30 న కమిషనర్ MD అయాజ్ అందుకోనున్నారు.