గ్రామీణ స్వచ్ఛభారత్ మిషన్ లో జగిత్యాల టాప్ !


(J. Surender Kumar)
గ్రామీణ స్వచ్ఛభారత్ మిషన్ జగిత్యాల జిల్లా కు అరుదైన ఘనత దక్కింది.. జిల్లాకు దేశంలోనే రెండో స్థానం

గురువారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గ్రామీణ స్వచ్ఛభారత్ మిషన్ జిల్లాల కేటగిరీలో దేశంలోనే రెండో స్థానంలో జగిత్యాల జిల్లా నిలిచింది .. మూడో స్థానంలో నిజామాబాద్ నిలిచింది.
గాంధీ జయంతి రోజున జిల్లా కలెక్టర్, DRDO లు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డ్ స్వీకరించనున్నారు.
తెలంగాణలోని జిల్లాల పరంగా చూసుకుంటే
మొదటి స్థానంలో నిలిచింది.
ఇకపోతే పెద్ద రాష్ట్రాల జాబితాలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది .
గతంలో ఉన్న రికార్డ్ ను కొనసాగించిన తెలంగాణ రాష్ట్రం అవార్డుల్లో సత్తా చాటింది . రాష్ట్రానికి ఏకంగా 13 అవార్డులు వచ్చాయి.