చాకలి ఐలమ్మ వీర ధీర వనిత l
ఘనంగా నివాళులు !

(J. Surender Kumar)
చాకలి ఐలమ్మ వీర ధీర వనిత అణగారిన వర్గాల ఆశాజ్యోతి , భూస్వాముల ఆగడాలు, అన్యాయాలను ఎదిరించి స్వాతంత్ర పోరాటంలో తిరుగుబాటు స్ఫూర్తిని రగిలించిన ఐలమ్మ అమరత్వం వెలకట్టలేనిది ధర్మపురి మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్యమ్మ అన్నారు.

ఐలమ్మ 37 వర్ధంతి సందర్భంగా. స్థానిక చింతామణి చెరువు కట్టపై ఆమె విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు ఆమె చేసిన పోరాటాలను మననం చేసుకున్నారు. స్థానిక రజక సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రామన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ అయ్యోరి రాజేష్ కుమార్, కౌన్సిలర్ బండారి అశోక్, టిఆర్ఎస్ నాయకులు పురాణం సాంబమూర్తి, రజక సంఘ అధ్యక్షుడు గుండారపు అర్జున్, ఉపాధ్యక్షుడు రాచకొండ కనకయ్య , ప్రధాన కార్యదర్శి కాంపల్లి శంకర్, సభ్యులు శ్రీనివాస్, చందనగిరి రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

పేదలు ఆత్మ గౌరవం తో బ్రతకడానికి డబల్ బెడ్ రూం ఇండ్లు…..ఎమ్మేల్యే డా.సంజయ్ కుమార్


రాయికల్ మండల కట్కాపుర్ గ్రామంలో ఒక కోటి రూపాయల నిధులతో నిర్మించిన 20 డబల్ బెడ్ రూం ఇండ్లను, పల్లే ప్రకృతి వనాన్ని ప్రారంబించిన ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ గారు. ధావన్ పల్లి, కట్క పూర్, కైరి గూడెం గ్రామాల్లో నూతనంగా మంజూరైన ఆసరా పెన్షన్ కార్డ్ లను లబ్ది దారులకు పంపిణీ చేసిన జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ ఆయా గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి, కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్దిదారులకు అందజేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
ఎమ్మేల్యే మాట్లాడుతూ
డబల్ బెడ్ ప్రారంభం కొంత ఆలస్యం అయిన పేదలకు లబ్ది పొందే గొప్ప పథకం
ఎలాంటి పైరవీ లేకుండా నిజమైన అర్హులకు డబల్ బెడ్ రూం ఇండ్లు.
త్వరలోనే ఇళ్లులేని భూమి ఉన్న నిరుపేదలకు 3 లక్షల పథకం అమలు చేస్తామంటూ తదితర అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ఎమ్మెల్యే తన ప్రసంగంలో వివరించారు.
850 పెన్షన్ ప్రొసీడింగ్స్ పంపిణి!


సారంగాపూర్ మండలం లో 14 గ్రామాలలో నూతనంగా మంజూరైన 850 ఆసరా పెన్షన్ ప్రొసీడింగ్స్ కాపీ లను లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఎమ్మేల్యే డా.సంజయ్ కుమార్ ,అనంతరం 43 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 10లక్షల 50వేల రూపాయల విలువగల చెక్కులను,25మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరైన చెక్కులను లబ్దిదారులకు అందజేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొల జమున, ZPTC మనోహర్ రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


గణేష్ నిమజ్జనం తిలకించిన కలెక్టర్ దంపతులు!
జగిత్యాల పట్టణంలోని చింతకుంట చెరువులో గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని శనివారం జిల్లా కలెక్టర్ యూత్ రవి కుటుంబ సభ్యులతో కలసి తిలకించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాటు చేసిన పనులను ఆయన
పరిశీలించరు…
గణేష్ నిమజ్జనం ను తిలకించిన కాపు సంఘ నాయకులు!


జగిత్యాలలో గణనాథుని శోభాయాత్రలో పాల్గొన్న బుగ్గారం మండల జెడ్పిటిసి మున్నూరు కాపు సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ బాదినేని రాజేందర్ గారు.

పేరు పేరునా అందరినీ పలకరిస్తూ జగిత్యాల వీధివీధిలో కొలువైన గణనాథులను దర్శించుకున్న జెడ్పిటిసి బాదినేని రాజేందర్ , వారితోపాటు జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, సబ్ కలెక్టర్ అరుణశ్రీ, డీఎస్పీ ప్రకాష్, భోగ ప్రవీణ్, రాజశేఖర్ , కట్ట శివ, బండారి నరేందర్,. దాసరి లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు
కొబ్బరికాయల గణపతి


పెద్దపల్లి జిల్లా మంథని పట్టణం లో కొబ్బరికాయ లో గణపతి. విగ్రహ నిమజ్జన శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. స్థానిక వడ్లవాడ లో విశ్వబ్రాహ్మణ గణనాథుడు 50 సంవత్సరంలు పూర్తి చేసుకొంది.