చెన్నై పట్టణంలో ప్లీనరీ ఏర్పాట్లను సమీక్షించిన, ఐజేయూ నేతలు


(J. Surender Kumar)
అక్టోబర్ 29,30,31 తేదీల్లో చెన్నైలో జరగనున్న ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) జాతీయ 10వ, ప్లీనరీ సమావేశాల ఏర్పాట్లను సోమవారం నాడు ఐజేయూ నేతలు కే.శ్రీనివాస్ రెడ్డి, బల్విందర్ సింగ్ జమ్ము, ఎస్.ఎన్.సిన్హాలు  చెన్నై పట్టణంలో సమీక్షించారు.


ఈ ప్లీనరీకి అతిథ్యమిస్తున్న తమిళనాడు జర్నలిస్ట్స్ యూనియన్ (టీజేయు) రాష్ట్ర అధ్యక్షులు డి.ఎస్.ఆర్ సుభాష్, ప్రధాన కార్యదర్శి  రమేష్, పాండిచ్ఛేరి రాష్ట్ర జర్నలిస్ట్స్ యూనియన్ అధ్యక్షుడు, మది మహారాజతో పాటు ఆ రాష్ట్ర యూనియన్ ప్రధాన బాధ్యులు, హాజరై ఏర్పాట్లను వివరించారు.

ప్లీనరీలో దేశంలోని  దాదాపు 25 రాష్ట్రాల నుండి కౌన్సిల్ సభ్యులు హాజరవుతున్నందున వారు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ముందస్తుగా ప్రణాళిక బద్ధంగా. నిర్వాహకులకు బాధ్యతను తగ్గించాలని, జర్నలిస్టుల కు అసౌకర్యాలు కలగకుండా  సంతృప్తికరమైన ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులకు ఐజేయూ అధ్యక్షులు కే. శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ప్రతినిధులకు వసతి సౌకర్యం, భోజన ఏర్పాట్ల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అలాగే సభాస్థలి, అతిథులు తదితర ఏర్పాట్లను నిర్వాహకులు శ్రీనివాస్ రెడ్డికి వివరించారు.

జర్నలిస్టు పిల్లలకి 50% ఫీజు రాయితీ !
భువనగిరి కలెక్టర్ ఉత్తర్వులు జారీ!

ప్రయివేటు విద్యాసంస్థలలో జర్నలిస్టుల పిల్లలకు రాయితీ కల్పించాలని  యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పత్తికి  టి యు డబ్ల్యూ జే (ఐ జే యు) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.
ప్రయివేటు విద్యాసంస్థలలో చదువుతున్న జర్నలిస్టుల పిల్లలకు 50% ఫీజు రాయితీని కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఉత్తర్వులను జారీ చేశారు. సోమవారం ఉత్తర్వుల కాపీని కలెక్టర్ చేతులమీదుగా టి యు డబ్ల్యూ జే (ఐ జే యు) యూనియన్ కి అందచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉత్తర్వులు అమలయ్యేవిదంగా MEO లను ఆదేశిస్థానాన్ని అన్నారు. జిల్లా కలెక్టర్, DEO లకు జిల్లా కమిటీ పక్షాన కృతజ్ఞతలు

తెలియచేశారు.ఈ ఉత్తర్వులు తో జిల్లాలో సుమారు 500ల మంది జర్నలిస్టులు లబ్ది పొందనున్నారని తెలిపారు.
ప్రయివేటు విద్యాసంస్థల యాజమాన్యాలు, నిర్వాహకులు జర్నలిస్టుల పిల్లల ఫీజు రాయితి విషయంలో సహకరించ వలసిందిగా కోరుతున్నాము.ఐ. జే. యు.కౌన్సిల్ మెంబర్ యంబ నర్సి0హులు,రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మరాఠీ రవి,
టి యు డబ్ల్యూ జే (ఐ జే యు)జిల్లా ప్రధాన కార్యదర్శి వెలిమినేటి జహంగీర్, జిల్లా ఉపాధ్యక్షుడు బోనగిరి మల్లేష్,పట్టణ అధ్యక్షుడు పోతంశెట్టి కర్ణాకర్, సీనియర్ జర్నలిస్టు నాయకులు చెన్నయ్య,తాళ్ల భాస్కర్, నరసింహ చారి,నరేందర్, కూరెళ్ళ మల్లేష్, కాపర్తి సైమన్, గుండు ప్రసాద్, నాగరాజు, పాండు పలువురు జర్నలిస్టు పాల్గొన్నారు