సీఎం కేసీఆర్ హాయంలో సబ్బండ్డ వర్గాల అభివృద్ధి

ఎమ్మెల్సీ కవిత.!


( J. Surender Kumar )
సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో సబండ వర్ణాల ప్రజల అభివృద్ధి జరిగిందని. కెసిఆర్ లాంటి నాయకుడు రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశంలో ఇతర ఏ రాష్ట్రాల్లో లేవని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.


ధర్మపురిలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో గురువారం ఆమె పాల్గొన్నారు. వచ్చే ఏడాది నుండి తెలంగాణ జాగృతి ఆద్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కోలాటా పోటీల నిర్వహించనున్నట్లు ఆమె స్పష్టం చేశారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో బతుకమ్మనే ఉద్యమంగా మలిచి, ప్రపంచ దేశాల్లోనే బతుకమ్మకు గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఈ సందర్భంగా తన ప్రసంగంలో పేర్కొన్నారు.


తెరాస మహిళా విభాగం సభ్యులు & ఎల్. యం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్ పర్సన్, స్నేహలత ఆధ్వర్యంలో  ధర్మపురి పట్టణంలో జరిగిన బతుకమ్మ సంబరాలు కోలాట  పోటీలు నిర్వహించారు.

నియోజకవర్గం నుంచి దాదాపు 130 టీములు ఈ పోటీలలో పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమానికి  కవిత ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత విజేతలకు బహుమతులు అందజేశారు.

ముందుగా ఆమె స్థానిక శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు  స్వామివారి ప్రసాదం, శేష వస్త్రంతో ఘనంగా సన్మానించారు.


కాలేజ్ గ్రౌండ్ లో జరిగిన కోలాటాల నృత్యాల ప్రదర్శనను ఆమె తిలకించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ ,.కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జెడ్పి చైర్ పర్సన్,  దావ వసంత ,స్థానిక మున్సిపల్ చైర్పర్సన్  సంగీ సత్యమ్మ, జెడ్పిటిసి సభ్యురాలు బత్తిని అరుణ, ఎంపీపీ ఎడ్ల చిట్టిబాబు, జగిత్యాల్ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రావణి, బుగ్గారం జడ్పిటిసి సభ్యులు బాదినేని రాజేందర్, ఎంపీపీ బాదినేని రాజమణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్, టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.


కవిత రాక సందర్భంగా ధర్మపురి పట్టణం గులాబీ మాయమైంది. బతుకమ్మను ఎత్తుకొని కవిత గ్రౌండ్లో కొద్ది దూరం నుంచి వేదిక పైకి చేరుకున్నారు. ఈ సందర్భంగా    

బ్యాండ్ మేళాలతో కవితకు ఘన స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున బాణాసంచాము టిఆర్ఎస్ శ్రేణులు కాల్చారు.
భాషాపండితులకు న్యాయం చేస్తాం
ఎమ్మెల్సీ కవిత

ప్రభుత్వ పాఠశాల్లో పని చేస్తున్న  గ్రేడ్-2 .భాషా పండితులకు స్కూల్ అసిస్టెంట్ ,పదోన్నతులు దక్కే విధంగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని శాసనమండలి శాసనసభ్యులు  కల్వకుంట్ల కవిత హామీ ఇచ్చారు.  గురువారం బతుకమ్మ సంబురాలకై ధర్మపురి విచ్చేసిన కవితక ను రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ  (SLTA TS)  జగిత్యాల జిల్లా శాఖ బాధ్యులు  కొప్పుల ఈశ్వర్ ను వినతి పత్రం అందించారు..
ఈ సందర్భంగా కవితక్క మాట్లాడుతూ  భాషా పండితులకు జరుగుతున్న అన్యాయాన్ని తెలుసుకున్న  ముఖ్యమంత్రి  చంద్రశేఖర రావు  2017, డిసెంబర్ లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ పాఠశాలల్లోని గ్రేడ్-2 పోస్టులన్నింటినీ గ్రేడ్-1 పోస్టులుగా అప్ గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం  జీ.వో.  15 (తేది.16.02.2019)  జారీ చేసిందన్నారు.  అలాగే  పండితుల పోస్టులు ,పండితులకే దక్కే విధంగా  జీవోలు 11, 12 , లను ప్రభుత్వం సవరించిందన్నారు.
భాషా పండితుల పదోన్నతుల విషయంలో సానుకూలంగా స్పందించిన కవిత ను ఎస్.ఎల్.టి.ఎ. జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షుడు రంగ శ్రీనివాస్,  బాధ్యులు హరిహరప్రసాద్, నలువాల రాజేంద్ర ప్రసాద్, కృతజ్ఞతలు తెలిపారు. .మహిళా భాషోపాధ్యాయినిలు  బుగ్గరాపు శ్రీలత,  జయప్రద,  లావణ్య,  అక్కనపెల్లి శ్రీనివాస్ , కొరిడే రమేష్,  కన్నయ్య,  అన్వరఖాన్, డి ప్రశాంత్,  జన్మంచి నర్సయ్య, గుండి నర్సయ్య, ప్రదీప్  బోగా శివప్రసాద్ రాజేందర్, పెండ్యాల రాజేష్.తదితరులు కలసి పత్రం అందించారు.