(J.Surender Kumar).
గవర్నర్ హోదాలో ఉండి, రాజకీయ నాయకురాలిగా మాట్లాడడం శోచనీయమన్నారు..
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన స్వచ్ఛ గురుకుల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తెలంగాణ గవర్నర్ వ్యవహరిస్తున్న తీరును మార్చుకోవాలని సూచించారు…
దేశ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ లాంటి, మహా నాయకుడు రావడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు…

గవర్నర్ వాక్యాల పై విలేకరులు అడిగిన ప్రశ్నకు మంత్రి మాట్లాడుతూ
తెలంగాణ గవర్నర్ తమిళసై రాజకీయ నాయకురాలిగా మాట్లాడడం శోచనీయమన్నారు… రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్, ప్రభుత్వంపై విమర్శలు చేయడం, సరైన పద్ధతి కాదన్నారు…
తెలంగాణలో మెడికల్ కాలేజీలు ఏర్పాటుకు కేంద్రం సహకరించకపోయినా, ఇక్కడ విద్యార్థులు ఎంబీబీఎస్ లు పూర్తి చేసి, డాక్టర్లు అవుతున్నా విషయాన్ని గవర్నర్ గమనించాలన్నారు…
తెలంగాణ వ్యాప్తంగా అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శమన్నారు… దేశవ్యాప్తంగా ఈ పథకాలు అమలు చేసేందుకు సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలన్నారు… సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావడానికి స్వాగతిస్తున్నామని తెలిపారు…
తెలుగు భాషా దినోత్సవం !

జిల్లా కేంద్రం లోని కలేక్టరేట్ కార్యలయంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి, తెలంగాణ భాషా దినోత్సవం వేడుకలు .
ఈ సందర్భంగా ప్రజాకవి కాళోజీ చిత్రపటానికి పూలమాలలు నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ జి,రవి ,అదనపు కలెక్టర్ బి. స్. లత , లోకల్ బాడీ కలెక్టర్ అరుణశ్రీ ,కలెక్టరేట్ ,ఏవో సూపర్డెంట్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు
పద్మనాయక కల్యాణ మండపంలో వెలమ సంక్షేమ మండలి గణనాధుని లడ్డు వేలం.

₹ 1,59,000 (ఒక లక్ష యాబై తొమ్మిది వేలు) కు చెన్నమనేని పవిత్ర – రాంబాబు రావు లు గణేశుని లడ్డూ ను దక్కించుకున్నారు
పట్టణంలోని శ్రీ లక్ష్మీగణేష మందిరం లో గణనాథుని లడ్డు వేలం
₹ 1.15116/- లడ్డూ ని దక్కించుకున్న వంజరి రామ్ సేన., జగిత్యాల

పోలీస్ రిక్రూట్ మెంట్ మార్కుల్లో అవకతవకలు సరి చేయాలని,

జగిత్యాల జిల్లా కేంద్రంలో
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజా సంఘాల నాయకులు శుక్రవారం ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు దుమాల గంగారాం అధ్యక్షతన
రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ తీసుకున్న రిజర్వేషన్ల అమలులో నిబంధనలను అతిక్రమించారని, రాజ్యాంగ పరిధిలో ఉన్న రిజర్వేషన్లు అమలు చేయడం లేదని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను అమలు చేయని బోర్డ్ చైర్మన్ శ్రీనివాసరావును వెంటనే సస్పెండ్ చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ ఐపీఎస్ అధికారులను నియమించాలని వారు డిమాండ్ చేశారు.
ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక చట్టం ఉందని, రాజ్యాంగం మారుస్తానని సీఎం కేసీఆర్ ఎలా కామెంట్స్ చేశారో అలాగే పరోక్షంగా రాజ్యాంగాన్ని మార్చడానికి కెసిఆర్ సిద్ధంగా ఉన్నారని అర్థమవుతోందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఎత్తివేయాలని చూస్తోందన్నారు.
పరీక్షా ఫలితాలు రాకముందే సబ్ నోటిఫికేషన్ ఇవ్వాలని మందకృష్ణ మాదిగ కోరారని, దాన్ని వెంటనే అమలు చేసి పోలీస్ రిక్రూట్ మెంట్ లో అందరికీ సమానమైన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ బోర్డు నిర్ణయం తప్పయితే బోర్డే బాధ్యత వహించాలన్నారు. సీఎం కేసీఆర్ దీనిపై నిర్ణయం తీసుకోకుంటే రాజకీయ పతనానికి నాంది అవుతుందన్నారు.
ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ దుమాల గంగారాం అధ్యక్షతన జరిగిన ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు గాజుల నాగరాజు, తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుడు చుక్క గంగారెడ్డి, టీడీపీ రాష్ట ఆర్గనైగింగ్ సెక్రెటరీ అక్కేనపల్లి కాశీనాథమ్, జిల్లా అధికార ప్రతినిధి బేజ్జంకి సతీష్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సురుగు శ్రీను జగన్,
జిల్లా ప్రచార కార్యదర్శి బోనగిరి కిషన్, జిల్లా ప్రధాన కార్యదర్శి నక్క రాజన్న, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీరామ్ అంజయ్య, యువసేన జిల్లా ఇంఛార్జి బోల్లే అనిల్, యువసేన జిల్లా అధికార ప్రతినిధి మోతే సుధాకర్, ధర్మపురి నియోజకవర్గ ఇన్చార్జి దికొండ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్ నిమజ్జనం బందోబస్తు 35 వేల మంది పోలీసు అధికారులతో బందోబస్తు !

తెలంగాణ డీజీపీ కార్యాలయం నుండి హైదరాబాద్ నగరం తోపాటు రాష్ట్రంలోని పలు నగరాల్లో జరుగుతున్న గణేష్ నిమజ్జనం శోభాయాత్ర ను సీ.సీ టీవి ల ద్వారా పర్యవేక్షిస్తున్న రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు. శుక్రవారం నిమజ్జన సందర్భంగా మూడు కమిషనర్ పరిధిలో 35 వేల మంది పోలీస్ అధికారులు బందోబస్తు పర్యవేక్షిస్తున్నారు అంటూ ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ మహనగరం తోపాటు రాష్ట్ర ప్రజలందరికీ వినాయక నిమజ్జన ఉత్సవ శుభాకాంక్షలు తెలిపారు., గత 9 రోజులు గా ఏవిధమైన అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా గణేష్ ఉత్సవాలు నిర్వహించడం పట్ల అబినందనలు తెలియచేసారు.

శుక్రవారం జరిగే గణేష్ నిమజ్జన శోభాయాత్ర ను కూడా ప్రశాంతంగా నిర్వహించేందుకు మూడు కమీషనరేట్ల పరిధిలో 35,000 మంది పోలీసు అధికారులు బందోబస్తు విధుల్లో ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 10 లక్షల సీసీ టీవీ ల ద్వారా పర్యవేక్షణ, హైదరాబాద్ తో సహా రాష్ట్రంలో వివిధ నగరాలు, పట్టణాలలో జరిగే నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరపడానికి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసాం.
ఈ నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరగడానికి ప్రతీ ఒక్కరూ పొలీసు యంత్రాంగం తో సహకరించాలని కోరుతున్నాను అని పేర్కొన్నారు.

ధర్మపురి గోదావరి నదిలో శోభాయానంగా గణేష్ నిమజ్జనం !

పుణ్యక్షేత్రం ధర్మపురి గోదావరి నది తీరంలో గణేష్ మూర్తులు నిమజ్జనం శోభాయానంద కొనసాగుతున్నది.

తొమ్మిది రోజులపాటు ఘనంగా పూజలు అందుకున్న అంగరంగ వైభవంగా అలంకరించిన వాహనాలు ఊరేగింపుగా భక్తజనం నదీ లో నిమజ్జనం చేశారు.. మంత్రి కొప్పుల ఈశ్వర్ గాంధీ చౌక్ వద్ద వినాయక విగ్రహాలకు స్వాగతం పలికారు. గోదావరి నది తీరం వద్ద ఇష్టానికి మున్సిపల్ వారు విస్తృత స్థాయి ఏర్పాటులు చేశారు.

స్థానిక దరూల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిమజ్జనం సందర్భంగా భక్తులకు మంచి నీళ్ళు సౌకర్యం కల్పించారు.