సీఎం నా ముఖం చూడవద్దు అనుకుంటే బహిరంగంగా చెప్పండి. దమ్ముంటే ప్రకటించండి. ప్రజా క్షేత్రంలో తేల్చుకుందాం. ఇప్పటికే నీ దగ్గర వచ్చి పోటీ చేస్తా అని ఛాలెంజ్ చేసిన. బెదిరింపులకు భయపడం.చావుకైనా సిద్ధం కానీ రాజీపడే ప్రసక్తే లేదు.ప్రజా సమస్యలు ప్రస్తావించటంలో 20 ఏళ్లుగా ఏ పాత్ర పోషించామో అదే పాత్ర పోషిస్తా.
స్పీకర్ గారు నాకు తండ్రి లాంటి వారు, రాజకీయాలు ఏమన్నా ఉండవచ్చు కానీ ఆయన మీద నాకు గౌరవం ఉంది. .ఆయనకు అపార అనుభవం ఉంది.
హుందాగా ఉండే, ధర్మంగా ఉండే స్పీకర్ గారిని అడ్డం పెట్టుకొని మీరు ఇలాంటి పని చేస్తున్నారు. నేను అవమానపరచలేదు, మీరు అవమాన పరుస్తున్నారు. మీరు ఆయన స్థాయి తగ్గిస్తున్నారు. క్షమాపణ చెప్పాల్సింది మీరు.. నేను కాదు.
ప్రజాస్వామ్య ముసుగులో కెసిఆర్ రాచరికపు పాలనచేస్తున్నారు. ఈటెల రాజేందర్ అన్నారు.
శాసన సభ మూడు విడతలు జరుగుతుంది.
బడ్జెట్ సమావేశాలు,
వర్షాకాల సమావేశాలు,
శీతాకాల సమావేశాలు జరుగుతాయి.
60-80 రోజుల పాటు జరగడం ఆనవాయితీ. కానీ కుందించి వారి ఇష్టం వచ్చినట్టు నడుపుకుంటున్నారు.
సభాపతి పార్టీలకు అతీతంగా శాసన సభ ఔన్నత్యాన్ని కాపాడాలి.
సభ్యుల హక్కులను కాపాడాలి, సభ్యులకు అవకాశం కల్పించడం ఆయన పని.
కేసిఆర్ గారు రెండవ సారి గెలిచిన తరువాత సంప్రదాయలు, మర్యాదలు తుంగలోతొక్కారు. అన్నీ రూల్స్ ప్రకారమే ఉండవు, సంప్రదాయాలు కూడా ఉంటాయి. ప్రజా సమస్యలు దృష్టిలో పెట్టుకొని అజెండా సిద్దం చేస్తారు. కానీ నిన్న బీజేపీ సభ్యులను BAC కి పిలవలేదు.
బాధ అనిపించింది అందుకే మీడియా పాయింట్ లో మాట్లాడాను.
అసెంబ్లీ చాలా పవిత్ర మైనది. ఆ పవిత్రత ప్రజాసమస్యల మీద చర్చించినప్పుడే ఉంటుంది అని చెప్పాను.
సీఎం ఇనుపకంచెల మధ్య ప్రగతి భవన్లో ఉంటారు. లేదా పోలీసు పహరా మద్య ఫామ్ హౌస్ లో ఉంటారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం సీఎం దగ్గరికి వెళ్ళాలి అంటే అపాయింట్మెంట్ తీసుకొని పోవాలి. ఇక సామాన్యప్రజానీకానికి ఆయన దొరకనే దొరకరు. అందుకే తమ సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించమని అనేకమంది మాదగ్గరికి వస్తున్నారు. ఆ మాట్లాడే అవకాశం లేకుండా చేస్తా అంటే బాధ కలగదా..
అయిన నేను ఎక్కడ కూడా అన్ పార్లమెంటరీ పదాలు వాడలేను. పద్దతి లేదా? అహంకారం ఎక్కువ అయ్యింది అని మంత్రి గారు అంటున్నారు . నేను నలుగురు సీఎంలు, నలుగురు స్పీకర్లతో పని చేశాను. 20 సంవత్సరాల్లో ఏ ఒక్కరూ కూడా నన్ను వేలెత్తి చూపించలేదు. కించపరిచేలా మాట్లాడారు అని ఎవరు అనలేదు. ఇప్పుడు ఆ ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు.
MIM, కాంగ్రెస్, తెరాస మూడు కూడబలుక్కుని మాట్లాడుకుంటున్నారు.
సమస్యలపై మాట్లాడాలి అని కోటి ఆశలతో పోయినం. ఈటల రాజేందర్ ముఖం చూడవద్దు అని కెసిఆర్ అనుకున్నారట. అందుకే పోయిన అసెంబ్లీ సమావేశాల్లో మా బెంచ్ దగ్గర ఉన్న మమ్ముల్ని అకారణంగా సస్పెండ్ చేశారు. తొలి సారి అసెంబ్లీ ప్రాంగణంలో పోలీసులతో అరెస్ట్ చేపించారు.
దళితులు 3 ఎకరాలు ఇస్తా అని ఇవ్వలేదు. లాండ్ పూలింగ్ పేరిట తాతల కాలం నుండి సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూములను లాక్కున్నారు. ప్రైవేట్ వ్యక్తులకు భూములు సేకరించే లాండ్ బ్రోకర్స్ లాగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దళిత బంధు కోసం 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా.. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అని మాట్లాడిన సీఎం ఎందుకు రాష్ట్రమంతా ఈ పథకం అమలు చేయడంలేదు.
రైతు రుణ మాఫీ చెయ్యక రైతులకు బ్యాంక్స్ లోన్లు ఇవ్వడం లేదు. రైతులు మళ్లీ షావుకారు వద్ద అప్పులు తీసుకుంటున్నారు. రైతులు ఎవరన్నా పిల్లల చదువుకోసం లోన్ తీసుకుందామని వెళితే నువ్వు డిఫాల్టర్ అని లోన్లు ఇవ్వడంలేదు. రైతుబంధు డబ్బులు వచ్చినా అందులోనే జమ చేసుకుంటున్నారు. పర్సనల్ అకౌంట్స్ లో ఉన్న డబ్బులు కూడా లోన్ కింద జమ చేసుకుంటున్నారు.
వర్షం పడి రైతులు పంటలు నష్ట పోయారు. ఫసల్ భీమా ఉంటే వారికి నష్టపరిహారం వచ్చేది కానీ అది లేకుండా చేశారు.
ఐఐఐటి లో పిల్లలు సమ్మె చేస్తున్నారు. గవర్నర్ గారు పోయి సమస్యలు పరిష్కరించే పరిస్థితి వచ్చింది అంటే ఈ రాష్ట్రం ఎటుపోతుంది.
సీఎం బీహార్, పంజాబ్ వెళ్లి సాయం చేస్తున్నారు సరే .. మరి ఇక్కడి పేద పిల్లలకు పురుగుల అన్నం పెడతారా ? వారి గురించి పట్టించుకోరా ?
వారి తల్లదండ్రులు వచ్చి ఈ సమస్యమీద మాట్లాడమని కోరుతున్నారు.
మత్య కారుల జీవితాల్లో మట్టి కొడుతున్నారు. మల్లన్న సాగర్ లో 76 చెరువులు పోయాయి. వారికి సభ్యత్వాలు ఇవ్వమంటే ఇవ్వడం లేదు. ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు.
ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల గోస పట్టించుకోవడం లేదు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలి అని కోరుతున్నారు. బేస్ మార్క్స్ పై ఆందోళన చేస్తున్నారు.
VRA లు 45 రోజులుగా ధర్నా చేస్తూ 23 మంది చనిపోతే ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అసెంబ్లీ వేదికగా ఈ సమస్య ప్రస్తావించాలి కదా?
విద్యా వాలంటీర్లు, గేస్ట్ లెక్షరర్స్ సమస్యలు పట్టించుకోవడం లేదు.
స్పీకర్ గారు స్వాతంత్రం గా వ్యవహరించాలి. ప్రజాసమస్యల చర్చించే వేదికగా అసెంబ్లీనీ ఉంచాలి. సభ్యుల హక్కులు కాపాడాలి. అలాంటి స్పీకర్ పట్టించుకోకపోతే మరమనిషి అని అన్నాను.
సభా నాయకుడు స్పీకర్ మీద కొంత వొత్తిడి చేయవచ్చు కానీ ప్రజల కళ్ళ ముందే మా హక్కులను కాలరాసి, మమ్ముల్ని అవమాన పరుస్తుంటే మా రక్షణకు రారా ?
మేము అసెంబ్లీకి ఆహా ఓహో అనడానికి వచ్చామా ? ముఖ్యమంత్రి నీ పోగడడానికి రాలేదు. సమస్యలతో సతమవుతున్న ప్రజల పక్షాన పోరాడడానికి వచ్చాము. అది వద్దు అనుకుంటే అది ప్రస్తావించవద్దు అనుకుంటే అది మీ విజ్ఞత.
మాకు ప్రజాస్వామ్యం మీద సంపూర్ణ విశ్వాసం ఉంది.
మత పిచ్చి, కుల పిచ్చి, ఉన్మాదుల అంటారు.. ఇది తెల్చాల్సింది ప్రజలు మీరు కాదు.
ప్రజలు అన్నీ గమనిస్తున్నారు ,అంతిమ నిర్ణేతలు ప్రజలు
తెలంగాణ ప్రజలు విజ్ఞులు, చైతన్యవంతులు, ధర్మాన్ని ఆచరిస్తున్న వారు.
ఇలాంటి సందర్భాల్లో ఎలా బుద్ది చెప్పాలో వారికి తెలుసు.
గొల్ల కురుమలు, మత్యకారుల పక్షాన ఉంటాం. బ్రోకర్లు వద్దు అని అంటున్న గొల్లకురుమల పక్కన ఉంటాం. అణచివేత, అన్యాయం గురి అయిన వారి పక్షాన ఉంటాం.
స్పీకర్ మీద, సభ మీద సంపూర్ణ విశ్వాసం ఉంది.
స్పీకర్ అందరి వాడు.
మా హక్కులు కాపాడే ప్రయత్నం చేయాలి.
ప్రజాస్వామ్య ముసుగులో కెసిఆర్ రాచరికపు పాలనచేస్తున్నారు.
వీరి సంగతి మునుగోడు ఎన్నికల్లో తెలుస్తుంది. అంటూ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రెస్ మీట్ కొనసాగించారు.