( J. Surender Kumar )
స్వచ్ఛ భారత్ మిషన్ ( గ్రామీణo ) లో జిల్లాల కేటగిరిలో జగిత్యాల దేశ స్థాయిలో రెండో స్థానం సాధించిన సందర్భంగా శనివారం జిల్లా కలెక్టర్ జి రవి నీ కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో జిల్లా పౌర సంబంధాల అధికారి మామిండ్ల దశరథం , తెలంగాణ సాంస్కృతిక సారధులు ఘనంగా పుష్పగుచ్చం, శాలువా తో ఘనంగా సత్కరించారు . మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి టీమ్ లీడర్ పర్శ రాములు, TSS ఆర్టిస్ట్ లు పాల్గొన్నారు.
అంతకుముందు జిల్లా కలెక్టర్ ను జిల్లాలోని పలువురు గ్రామ పంచాయితీ సర్పంచ్ లు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు
బొడ్డెమ్మ సంబరాలు !

జగిత్యాల జిల్లా కేంద్రంలోని మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ జగిత్యాల జిల్లా వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బొడ్డెమ్మ సంబరాలను ప్రారంభోత్సవంలో భాగంగా జిల్లా కలెక్టర్ జి రవి మరియు


మన ఊరు మనబడి పనులను వేగవంతం చేయాలి : కలెక్టర్ గుగులోతు రవి

మన ఊరు మనబడి కార్యక్రమం పనులను వేగవంతం చేయాలనీ జిల్లా కలెక్టర్ గుగులోతు రవి స్థానిక ప్రజాప్రతినిధులు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ లకు సూచించారు.
శనివారం బుగ్గారం మండలంలోని బుగ్గారం వెలుగొండ, చిన్నాపూర్, మద్దూరు గ్రామాల్లో పర్యటించిన జిల్లా కలెక్టర్ మన ఊరు మనబడి కార్యక్రమం పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో జిల్లా అదనపు కలెక్టర్ లత, deo జగన్మోహన్ రెడ్డిలతో కలిసి పరిశీలించారు.

మన ఊరు మనబడి కార్యక్రమం మొదటి దశలో బుగ్గారం మండలం లోని బుగ్గారం వెలుగొండ, చిన్నాపూర్, మద్దూరు గ్రామాల్లో ఎంపికైన రెండు ఉన్నత పాఠశాలలు, మూడు ప్రాథమిక పాఠశాలలు, ఒక ప్రాథమిక ఉన్నత పాఠశాలలో చేపడుతున్న మౌలిక సదుపాయాల కల్పన పనుల్లో వేగం పెంచాలని అన్నారు. నెల రోజుల్లో గా పనులు పూర్తి అయ్యేలా చూడాలన్నారు.