దేవులపల్లి అమర్ పదవీకాలం పొడగింపు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మీడియా, అంతరాష్ట్ర వ్యవహారాల సలహాదారుగా పనిచేస్తున్న దేవులపల్లి అమర్ పదవీ కాలాన్ని మరో సంవత్సరం పొడగిస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

జీవో నెంబర్ సంఖ్య 1888, ద్వారా పదవీకాలం పోడగిస్తూ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ G.O లో పేర్కొన్నారు.

ఆంధ్ర ప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటైన మూడు నెలల్లోపు దేవులపల్లి అమర్ ను జాతీయ ,రాష్ట్ర మీడియా సలహాదారుగా, క్యాబినెట్ హోదా కల్పిస్తూ నియమించారు. గత మూడున్నర సంవత్సరాలుగా అమర్ ప్రభుత్వ సలహాదారుడిగా కొనసాగుతున్నారు.

బందోబస్తు ఒకవైపు .. మాతృత్వపు మమకారం మరోవైపు !
ఎస్పీ సింధూ శర్మ సవ్యసాచి !


జగిత్యాల జిల్లా ఎస్పీ సింధు శర్మ శుక్రవారం గణేష్ నిమజ్జనం సందర్భంగా బందోబస్తు విధులు పర్యవేక్షణ శాంతిభద్రతలు నిర్వర్తిస్తూనే, మాతృమూర్తిగా తన మమకారాన్ని పిల్లలతో పంచుకున్నారు ఈ దృశ్యం చూపర్ల కు ఆమె సవ్యసాచిల అగుపించారు..

వినాయక నిమజ్జనం బందోబస్తు కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూనే తన కూతురును ఎత్తుకుని లాలించారు. గణేష్ నిమజ్జనాలను చూపిస్తూ.. మరోవైపు బందోబస్తును పర్యవేక్షించారు. ఓవైపు జోరుగా కురుస్తున్న వర్షం, గణపతి బప్పా మోరియా అంటూ మేళ తాళాలతో భక్తజనం నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా తరలివస్తున్న విగ్రహాలు వాహనాల సందడి. తల్లిగా, శాంతి భద్రతలు పర్యవేక్షణతో పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అనుక్షణం పోలీస్ శాఖను అప్రమత్తం చేస్తూ ఆదేశాలు జారీ చేయడం. తదితర అంశాల పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.


సింధు శర్మ జగిత్యాల జిల్లా ఎస్పీగా 2018 సెప్టెంబర్ 5న బాధ్యతలు చేపట్టారు.