(J.Surender Kumar)
తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం అర్ధరాత్రి నుంచి NIA. బృందాలు అనుమానిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా. (P.F.I ) సభ్యులపై ఇళ్లపై చేస్తున్న దాడులు ప్రజల్లో దడ పుట్టిస్తున్నాయి. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (N I A) కేంద్ర దర్యాప్తు సంస్థ కావడం, అనుమానిత ప్రతి అంశాన్ని జాతీయస్థాయిలో, దేశ సమగ్రత, భద్రత కోణంలో NIA విచారిస్తుంది. ఈ సంస్థకు విశేష అధికారాలు చట్టం కల్పించడంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కు మీరు జవాబు దారిగా ఉంటారు. అందుకే ప్రజా ప్రతినిధులు, పై పైరవి కారులు, ఈ సంస్థ అధికారులను సంప్రదించడానికి, దాడుల గురించి కానీ, విచారణకై అదుపులో తీసుకున్న వారి గూర్చి, సంప్రదించడానికి జంకుతుంటారు.

N.I. A ఏర్పాటు….
2008. డిసెంబర్ 31 న భారత పార్లమెంట్ చేసిన చట్టం ద్వారా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (N. I A) ఏర్పడింది. ముంబై నగరంలో నవంబర్ 26, 2008 లో జరిగిన మారణ హోమంలో 175 మంది అధికారిక లెక్కల ప్రకారం ప్రాణాలు కోల్పోయారు, పాకిస్తాన్ కు చెందిన పదిమంది ఉగ్రవాదులు విచక్షణారహితంగా జరిపిన కాల్పులే ఈ మారణ హోమం, ఇందులో కసాబ్ అనే ఉగ్రవాదినీ పోలీస్లు ప్రాణాలతో పట్టుకున్నారు.

ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం పార్లమెంట్లో పకడ్బందీ చట్టం ద్వారా NIA ను ఏర్పాటు చేశారు. కౌంటర్ టెర్రరిస్ట్ టాస్క్ ఫోర్స్ , ఆ రాష్ట్రాల్లో ఇంటలిజెన్సీ వర్గాల వైఫల్యం , ఉగ్రవాద సంబంధిత నేరాలు, దేశ అంతర్గత భద్రత, మానవ అక్రమ రవాణా, నకిలీ కరెన్సీ బ్యాంకు నేరాలు, సైబర్ టెర్రరిజం, పేలుడు పదార్థాలు, డ్రగ్స్ నేరాలు అంశాలపై విచారణ జరిపే విశేషాలు NIA సంస్థకు పార్లమెంట్ ద్వారా సంక్రమించింది. ప్రధాన కార్యాలయం ఢిల్లీ. హైదరాబాద్, కొచ్చిన్, లక్నో, ముంబై, కోల్కత్తా, రాయపూర్, జమ్మూ ,చండీగఢ్ , రాంచి, చెన్నై, ఇంపాల్ రాష్ట్రాలలో కార్యాలయాలు ఉన్నాయి..
ప్రత్యేక అధికారాలు !

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఆయా ప్రాంతాల్లో విచారణ చేపట్టనున్న NIA రాష్ట్రాల, ఆయా ప్రభుత్వాల అనుమతి లేకుండా విచారణ చేపడుతుంది. విదేశాల్లో తలదాచుకున్న నేరస్తుల ను ఆయా దేశాల్లో ప్రభుత్వాల అనుమతితో దాడులు చేసి నేరస్తులను పట్టుకునె అధికారం ఉంది. అయితే భారతదేశంలో నేరం జరిగిన సంఘటనలో వారికి సంబంధం ఉండి ఉండాలి. 2012 సంవత్సరంలో సౌదీ ఇంటెలిజెన్స్ విభాగం, ఇంటర్ పోల్, NIA కలిసికట్టుగా సోదాలు జరిపి అక్కడ తగలచుకున్న ఉగ్రవాదులు, ఆబూ జిందాల్ @ హబూ హామజ్ద్, ఫాసిస్ మహమ్మద్, యాసిన్ భత్కల్ ను అదుపులోకి తీసుకున్నారు. సంస్థకు దేశవ్యాప్తంగా 38 ప్రత్యేక న్యాయస్థానాలు ఉన్నాయి. మావోయిస్టుల , సహకరిస్తున్నారనే ఆరోపణలు, అర్బన్ నక్సలైట్లు అంటూ వారి ఇండ్లపై దాడులు జరుపుతున్న విషయం తెలిసిందే. సంస్థకు ప్రధాన అధికారిగా ఐపీఎస్ కొనసాగుతారు.
కేసు మరోసారి నమోదు చేసుకునే అధికారం !

ఆయా రాష్ట్రాల పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులను (ఉగ్రవాద సంబంధిత అనుమానంపై) N IA. తిరిగి నమోదు చేసుకునే అధికారం ఉంది. నిజామాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జులై 4, 2022లో. F.I.R. No 141/ 2022 నమోదయింది. ఇందులో అబ్దుల్ ఖాదర్, షేక్ సాదుల్లా, ఎండి ఇమ్రాన్, ఎండి అబ్దుల్ మోసిన్ లు నిందితులుగా నమోదయింది. ఇదే ఎఫ్ఐఆర్ ను NIA అధికారులు ఆగస్టు 26, 2022 లో PFI case /R.c-03/2022/NIA/Hyd గా ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తును, దాడులను ముమ్మరం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సెప్టెంబర్ 18 సాయంత్రం వరకు తెలంగాణలో 23, నంద్యాలలో 4, హైదరాబాదులో 7, జగిత్యాల 2, నిర్మల్ లో ఒకచోట దాదాపు 38 ప్రాంతాల్లో దాడులు నిర్వహించి డాక్యుమెంట్లు, డిజిటల్ పరికరాలు, నగదు ₹ 8,31,500/- స్వాధీనపర్చుకున్నట్టు N.I. A జారీ చేసిన ప్రకటనలో పేర్కొంది. సోమవారం నలుగురు అనుమానితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సమాచారం. విచారణ పేరిట న్యాయస్థానం అనుమతితో NIA వారిని అదుపులో తీసుకుని విచారించి సమాచారం సేకరించి NIA మరిన్ని దాడులు నిర్వహించే అవకాశం ఉందనే చర్చ నెలకొంది.