ఎమ్మేల్యే డా. సంజయ్ కుమార్.
జగిత్యాల పట్టణ 11వార్డ్ కి చెందిన క్రాంతి కి దళిత బందు పథకం ద్వారా మంజూరైన మారుతి ఏర్టిగా వాహనాన్ని గురువారం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ లబ్ధిదారునికి అందించారు. ఈ సందర్భంగా ఎమ్మేల్యే మాట్లాడుతూ
దళితుల జీవితాల్లో వెలుగులు నింపి,.ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తూ, భావితరాలకు బంగారు బాట వేయాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకం అమలు చేస్తున్నారని అన్నారు. దళితులు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు దళిత బంధు పథకం ప్రవేశపెట్టారన్నారు.
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తూ ముఖ్యమంత్రి దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారు అని అన్నారు. దళిత బంధు పథకం ద్వారా ఒక్క రూపాయి కూడా బ్యాంకు లోన్ లింకేజీ లేకుండా ₹ 10 లక్షల రూపాయలను నేరుగా దళితుల అకౌంట్లలో జమ చేయడం జరిగిందన్నారు. దళితులు వారు కోరుకున్న రంగాల్లో ఎదిగేందుకు మంచి యూనిట్లను ఎంచుకొని ఆర్థిక సాధికారత సాధించాలన్నారు. దళిత బంధుతో క్లీనర్ గా, డ్రైవర్ గా ఉన్న వారు నేడు వాహనానికి యజమాని అయ్యారు, ప్రతి పక్ష నాయకుల అసత్య ప్రచారాలు నమ్మి మోసపోవద్దని అభివృద్ధి సంక్షేమం కళ్ళ ముందే ఉన్నాయని అన్నారు. గతంలో దళితులను ఓటు బ్యాంక్ రాజకీయాలకే వాడుకున్నారు అని ఈ సందర్భంగా ప్రతిపక్షాలను విమర్శించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ నాయకులు,ప్రజా ప్రతినిదులు,తదితరులు పాల్గొన్నారు.
టిఆర్ఎస్ లో చేరికలు !
బీర్ పూర్ మండలం కోల్వాయి గ్రామానికి చెందిన 20మంది బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల పట్ల ఆకర్షితులై మాజీ సర్పంచ్ మల్లేశం అధ్వర్యంలో టీఆరెఎస్ పార్టీ లో చేరగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పార్టీ కండువా కప్పి. వారిని. పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో KDCC జిల్లా మెంబర్ , రామ్ చందర్ రావు, జిల్లా రైతు బంధు సమితి సభ్యులు కొలుముల రమణ, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి శీలం రమేష్, గ్రామ శాక అధ్యక్షులు రమకిష్టు , సతీష్, నాయకులు రమేష్, గుండా సురేష్, తదితరులు పాల్గొన్నారు.
ధరణి అవగాహన సదస్సు!

జగిత్యాల పట్టణ SVLR ఫంక్షన్ హాల్ లో సమీకృత భూమి రికార్డుల నిర్వహణ కై తెలంగాణ ప్రభుత్వం ప్రారంబించిన ధరణి పోర్టల్ లోని, ధరణి మాడ్యుల్స్ పై ప్రజా ప్రతినిదులకు అవగాహన సదస్సు కార్యక్రమంలో ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ , అదనపు కలెక్టర్ బి ఎస్ లత, RDO మాధురి, ఎమ్మర్వో లు అరిప్ ,నవీన్, ఎంపీపీ రాజేంద్ర ప్రసాద్, ZPTC మహేష్, AMC ఛైర్మెన్ నక్కల రాధ,మండల రైతు బందు సమితి కన్వీనర్ నక్కల రవీందర్ రెడ్డి,.ప్రజా ప్రతినిదులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
బతుకమ్మ చీరలు , పెన్షన్ కార్డుల పంపిణీ !

గురువారం బుగ్గారం మండలం, సిరికొండ , శకల, బీరసాని గ్రామల్లో ఆసరా పింఛన్ ఐడి కార్డులు, బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఎంపీపీ జడ్పిటిసిలు బాదినేని రాజమణి రాజేందర్ పాల్గొని పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సుచేందర్, గ్రామ సర్పంచులు దివ్య ప్రవీణ్ , వెల్కటూరి మమత రమేష్ కాలకూరి రాధా సత్తయ్య ,
ఎంపీటీసీలు లక్ష్మీ బుచ్చయ్య , నోముల శ్రీలత చుక్కారెడ్డి , మండల అధ్యక్షులు గాలిపెల్లి మహేష్ , సూపర్డెంట్ రాణి , మరియు టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు