ధరణి సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ రవి

ధరణి సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలి:
జిల్లా కలెక్టర్ బి. రవి
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణిని వేగవంతంగా పూర్తి  చేయాలని జిల్లా కలెక్టర్ బి.రవి అధికారులను ఆదేశించారు.
గురువారం జిల్లా కలెక్టర్ క్యాంప్  కార్యాలయం నుండి  అధికారులతో జూమ్ వెబ్ కాన్పరెన్స్ ద్వారా  జిల్లా కలెక్టర్ జి.రవి సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులలో జాప్యం ఉండకుండా పంపిణిని వేగవంతంగా పూర్తి చేయాలనీ ఆదేశించారు. చెక్కుల పంపిణిలో ఆలస్యం ఎందుకు జరుగుతుందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ధరణి ద్వారా ఆన్ లైన్ లో వచ్చిన ధరఖాస్తులను పరిష్కరించాలని తహసిల్దారులను  ఆదేశించారు. ఏ ఏ గ్రామాలలో  ఏ ఏ సర్వ్ నెంబర్లు జెన్యూన్ గా ఉన్నాయో మీ సేవ ఆపరేటర్ తో కలిసి  ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి రిపోర్ట్ సమర్పించాలని అధికారులకు సూచించారు.  ధరణిలో  పేరు మార్పు, భూమి స్వభావం యొక్క మార్పు, భూమి వర్గీకరణ మార్పు, భూమి రకం మార్పు , విస్తీర్ణం సవరణ, మిస్సింగ్ సర్వే/ సబ్ డివిజన్ నెంబర్, నోషనల్ ఖాతా ( అన్ని రకాలు) నుండి పట్టా భూమిగా బదిలీ చేయడం, భూమి రకం మార్పు, భూమి వినియోగాన్ని నాలా నుండి వ్యవసాయానికి మార్చాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణి ద్వారా వచ్చిన సమస్యలు పెండింగ్ లో లేకుండా వేగవంతంగా పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. బి.ఎల్.ఓ.లకు ఎన్నికల గురించి శిక్షణ కార్యక్రమం చేపట్టాలని అధికారులకు సూచించారు.


ఈ మీటింగ్ లో అదనపు కలెక్టర్ బి.లత, ఎల్.డి.యం. వెంకట్ రెడ్డి, ఏ.డి.మైన్స్ విజయ్ కుమార్,  ఆర్.డి.ఓలు,మాధురి. వినోద్ కుమార్. కలెక్టరేట్ సుపరింటెండేన్ట్లు, అధికారులు, తహశీల్దార్లు, నాయబ్ తహశీల్దార్లు పాల్గొన్నారు.
విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ!


అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవంను పురస్కరించుకుని పట్టణంలో రోటరీ క్లబ్-పట్టణ వైశ్య సంఘం-ఆపి అధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వినాయక నవరాత్రోత్సవాలలో భాగంగా… వైశ్యభవనం ఆవరణలో వినాయక మండపంవద్ద విద్యార్థులతో సరస్వతీ పూజ నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు,


ఈ కార్యక్రమంలో జిల్లా వైశ్య సంఘం అధ్యక్షుడు కొత్త సురేష్,  సీనియర్ జర్నలిస్ట్ పిఎస్ రంగారావు,పట్టణ వైశ్య సంఘం అధ్యక్షుడు మంచాల కృష్ణ,ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, రోటరీ-ఆపి సభ్యులు ఎన్. రాజు, కొత్త ప్రతాప్, ఎన్నాకుల అశోక్, వర్తక సంఘం పట్టణ అధ్యక్షుడు కమటాల శ్రీనివాస్, వైశ్య సంఘం కార్యదర్శి, పబ్బ శ్రీనివాస్,.డా.గోపాలచారి మరియు జర్నలిస్ట్, శఫియొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు విద్యపట్ల మరింత ప్రోత్సహించాలన్న లక్ష్యంతోనే అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవంన పురస్కరించుకుని నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు.

జిల్లాలో24 గంటలపాటు మద్యం దుకాణాలు బంద్ !
గణేష్ నిమజ్జనం నేపథ్యంలో..


జిల్లా కలెక్టర్  జి. రవి  ఆదేశాల ప్రకారము జగిత్యాల జిల్లాలోని అన్ని.లిక్కర్ షాపులు, బార్ & రెస్టారెంట్లు, కల్లు దుకాణాలు మరియు కల్లు డిపోలు….తేదీ 09.09.2022 రోజు ఉదయం 06.00 గంటల నుండి తేది 10.09.2022 రోజు ఉదయం 06.00 వరకు మూసివేయబడును.
కావున జగిత్యాల జిల్లాలోని అన్ని మద్యం షాపులు, బార్ మరియు రెస్టారెంట్లు, కల్లుదుకాణములు, మరియు కల్లు డిపోల లైసెన్సీలు ఇట్టి నిబందనకు  పాటించాల్సిందిగా జిల్లా ఎక్సైజ్ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.
ఇట్టి నిబందనను ఎవరైనా ఉల్లంగించినట్లైతే వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకోబడును. అదే ప్రకటనలో స్పష్టం చేశారు.
పెన్షన్ ప్రొసీడింగ్స్ పంపిణీ !


రాయికల్ మండలంలో 10 గ్రామాల్లో నూతనంగా మంజూరైన 413 పెన్షన్ ప్రొసీడింగ్స్ లను లబ్ధిదారులకు పంపిణీ చేసిన జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ పెన్షన్ కార్డ్ లను పంపిణీ చేసేందుకు ఎమ్మేల్యే గ్రామాల్లోకి రాగా డప్పు చప్పుళ్ళతో ,నుదుట తిలకం దిద్ది,ఆప్యాయంగా పలకరిస్తూ ఆలింగనం చేసుకున్న ఆయా గ్రామాల ఆసరా పెన్షన్ లబ్దిదారులు,ప్రజలు.
అనంతరం  ఆయా గ్రామాలకు చెందిన 30మంది  లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన ₹ 7 లక్షల 50 వేల రూపాయల విలువగల చెక్కులను,13 మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరైన ₹13లక్షల రూపాయల విలువగల చెక్కులను లబ్దిదారులకు ఆయా గ్రామాలలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు అందజేశారు…
ఎమ్మెల్యే మాట్లాడుతూ
సంక్షేమానికి అత్యధిక నిధులు వెచ్చిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే…
గతంలో కొద్ది మందికి కొంత పెన్షన్ వస్తె నేడు 90 శాతం మందికి 2 వేల పైన అందజేస్తున్న మని అన్నారు
16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నా పెన్షన్ లు ఎక్కడా లేవని తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే బీడీ కార్మికులకు పెన్షన్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని ఇప్పటి వరకు జగిత్యాల నియోజకవర్గం లో  1 లక్ష 36 వేల రూపాయలు ఖాతాల్లో జమ చేశామని అన్నారు.
కుల మతం రాజకీయం  తేడా లేకుండా రైతులకు రైతు బందు,భీమా కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
అన్ని కుల సంఘాల కుల వృత్తుల అభివృద్ధికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో మొట్ట మొదటగా మెడికల్ కాలేజీ అనుమతి జగిత్యాల కు వచ్చిందని రేపటి నాడు 150 మంది వైద్య విద్యార్థులు ఇక్కడ చదువుతారని 600 పడకల ఆసుపత్రి తో పాటు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి వస్తుందని అన్నారు.
విద్య కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని 1000 పైగా గురుకులాలు ఏర్పాటు చేసి,నాణ్యమైన విద్య బోధన భోజన సౌకర్యాలు కల్పిస్తూ ఒక్కో విద్యార్థి పై లక్ష రూపాయల వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తునదని అన్నారు.
ప్రైవేట్ విద్యా సంస్థలు చదివే విద్యార్థులకు సైతం 15 వేల ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అన్నారు
పోటీ పరీక్షలకు బిసి, ఎస్సీ స్టడీ సర్కిల్ సైతం జగిత్యాల లో ఏర్పాటు చేశామని అన్నారు. జగిత్యాల ప్రధాన ఆసుపత్రిలో 100 కి పైగా వైద్యులు అందుబాటులో ఉన్నారు అని ప్రతిమ నుండి 10 మంది పీజీ వైద్యులు అందుబాటులో ఉన్నారని వారికి బోజన సదుపాయం సైతం సొంతంగా కల్పిస్తున్నాను అని అన్నారు. గతంలో 17 మంది వైద్యులు మాత్రమే పరిమితం అని తేడా గమనించాలని గుర్తు చేశారు.
రైతుల కోసం 24 గంటల కరెంట్,కాళేశ్వరం ప్రాజెక్ట్,మిషన్ కాకతీయ,చెక్ డ్యాం లు నిర్మించామని రాష్ట్రం వచ్చాక అభివృద్ధి నీ గమనించాలని తాను వేసవిలో చెక్ డ్యాం లో జలకాలు అడిన విషయం గుర్తు చేశారు .
ముఖ్యమంత్రి  పేద ప్రజల పక్ష పాతి అని,అభివృద్ధి సంక్షేమం రెండు చేస్తున్న ప్రభుత్వం ప్రజలు అండగా ఉండాలని  కోరారు….
ఈ కార్యక్రమంలో ఎంపీపీ లావుద్య సంధ్యారాణి సురేందర్ నాయక్, జెడ్పీటీసీ అశ్విని జాదవ్, మండల పార్టీ అధ్యక్షులు కొల శ్రీనివాస్, వైస్ ఎంపీపీ మహేశ్వర రావు,.యూత్ మండల అధ్యక్షులు వెంకటేష్ గౌడ్,వార్డుసభ్యులు,మండల నాయకులు,గ్రామ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పరామర్శలు !


పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి గ్రామానికి చెందిన రైతు ఆత్మహత్య చేసుకుకుని మరణించగా  గురువారం మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ -కరీంనగర్, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరామర్శించ


మేడారం PACS చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి  మాతృమూర్తి పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పైడి చింతపల్లి గ్రామ సర్పంచ్ వెంకటమ్మ మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను కూడా లక్ష్మణ్ కుమార్ పరామర్శించారు.
వారి వెంట ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆవుల శ్రీనివాస్,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు గంధం మహిపాల్, వడ్లకొండ అంజయ్య,ముత్యాల శ్రీనివాస్, నాంపల్లి వీరన్న,.యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు గంధం మహిపాల్, బురగడ్డ శంకర్,బెల్లాల మల్లయ్య,నార లక్ష్మణ్,కనుకుంట్ల మల్లయ్య,చింతకుంట మొండయ్యా,కత్తెర్ల రమేష్,కొమ్మ కొమురయ్య,బొగ్గుల గంగయ్య,కోట మహేందర్,బూతగడ్డ గట్టయ్య,కోట రాజయ్య తదితరులు పాల్గొన్నారు