ధర్మపురి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు

(J. Surender Kumar)
ధర్మపురి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని S H గార్డెన్స్ లో 400. మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. రేకుర్తి కంటి ఆసుపత్రి కి చెందిన Dr స్వామి , Dr ప్రభాకర్ , Dr రామకృష్ణ , Dr శ్రీనివాస్ , సర్జరావు, మామిడాల రవీందర్ , 5 గురు టెక్నిషన్స్ సహకారంతో పరీక్షలు నిర్వహించారు.

120 మందికి మోతె బిందువులు గుర్తించారు.. ఈరోజు 35 మందినీ ఈరోజు కరీంనగర్ లోని రేకుర్తి ఆసుపత్రికి పంపించారు.. వారికి రేపు కంటి ఆపరేషన్లు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
రెండవ విడత .గురువారం . ఈనెల 22 న మరో 35 మందిని రేకుర్తి ఆస్పత్రికి పంపనున్నట్లు. లైన్స్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ రామకృష్ణ తెలిపారు . మిగతా వారికి తేదీలు ప్రకటించి వారికి ఆపరేషన్ చేయించనున్నట్లు తెలిపారు.


కంటి పరీక్షల నిమిత్తం వచ్చినవారికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు. లయన్స్ క్లబ్ సేవలను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ZC చుక్క భీమరాజు , DC లు జక్కు రవీందర్ సంగి ఆనంద్ , సెక్రటరీ పైడి మారుతి , ట్రెసరర్ సిరుపతి రాజన్నా , మరియు సభ్యులు పాల్గొన్నారు.

ఇందుకు సహకరించిన మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు షబ్బీర్ కు లైన్స్ క్లబ్ పక్షాన అధ్యక్షుడు డాక్టర్ రామకృష్ణ కృతజ్ఞతలు . తెలిపారు.