(J. Surender Kumar)
జగిత్యాల జిల్లా ధర్మపురిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సర్దార్ వల్ల భాయ్ పటేల్ విగ్రహం వద్ద తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా డీసీసీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జాతీయ జెండా ఎగురవేశారు.
ఈ సందర్భంగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియా తో మాట్లాడారు.
అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ అద్వర్యం లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది..
ఎంతో మంది మహనీయులు బ్రిటిష్ వారితో పోరాడి దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడం జరిగింది..
ఆనాడు నైజాం ప్రభుత్వం హయాంలో మన ప్రాంతం ఎన్నో అరాచకాలకు, అకృత్యాలకు,అణచివేతలకు గురికావడం జరిగింది.
ప్రధాని నెహ్రూ, అప్పటి హోం మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ , సైనిక చర్య వల్ల మన ప్రాంతం భరత దేశంలో విలీనం కావడం జరిగిందన్నారు
తెలంగాణ వచ్చి 8 సంవత్సరాల నుండి తెలంగాణ విమోచన దినోత్సవాన్నీ ఎందుకు నిర్వహించలేదో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు చెప్పాలి అని డిమాండ్ చేశారు
ఎన్నికల దగ్గర పడుతుండటంతో ఆగమేఘాల మీద తెలంగాణ విమోచన దినోత్సవాన్నీ నిర్వహించడం జరుగుతుంది అన్నారు
ధర్మపురి నియోజకవర్గంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ మంత్రి కొప్పుల ఈశ్వర్ ,వారి అధికారులు, నాయకులు అంగన్వాడీ టీచర్లను, ప్రభుత్వ ఉద్యోగులను, చివరికి స్కూల్ పిల్లలను సైతం డిసిఎం వ్యాన్ లలో తీసుకు వచ్చి ర్యాలీలు నిర్వహించడం శోచనీయం అని అన్నారు
బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి మరీ మీ ర్యాలీలకు ప్రజలను తీసుకురవడం ఇదేం సంస్కృతి అని మంత్రి కొప్పుల ఈశ్వర్ ను ప్రశ్నించారు
మంత్రి కొప్పుల ఈశ్వర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం పక్క నుండే , మీరు మీ అధికారులు తీసుకువచ్చిన ప్రజలును ర్యాలీగా తీసుకెళ్లారు..కానీ మీకు పటేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించాలన్న చిత్తశుద్ధి మీకు లేదా అంటూ లక్ష్మణ్ కుమార్ ప్రశ్నించారు.
8 సంవత్సరాల నుండి ఇక్కడి ధర్మపురి ప్రాంతానికి మంత్రి కొప్పుల ఈశ్వర్ వల్ల ముఖ్యమంత్రి కేసీఆర్ వల్ల జరిగిన అభివృద్ధి ఎం లేదు అన్నారు
మేము కాంగ్రెస్ పార్టీ వంశీకులం, మేము మా తాతల కాలం నుండి కాంగ్రెస్ పార్టీ జెండాలను భుజాలపై మోసినవాళ్ళం..
ఎన్నికల దగ్గర పడుతుండటంతో అటు బీజేపీ నేతలు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం పోటాపోటీగా సభలు సమావేశాలు,ఏర్పాటు చేస్తున్నారు..
దయచేసి కేంద్ర ప్రభుత్వ తెలంగాణ ప్రాంతానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతున్నాం.అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు
ఉద్యోగాలు భర్తీ చేయాలని నిరసన !

.. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్మపురి లో ప్రభుత్వ కాలేజీ కూడలి లో రోడ్లు ఊడ్చి నిరసన తెలిపారు..యూత్ కాంగ్రేస్ నియోజకవర్గ అధ్యక్షులు సింహారాజు ప్రసాద్… మాట్లాడుతూ ఇప్పటికైనా నరేంద్ర మోడీ ఇచ్చిన మాట నిలబెట్టు కోవాలని లేకపోతే యూత్ కాంగ్రేస్ ఆధ్వర్యంలో పెద్దేతున్న నిరసన కార్యక్రమాలు చేస్తామని అన్నారు రానున్న రోజుల్లో నిరుద్యోగులు అందరూ ఏకతాటిపైకి వచ్చి మిమ్మల్ని గద్దె దింపడం ఖాయం అని వారు అన్నారు…
ఉద్యోగాలు అడిగితే మత విద్వేషాలు రిచేగొట్టే వాళ్లుగా చిత్రికరిస్తున్నారు అని వారు ఎద్దేవా చేశారు..రాబోయే ఎన్నికల్లో కాంగ్రేస్ పార్టీ అధికారం లోకి రావడం రాహుల్ గాంధీ ప్రధాని కావడం కాయమైపోయింది అని. భారత్ జోడో యాత్రకు వస్తున్న ప్రజాదరణ చుస్తే అర్ధం అవుతుంది అని వారు అన్నారు .. కాంగ్రేస్ అధికారములోకి రాగానే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సంగనభట్ల దినేష్, యూత్ కాంగ్రేస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు అజేయ్, మండల యూత్ అధ్యక్షులు రందేని మోగిలి, పట్టణ అధ్యక్షులు అప్పం తిరుపతి, అసెంబ్లి సెక్రటరీలు సుముఖ్, సాయి ,మాజీ ఎంపీటీసీ మల్లేశం, యూత్ నాయకులు అశెట్టి శ్రీనివాస్, అయ్యోరి మహేష్, జాజల రమేష్, స్తంభంకాడి గణేష్, యూత్ సోషల్ మీడియా ఇంచార్జి భారత్ భూమేష్ తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ కార్యాలయంలో

తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ధర్మపురి మున్సిపాలిటీ ఆఫీసు ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి సంగి సత్తెమ్మ. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందారపు రామన్న , కమిషనర్ రమేష్ కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
మండల పరిషత్ కార్యాలయంలో

మండల ప్రజా పరిషత్ ధర్మపురి కార్యాలయంలో ఎంపీపీ ఎడ్ల చిట్టిబాబు అద్వర్యంలో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్బంగా కార్యాలయ ఆవరణలో జాతీయ పతకావిష్కరణ .చేయబడినది. ఈ కార్యక్రమంలో వైస్ MPP గడ్డం మహిపాల్ రెడ్డి , తుమ్మేనాల ఎంపీటీసీ ఆకుబత్తిని తిరుపతి , రైతు బంధు అద్యక్షులు సౌల్ల భీమయ్య , చిలవెరి శ్యామ్ సుందర్, ఆకుల రాజేష్ , కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మార్కెట్ కమిటీ కార్యాలయం లో

వ్యవసాయ మార్కెట్ కమిటి ధర్మపురి చైర్మన్ అయ్యోరి రాజేష్ కుమార్ అద్వర్యంలో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్బంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ ధర్మపురి కార్యాలయ ఆవరణలో. “జాతీయ పతకావిష్కరణ” చేయబడినది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా DCMS చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి , MPP శ్రీ ఎడ్ల చిట్టి బాబు ,వైస్ MPP గడ్డం మహిపాల్ రెడ్డి , రైతు సమన్వయ సమితి అద్యక్షులు సౌల్ల భీమయ్య , TRS పట్టణ శాఖా అద్యక్షులు ఆకుల రాజేష్ మరియు నాయకులూ ,ప్రజా ప్రతినిధులు, పాలకవర్గ సభ్యులు MD.ఇక్రం , మైనేని వెంకటి , మామిడి శ్రీనివాస్ , వీరవేని రాజ మల్లయ్య , ర్యాగల్ల నారాయణ , శ్రీ జంగా శ్రీనివాసు , వ్యాపారస్తులు, .MLS పాయింట్ ఇంచార్జి అధికారి , హమలీలు , కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో ..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ఎంపీ ఆదేశాల మేరకు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ధర్మపురి మండలంలోని జైన గ్రామం లో బీజేపీ ధర్మపురి మండల అధ్యక్షులు సంగేపు గంగారాం అధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమం లో వేముల భాస్కర్. దుర్గం సుధాకర్, సోగల కిషన్. సుంకు మదుసుదన్. అక్కినపెళ్ళి తిరుపతి, వెన్నం లింగారెడ్డి. పల్లేపు గోవర్ధన్. పిట్టల ప్రసాద్..బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
బీజేవైఎం ఆధ్వర్యంలో

ఈరోజు ధర్మపురి పట్టణంలో తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా BJYM పట్టణ శాఖ అధ్యక్షుడు గాజు భాస్కర్ ఆధ్వర్యంలో ధర్మపురిలో బైక్ ర్యాలీ జరిగింది.
బిజెపి ఆధ్వర్యంలో..

బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు పట్టణము లోని ప్రతి పోలింగ్ బూతులో జాతీయ జెండాను ఆవిష్కరించి .బైక్ ర్యాలీ నిర్వహించడంజరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ, బీజేయం నాయకులు పాల్గొన్నారు.