ధర్మపురి క్షేత్రంలోదసరా నవరాత్రి ఉత్సవాలు !

రేపటినుండి ఆరంభం !


(J. Surender Kumar)
దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా రేపు సోమవారం ఉదయం 8-30 గంటలకు శ్రీలక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానం లో, మరియు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం లో వేద పండితులు ఆధ్వర్యంలో కలషస్థాపనలు , ఋత్విక్ వర్ణన పూజాది కార్యక్రమలు జరగనున్నాయి.

  • 26 న ఎరుపు వస్త్ర అలంకరణలో “శైలపుత్రి” రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నది.
  • 27 న పసుపు వస్త్రా అలంకరణలో “బ్రహ్మచారిని”. రూపంలో దర్శనం ఇవ్వనున్నది.
  • 28 న. గులాబీ వస్త్రా అలంకరణలో “చంద్ర గంట “. రూపంలో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నది
  • *.29 న గోధుమ వస్త్రాలంకరణలో ” కూష్మాండ” శాఖంబరి రూపంలో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నది
  • 30 న పసుపు వరణ వస్త్రాలంకరణలో ” స్కంద మాత” రూపంలో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నది
  • అక్టోబర్ 1న ఆకుపచ్చ వస్త్రాలంకరణలో “కాత్యాయని” రూపంలో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నది.
  • 2 న చిలుక పచ్చ వస్త్రాలంకరణలో ” కాళ్ రాత్రి” రూపంలో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నది. ఈరోజు సరస్వతి పూజ, పుస్తకాల పూజ,
    నిర్వహించబడును.
  • 3 న తెలుపు వస్త్రాలంకరణలో “మహా గౌరీ” రూపంలో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నద
  • *. 4 న ఎరుపు వస్త్రాలంకరణలో ” సిద్ది రాత్రి” రూపంలో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు. ఇదే రోజు చండీ హోమం, బలిహరణం తదితర పూజా కార్యక్రమాలతో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ప్రతిరోజు . ప్రత్యేక విశేష పూజాది కార్యక్రమాలు జరగనున్నాయ
  • ముస్తాబైన రామలింగేశ్వర ఆలయం !
  • ఈ సందర్భంగా శ్రీ శారద అమ్మవారు కొలువై ఉన్న శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయం అందంగా ముస్తాబయింది. రంగురంగుల దీపాల కాంతితో దేదీప్య మానంగా వెలిగిపోతున్నది. భక్తజనంకు కోతులతో ఎలాంటి బెదిరింపులు, బెడద లేకుండా. ఆలయ ప్రాంగణం చుట్టూ సోలార్ ఫెన్సింగ్ అమర్చారు. స్వచ్ఛమైన తాగునీటి కోసం ఆరో ప్లాంటును ఏర్పాటు చేశారు.