పట్టణంలో రేపటినుండి…..
( J. Surender Kumar)
ధర్మపురి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వేదికపై రేపటినుండి దసరా కోలాటం సంబరాలు దసరా కోలాట సంబరాలు. ఆరంభం కానున్నాయని
తెరాస మహిళా విభాగం సభ్యులు & ఎల్. యం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్ పర్సన్ స్నేహలత తెలిపారు.
జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం స్థాయి దసరా కోలాట సంబరాల ఫోటీలు రేపు అనగా 22-9-2022 తేదీన గురువారం ధర్మపురి ప్రభుత్వ కళాశాల వేదికగా ఉదయం 9 గంటలకు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించనున్నారని ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ పోటీల్లో ధర్మపురి నియోజకవర్గం ఆరు మండలాల పరిధి నుండి 130 జట్లు పాల్గొననున్నాయి.
ఈ పోటీలు మండలాల వారీగా నిర్వహించనున్నారు..
* 22 తేదీన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ధర్మపురి మండలం నుండి 32 జట్లు పాల్గొంటాయి ..
* 23 తేదీన బుగ్గారం, గొల్లపల్లి, పెగడపల్లి మండలాల జట్లు పాల్గొంటాయి..
* 24 తేదీన ధర్మారం మండలం నుండి జట్లు పాల్గొంటాయి.
* 26 తేదీన వెల్గటూర్ మండలం నుండి జట్లు పాల్గొంటాయి.
దసరా కోలాట సంబరాల ముగింపు కార్యక్రమానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ పార్లమెంటు సభ్యురాలు, ప్రస్తుత నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని ప్రకటనలో పేర్కొన్నారు.