ధర్మపురి లో దసరా కోలాట సంబరాలు

(J. Surender Kumar)
జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఎల్.యం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ మరియు ధర్మపురి నియోజకవర్గం తెరాస పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో గురువారం ఘనంగా దసరా కోలాట సంబరాలను సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సతీమణి కొప్పుల స్నేహలత , జెడ్పి చైర్ పర్సన్ దావ వసంతా సురేష్ లు, ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు.


ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ
దసర కోలాట సంబరాలు నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. తెలంగాణ ఆడపడుచుల అతిపెద్ద పండుగ బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్న ఎల్.యం.కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ నిర్వాహకులను అభినందించారు. . సోదరీమణులు పెద్ద ఎత్తున కోలాట పోటీల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు.


ఈ నెల 29న నిర్వహించే ముగింపు కార్యక్రమానికి నిజామాబాద్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ముఖ్యతిధిగా హాజరవుతారని మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. నియోజవర్గంలోని, ప్రతి గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో తరలి రావాలని సూచించారు.


ఎల్.యం.కొప్పుల చారిటబుల్ ఆర్గనైజేషన్ చైర్ పర్సన్ కొప్పుల స్నేహాలత గారు మాట్లాడుతూ.
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆశీస్సులు, నియోజకవర్గ మహిళల సహాకారంతో నిర్వహిస్తున్న ప్రతీ కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని చెప్పారు. దసరా శరన్నవరాత్రి వేడుకలలో భాగంగా కోలాట సంబరాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
మొత్తం 126 జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయని అన్నారు. పోటీల్లో పాల్గొన్న వారిలో మంచి ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు ఇవ్వనున్నట్లు స్నేహలత చెప్పారు.


మొదటి బహుమతిగా ₹ 50 వేల రూపాయలు. రెండవ బహుమతిగా ₹ 30 వేలు. మూడవ బహుమతి గా ₹ 20 వేల రూపాయల నగదు ప్రోత్సాహక బహుమతిని అంద చేస్తామన్నారు. ఈనెల 29 వ తేదీన దసరా కోలాట సంబరాలు వేడుకల ముగింపు కార్యక్రమం ఉంటుందని చెప్పారు.


ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సంగి సత్తెమ్మ. డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, జెడ్పీటీసీ లు, యంపిపి లు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అయ్యేరి రాజేష్, తెలంగాణ జాగృతి సభ్యులు. పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

శనివారం ధర్మపురిలో ఉచిత వైద్య శిబిరం!


సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకోని డెంగ్యూ వైరల్ జ్వరాల కారణంగా ధర్మపురి పట్టణ లో శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు 11 వ వార్డు కౌన్సిలర్ జక్కు పద్మా రవీందర్ తెలిపారు. ఉదయం ఎనిమిది గంటలకు సిగ్మా ఆసుపత్రి జగిత్యాల వారి సహకరంతో ఏర్పాటు చేసినట్లు ఆమె వివరించారు. తన వార్డు పరిధిలో సంగి వాడ అపార్ట్ మెంట్ వద్ద, వైద్య శిబిరం నిర్వహించబడుతుందని ప్రకటనలో పేర్కొన్నారు.
ఉదయం ఎనిమిది గంటల, నుండి తోమ్మిది గంటల వరకు షుగర్ పరీక్షలు, థైరాయిడ్ ,ఈసీజీ ,రక్త పరీక్షల నిర్వహించబడతాయని అన్నారు. పది గంటల నుండి ఓపి సేవలు ప్రారంభం పరీక్షల తధానంతరం ఉచితంగా మందుల పంపిణీ . చేయనున్నట్టు కౌన్సిలర్ జక్కు పద్మా రవీందర్ ప్రకటనలో పేర్కొన్నారు.
టిఆర్ఎస్ లో చేరిక!


జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దొంతపూర్, తీగలధర్మారం, దోనూర్, నక్కలపెట్, రామయ్యపల్లి, రాయపట్నం గ్రామాల నుండి పెద్ద ఎత్తున యువత గురువారం మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు.
సంఘ భవనానికి స్థలం కేటాయించండి,!


ధర్మపురి మండల కేంద్రంలో గౌడ్ సంఘ భవన నిర్మాణానికి స్థలాన్ని కేటాయించి, నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని మంత్రి ఈశ్వర్ కలిసి గౌడ సంఘం విన్నవించారు. సంఘం అధ్యక్షులు ఎల్లా గౌడ్ , సంఘ సభ్యులు ఉన్నారు.