ధరణిలో సమస్యలను పరిశీలించి పరిష్కరించాలి!

అవగాహన సదస్సు లో కలెక్టర్ రవి !


( J. Surender Kumar )
ధరణిలో వచ్చే సమస్యలను నిశితంగా పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి. రవి సూచించారు
.

మంగళవారం మేడిపల్లిలోని ఎం.పి.డి.ఓ. కార్యాలయంలో ధరణి పోర్టల్ గురించి నిర్వహించిన అగవాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ భూమిని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని ధరణి పోర్టల్ లో మార్పు కానట్లయితే ఆ పట్టాను మార్చుకోవచ్చని తెలిపారు. అంతే కాకుండా పట్టాదారు మరణించినట్లయితే తర్వాత వారి కుటుంబంలోని వారికీ వారసత్వం ద్వారా వచ్చే వ్యవసాయ పట్టా మరియు అసైన్డ్ భూములను విరాసత్ చేసుకోవచ్చని కలెక్టర్ సూచించారు

. ప్రజలు నేరుగా స్లాట్ బుకింగ్ చేసుకొనుట, వ్యవసాయ భూమి నుండి వ్యవసాయేతర భూమిగా మార్చుట, భూమిని తాకట్టు పెట్టుట, భామిని లీజుకు ఇచ్చుట, తీసుకొనుట గురించి, నోషనల్ ఖాతా నుండి పట్టాదారు భూమిగా బదిలీ చేయడం, భూమి రకం మార్పు, భూమి వినియోగాన్ని నాలా నుండి వ్యవసాయానికి మార్చడం వంటి అంశాలపై కలెక్టర్ సర్పంచులకు, ఎం.పి.టి.సి.లకు, రైతు సమాఖ్య సమితి వారికీ వివరించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.ఎస్.లత, ఆర్.డి.ఓ, వినోద్, ఎం.పి.పి.ఉమా దేవి, సర్పంచులు, ఎం.పి.టి.సిలు, రైతు సమాఖ్య సమితి, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం భవిష్యత్ తరాలకు నిదర్శనం – కలెక్టర్


నిరంకుశ, నిజం వ్యతిరేక, తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడైన కొండ లక్ష్మణ్ బాపూజీ కొమరం భీం జిల్లా, వాంకిడి గ్రామంలో 1915 సెప్టెంబర్ 27 న జన్మించారని తెలిపారు. మంగళ వారం కలెక్టరేట్ లో కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా అయన చిత్ర పటానికి అదనపు కలెక్టర్లతో కలిసి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ గర్వించదగిన గొప్ప వ్యక్తి అని, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ గారు పోషించిన పాత్ర మరువలేనిదని కలెక్టర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారుడిగా, నిబద్దతతో కూడిన రాజకీయ నాయకుడిగా కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం భవిష్యత్ తరాలకు నిదర్శనం అన్నారు. సమాజంలోని అన్ని వర్గాలను ఏకతాటిపైకి తీసుకురావడమే కాకుండా తెలంగాణ కోసం తన మంత్రి పదవికి రాజీనామా చేసిన బాపూజీ గత తెలంగాణ ఉద్యమంలో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి, వర్ధంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆయన గౌరవార్థం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. రాష్ట్ర హార్టికల్చర్ యూనివర్సిటీకి బాపూజీ పేరు పెట్టడం జరిగిందన్నారు.


ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి.ఎస్.లత, అరుణ శ్రీ, వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి సాయి బాబా, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ఆధార్ నవీకరణ తప్పనిసరి !


2015 కంటే ముందు ఆధార్ కార్డు పొందిన వారు UIDAI ఆదేశాల మేరకు తగిన గుర్తింపు పత్రం తో స్థానికతను మరోసారి నవీకరించుకోవాలని ప్రాజెక్ట్ మేనేజర్ జి.శ్రీనివాస్ రెడ్డి అన్నారు . మంగళవారము గొల్లపెల్లి మండలములోని చిల్వకోడూర్, జగిత్యాల రూరల్ మండలంలోని జాబితాపూర్, పెగడపల్లి మండలం లోని శాశ్వత ఆధార్ కేంద్రాలను ఈ – జిల్లా మేనేజర్ మమత తో కలసి సందర్శించారు. ప్రభుత్వ నిబందనల మేరకు పదేళ్ళ ఒకసారి తమ ఆధార్ కార్డు లను తప్పనిసరిగా నవీకరించుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమములో టిఎస్టిఎస్ మేనేజర్ చేతన్ , టిఎస్ ఆన్ లైన్ మేనేజర్ సురేష్ పాల్గొన్నారు.