(J. Surender Kumar)
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో నూతనంగా 1783 లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
ఈ సందర్భంగా ఎంపిడిఓ కార్యాలయ ఆవరణలో ఆసరా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
👉నూతన పెన్షన్లతో కలిపి ధర్మపురి నియోజవర్గ పరిధిలో మొత్తం 60 వేల మందికి ఆసరా పింఛన్లు అందిస్తున్నందుకు సీఎం కేసీఆర్ కు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

👉దేశ వ్యాప్తంగా వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే పెన్షన్లు ఇస్తుంటే, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు, చేనేత, గీత కార్మికులకు పెన్షన్లు ఇస్తున్నదని మంత్రి అన్నారు.
👉హెచ్.ఐ.వి, బోదకాలు బాధితులతో పాటు తాజాగా డయాలసిస్ పేషెంట్లకు కూడా పెన్షన్లు అందించడానికి సీఎం కేసీఆర్ నిర్ణయించారని మంత్రి పేర్కొన్నారు.
👉పేదలకు గౌరవ ప్రదంతోపాటు భద్రతతో కూడిన జీవితాన్ని ఇవ్వాలని సీఎం కేసీఆర్ భావించి దివ్యాంగులకు ₹ 3016/-, ఇతర వర్గాలకు ₹ 2016/- రూపాయల వరకు అందిస్తున్నామని తెలిపారు.
👉ప్రధానమంత్రి గుజరాత్ రాష్ట్రంలో కేవలం ₹ 600/- మాత్రమే పెన్షన్ అందిస్తున్నారని, ఇతర రాష్ట్రాల్లో కంటే అధిక సంఖ్యలో మన రాష్ట్రంలో పేదవారికి పెన్షన్లు అందిస్తున్నామని తెలిపారు.
👉దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. సాగునీరు, పంటల పెట్టుబడులు, పంట రుణాలు, రుణ విముక్తి, రైతు బీమా, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, కెసిఆర్ కిట్ వంటి అనేక పథకాలను అమలు చేస్తోందని మంత్రి ప్రజలకు వివరించారు.
👉ధర్మారం మండలంలో నూతనంగా 1783 పెన్షన్లు మంజూరు అయినట్లు మంత్రి తెలిపారు.
👉రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి ఆసరా లబ్ధిదారుడికి ఆసరా గుర్తింపు కార్డు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.
👉త్రాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ అందించి సరఫరా చేస్తున్నామని తెలిపారు. రైతులకు సాగునీరు అందించేందుకు కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి చేసి 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని, ప్రతి సంవత్సరం రూ.₹ 10వేల కోట్లు ఖర్చు చేసి రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని మంత్రి తెలిపారు.
👉పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలను అభివృద్ధి చేశామని, హరితహారం కింద చేపట్టిన చర్యల ద్వారా పచ్చని గ్రామాలు, పట్టణాలు ఆవిష్కృతమవుతున్నాయని తెలిపారు.

👉మిషన్ కాకతీయ కింద చెరువుల పునరుద్ధరణ, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం వల్ల 250 కిలో మీటర్ల మేర గోదావరి నది సజీవంగా ఉందని, మత్స్య సంపద భారీగా పెరిగిందని మంత్రి అన్నారు.
👉రామగుండం ప్రాంతంలో నూతన వైద్య శాల, అనుబంధ ఆసుపత్రి ఏర్పాటు అవుతున్నాయని, త్వరలో మేడారంలో 30 పడకల ఆసుపత్రి ప్రభుత్వం మంజూరు చేస్తుందని మంత్రి తెలిపారు
ఈ కార్యక్రమంలో ధర్మారం జడ్పిటిసి పద్మజ, ఎంపీపీ కరుణశ్రీ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బుచ్చిరెడ్డి, పీఎసిఎస్ చైర్మన్లు, బలరాం రెడ్డి, బంధం రవి, వెంకట్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్ లు, తహశీల్దార్, ఎంపిడిఓ, లబ్దిదారులు, ప్రజలు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణిలో సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలి
కలెక్టర్ జి. రవి

ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ జి. రవి అధికారులను ఆదేశించారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలో స్థానిక ఐ ఎం ఏ హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 25 మంది ప్రజల సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను అదనపు కలెక్టర్లు బి.ఎస్. లత, అరుణశ్రీ తో కలిసి జిల్లా కలెక్టర్ స్వీకరించారు. ప్రజల నుండి అందిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించుటకు సంబంధిత శాఖలకు కలెక్టర్ తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను ప్రాధాన్యతతో వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ సూచించారు. ఆర్డీవో వినోద్ కుమార్ , జిల్లా అధికారులు వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు
బీసీ స్టడీ సర్కిల్ ప్రారంభం!

రాష్ట్ర ప్రభుత్వం బీసి స్టడీ సర్కిల్ తరపున జగిత్యాల జిల్లా కేంద్రంలో సోమవారం ధర్మపురి రోడ్ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గ్రూప్-3 , గ్రూప్-4 ఉచిత కోచింగ్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ అశోక్ , మరియు జిల్లా బీసి సంక్షేమ అదికారి సాయిబాబ , సహాయ బీసి సంక్షేమ అదికారి సునీత , స్టడీ సర్కిల్ కో ఆర్డనేటర్ ఎలిజబెత్ రాణి పాల్గొన్నారు. కోచింగ్ నేటి నుండి కొనసాగుతుందనీ ఆసక్తి గల అభ్యర్థులు ఇంకా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.