(J. Surender Kumar)
చాకలి ఐలమ్మ గారి జయంతి సందర్భంగా సోమవారం జగిత్యాల పట్టణంలో చింత కుంట మినీ ట్యాంక్ బండ్ దగ్గర చాకలి ఐలమ్మ విగ్రహానికి చాలా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించరు.

, జిల్లా జడ్పీ ఛైర్పర్సన్ దావ వసంతసురేశ్ ,.జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర శేఖర్ గౌడ్ , మున్సిపల్ చైర్మన్ భోగ శ్రావణి ,అడిషనల్ కలెక్టర్ లు బి ఎస్ లత , అరుణశ్రీ, బిసి సంక్షేమ శాఖ అధికారి సాయి బాబా, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కమిషనర్ గంగాధర్, బీజేపీ నియోజకవర్గ ఇంఛార్జి రవీందర్ రెడ్డి, కౌన్సిలర్ లు బాలే లత శంకర్, పంబాల రామ్ కుమార్, కప్పల శ్రీకాంత్, పద్మ పవన్, పట్టణ, టీఆరెఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు, రజక సంఘం జిల్లా,మండల అధ్యక్షులు మర్రిపెళ్ళి నారాయణ, పోచాలు ,పట్టణ అధ్యక్షుడు రాజు,పట్టణ పార్టీ ఉపాధ్యక్షులు రాజ్ కుమార్, నాయకులు రజక సంఘ సభ్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
,ధర్మపురి పట్టణంలో చింతామణి చెరువు కట్టపై.

ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహం సర్కిల్ లో చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి, .జోహార్ చాకలి ఐలమ్మ అంటూ నినందించిన బుగ్గారం మండల జెడ్పిటిసి సభ్యులు భాదినేని రాజేందర్.
ఈ సందర్భంగా జెడ్పిటిసి సభ్యులు భాదినేని రాజేంధర్ గారు మాట్లాడుతూ..

మహిళా చైతన్యానికి, ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మ. చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు నిర్ణయించారని అన్నారు.

కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చేందుకు సీఎం కేసిఆర్ కృషి చేస్తున్నారు అని తెలియజేసారు.
తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన ధీరవనిత, సబ్బండ వర్గాల ఆత్మగౌరవానికి, మహిళా చైతన్యానికి ప్రతీక చాకలి ఐలమ్మ అన్నారు..
ధర్మపురి మండల పరిషత్ లో…

చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా సోమవారం ధర్మపురి మండల పరిషత్ కార్యాలయం, జయంతి వేడుకలను నిర్వహించారు .
ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు ఎడ్ల చిట్టిబాబు , జిల్లా ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు శ్రీమతి బత్తిని అరుణ , AMC చైర్మన్ అయ్యోరి రాజేష్ , వైస్ యం.పి.పి. గడ్డం మహిపాల్ రెడ్డి
ఆక్సాయి పల్లె సర్పంచ్ రామిల్ల రమేష్ , రంగు అశోక్ మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు..
జిల్లా గ్రంధాలయ సంస్థ ఆధ్వర్యంలో

జగిత్యాల జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా స్టూడెంట్స్ తో కలిసి ఫోటోకు పూలమాల వేసి నివాళులర్పిచిన గ్రంధాలయ చైర్మన్ డా.గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్
చైర్మన్ మాట్లాడుతూ
చాకలి ఐలమ్మ ను భూస్వాములు తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు.

అయినా ఆమె భయపడకుండా ఒంటరిగా పోరాడింది.ఎవరు భూమిని సాగు చేస్తే వారే పెత్తందారులు అనే గొప్ప నినాదం తీసుకొచ్చింది.మహిళా అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు అనే పదానికి నిదర్శనమే మన చాకలి ఐలమ్మ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రంధాలయ సిబ్బంది శకుంతల గారు అటెండర్స్ అనిల్,రాజు,స్టూడెంట్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు