గ్రూప్ – 1 పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి.

జిల్లా కలెక్టర్ జి. రవి

( J. Surender Kumar)
గ్రూప్ – 1 పరీక్షలు జరిగే పరీక్ష కేంద్రాలలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జి. రవి అధికారులకు సూచించారు.

జిల్లా కేంద్రంలో గ్రూప్-1 జరిగే పరీక్ష కేంద్రాలు అయిన SKNR డిగ్రీ కాలేజీ, గర్ల్స్ డిగ్రీ కాలేజీ, మైనారిటీ స్కూల్, కాలేజీ, నలంద డిగ్రీ కాలేజీలను అదనపు కలెక్టర్ బి.ఎస్.లత తో కలిసి పరిశీలించారు. ఈ సంద్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షలు జరిగే కేంద్రాలలో ఫర్నిచర్ సౌకర్యం, సిసి కెమెరాలు పనిచేస్తున్నాయా , లేదా చెక్ చేసుకోవాలని అధికారులకు సూచించారు.

అలాగే పరీక్ష రాసే అభ్యర్థులకు త్రాగునీరు, లైటింగ్ సౌకర్యం ఉండే విధంగా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రూప్ -1 పరీక్షలు రాసే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.ఎస్.లత, ఆర్డీఓ మాధురి, జిల్లా విద్యాధికారి జగన్ మోహన్ రెడ్డి, ఎమ్మార్వో అరిఫ్, కాలేజీ ప్రిన్సిపల్స్, తదితరులు పాల్గొన్నారు.

రేపటి నుంచే బతుకమ్మ చీరల పంపీణి –
చీరల ప్రాజెక్టు కొరకు మొత్తం ₹ 339.73 కోట్ల
మంత్రి కె.తారక రామారావు

కోటి బతుకమ్మ చీరల పంపిణీ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం
ఈ సంవత్సరం (24) విభిన్న డిజైన్లు (10) రకాల ఆకర్షణీయమైన రంగులలో మొత్తం (240) రకాల త్రెడ్ బోర్డర్ (దారపు పోగుల అంచుల) తో చీరలు
92.00 లక్షల రెగ్యులర్ చీరలకు అదనంగా ఉత్తర తెలంగాణ జిల్లాలలో వయోవృద్ధ మహిళలు ధరించే 9.00 మీటర్లు పొడవు గల చీరలు 8 లక్షల చీరలు
ఈ బతుకమ్మ చీరల ప్రాజెక్టు కొరకు మొత్తం ₹ 339.73 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు.


బతుకమ్మ చీరల కార్యక్రమంతో నేతన్న జీవితాల్లో వెలుగులు నిండాయన్న కేటీఆర్ అన్నారు
ఈసారి కోటి మంది తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ కానుక ఇవ్వడం పట్ల కేటీఆర్ సంతోషం
రేపటినుంచి మంత్రులు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపీణీ జరుగుతుందని మంత్రి కేటీఆర్ ప్రకటనలో వివరించారు.