(J.Surender Kumar)
ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడిగా. కే శ్రీనివాసరెడ్డి, సెక్రటరీ జనరల్ గా బలివేందర్ సింగ్ జమ్ము, ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు. ఎన్నికల అధికారి ఎం.ఎ. మజీద్ ప్రకటించారు.

దేశవ్యాప్తంగా ఐజేయు సభ్యులు 150 స్థానాలకు నామినేషన్లు ప్రక్రియ కొనసాగింది. అధ్యక్ష , సెక్రటరీ జనరల్ పదవులకు 12 రాష్ట్రాలలో శ్రీనివాస్ రెడ్డి , బల్వీందర్ సింగ్ జమ్మూ, పక్షాన నామినేషన్ లను ఆయా రాష్ట్రాల యూనియన్ నాయకులు దాఖలు చేశారు. అన్ని రాష్ట్రాలలో అధ్యక్ష కార్యదర్శులు పదవులకు పోటీగా ఇతరులు నామినేషన్లు సమర్పించకపోవడంతో వీరి ఎన్నిక ఏకగ్రీవం అయినట్టు ఎన్నికల అధికారి ఎంఏ మాజీద్ ప్రకటనలో పేర్కొన్నారు.

. ఆగస్టు 24న వీరు హైదరాబాద్ యూనియన్ ఆఫీస్ లో నామినేషన్లు దాఖలా చేశారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు, పాండిచ్చేరి, ఢిల్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి యూనియన్ నాయకులు తరలివచ్చారు. మీరు ఏకగ్రీవ ఎన్నిక పట్ల ఐకెయూ మాజీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు. దేవులపల్లి అమర్, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు నగునూరి శేఖర్, విరహత్. అలీ, ఐజేయు ఉపాధ్యక్షులు S.N Sniha, కార్యదర్శులు వై నరేందర్ రెడ్డి, అంబటి ఆంజనేయులు,

ఆంధ్రప్రదేశ్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు ఐ. వి సుబ్బారావు, చందు జనార్ధన్, IJU నాయకులు. డి కృష్ణారెడ్డి, కే సత్యనారాయణ, డి సోమ సుందర్, ఆలపాటి సురేష్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు తాడూరి కరుణాకర్, కే రామనారాయణ, నల్లి ధర్మారావు, జగిత్యాల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చీటీ శ్రీనివాసరావు, మోరేపల్లి ప్రదీప్ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.