ప్రజల, రైతుల హృదయాల్లో నిలిచిన జననేత ప్రియతమ నాయకుడు మహానేత దివంగత ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ,స్వర్గీయ డాక్టర్ శ్రీ వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి జిల్లా కేంద్రం జగిత్యాల పట్టణంలో జరిగింది.. శాసన మండలి సభ్యులు టి.జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరా భవన్ లో YS రాజశేఖర్ రెడ్డి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలు వైయస్సార్యంలో జరిగిన ప్రజా సంక్షేమ పథకాలపై వివరించారు .

నివాళులు !
పట్టణంలో సామాజిక సేవకులు, ప్రముఖ వ్యాపారవేత్త . రాయంచ ప్రభాకర్ ,ద్వాదశ దినకర్మ కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
గణేష్ మండపంలో..
పట్టణంలో స్థానిక 20 వ వార్డ్ బైపాస్ రోడ్డులో గణేష్ మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి తదనంతరం అన్నదానం కార్యక్రమం లో పాల్గొన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

వీఆర్ఏల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్త !
రాష్ట్రంలో వీఆర్ఏల దుస్థితి ,కుటుంబాల పరిస్థితి, ప్రభుత్వం మొండి వైఖరి పట్ల, శాసనసభ సమావేశాల్లో విధాన సభలో తాను ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే గాక వీఆర్ఏలకున్యాయం జరిగేలా యత్నం చేస్తానని. పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.
ఇందిరా భవన్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కలిసి లేఖ
అందజేసిన జగిత్యాల వీఆర్ఏలు
రాష్ట్రంలో వీఆర్ఏల సమస్యలపై చొరవ తీసుకొని ప్రభుత్వానికి నివేదించండి అంటూ వీఆర్ఏల సంఘ పక్షాన ఆయనకు వినతి పత్రం ఇచ్చారు.
ఈ నెల 6 న ప్రారంభమయ్యే శాసన మండలి సమావేశాల్లో
పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి VRA ల సమస్య అంశం పై మాట్లాడాలని వినతిపత్రం లో వారు పేర్కొన్నారు.

ధర్మపురి గౌడ సంఘంను అభినందించిన
గ్రంధాలయ చైర్మన్ !
ధర్మపురి మండల పరిధిలోని వివిధ గ్రామాల నుండి హాజరైన కుల సభ్యులందరికీ ఆధ్వర్యంలో ధర్మాపురి మండల గౌడ సంఘం కమిటీ అధ్యక్షులుగా పెరుమాండ్ల ఎల్ల గౌడ్, ఉపాధ్యక్షులు కాసారపు రాజా గౌడ్, ప్రధాన కార్యదర్శి గూడూరు శేఖర్ గౌడ్ గార్లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
ధర్మపురి గౌడ సంఘం నూతన ఎన్నికైన కార్యవర్గ సభ్యులను ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ వారిని శాలువాతో సన్మానించిన జగిత్యాల జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు మరియు జిల్లా గ్రంధాలయ చైర్మన్ డాక్టర్ గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్ . ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు గొల్లపల్లి సత్తన్న గౌడ్,తాళ్లపల్లి మల్లేశం గౌడ్,కోశాధికారి కాసారపు బాలగౌడ్,సలహాదారుడు మొగిలి పాక తిరుపతి గౌడ్,అధికార ప్రతినిధి కోలా గంగాధర గౌడ్, ప్రచార కార్యదర్శి గంగాధర కృష్ణయ్య గౌడ్, కార్యవర్గ సభ్యులు
లక్ష్మణ్ గౌడ్, ప్రకాష్, మహేందర్, సత్తన్న, నరసయ్య, మల్లేష్, తిరుపతి, రాజనర్సయ్య, సత్యనారాయణ, సత్తన్న, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
