( J. Surender Kumar )
జగిత్యాల జిల్లా ప్రభుత్వ యంత్రాంగంలో ముందస్తు బతుకమ్మ, దసరా, పండుగ సంబరాలు ఉత్సాహం చోటుచేసుకుంది. శుక్రవారం అధికారులు ఉద్యోగులు సిబ్బంది ఒకరినొకరు పరస్పరంగా అభినందించుకుంటూ. మిఠాయిలు పంపిణీ చేసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జడ్పీ చైర్ పర్సన్ దావా వసంత, మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ శ్రావణి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్, కలెక్టర్ ను చాంబర్లో కలిసి పుష్పగుచ్చం అందించి అభినందించారు.
ఇందుకు కారణం
స్వచ్చ సర్వేక్షన్ గ్రామీణ్ – 2021 లో భాగంగా జగిత్యాల జిల్లా జాతీయ స్థాయిలో టాప్ ర్యాంకు సాధించడం.రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించడం.
ఈ సంద్భంగా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అదనపు కలెక్టర్లు బి.ఎస్.లత, అరుణ శ్రీ, ఆర్డీవోలు ఉద్యోగ సంఘంలు, కలెక్టరేట్ సూపరింటెండెంట్ లు, అధికారులు, ఎంపీడీవోలు, తాసిల్దారులు కలెక్టర్ కు పుష్పగుచ్ఛం . శాలువాతో ఘనంగా సన్మానించి కేకు కట్ చేయించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ రవి మాట్లాడుతూ
గ్రామ స్థాయి కార్యకర్త నుండి జిల్లా కలెక్టర్ వరకు స్వచ్చతను ఒక ఉద్యమంలా తీసుకుని నిరంతరం కొనసాగించడమే ఈ విజయానికి కారణం అని అన్నారు

స్వచ్చ సర్వేక్షన్ గ్రామీణ్ – 2021 లో భాగంగా జగిత్యాల జిల్లా జాతీయ స్థాయిలో రెండవ ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించడం జిల్లాకు గర్వ కారణమని జ కలెక్టర్ జి. రవి అన్నారు.
స్వచ్చత అనేది ఒకరోజు కార్యక్రమం కాదని, నిరంతర ప్రక్రియ అని తెలిపారు.

స్వచ్చతలో ODF నుండి ODF Plus వరకు జగిత్యాల జిల్లా రాష్ట్ర స్థాయిలోనే కాదు, జాతీయ స్థాయిలోను ముందు వరుసలో ఉంది. జాతీయ స్థాయిలో స్వచ్చ దర్పన్ కార్యక్రమాలలో రాష్ట్ర స్థాయిలో పలు అంశాలలో ప్రశంసలు పొందడం జరిగిందని, ఇందుకు గాను 24 గంటలలో 380 టాయిలెట్ల నిర్మాణం ఒకటని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “స్వచ్చ భారత్ మిషన్ గ్రామీణ్” అమలులో భాగంగా దేశంలో స్వచ్చతలో అత్యుత్తమ ప్రతిభతో నాణ్యతతో కూడిన పనితీరు కనబర్చినందుకు స్వచ్చ సర్వేక్షన్ గ్రామీణ్ – 2021 పారిశుధ్య సర్వేలో కేంద్ర ప్రభుత్వం గత డిసెంబర్ – 2021న జరిపిన క్షేత్ర స్థాయి తనిఖీలో జగిత్యాల జిల్లాకు అవార్డు రావడం జరిగిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించిందని కలెక్టర్ తెలిపారు.

ఈ అవార్డు రావడానికి కృషి చేసిన అధికారులకు, ప్రతీ ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు .. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం ముఖ్యమంత్రి సూచనల మేరకు, మంత్రివర్యులు, ఇతరగా జిల్లా ప్రతినిధులు, ప్రజలు అందరూ ప్రభుత్వం నుండి వచ్చిన ఆదేశాల మేరకు కలిసి కట్టుగా పారిశుద్ధ్యం, గ్రామ పంచాయతి, పాఠశాల, అంగన్ వాడి, పి.హెచ్.సీ.లలో టాయిలెట్ల వినియోగం, చెత్త నిర్వహణ, మురికి నీటి నిర్వహణను పరిశీలించడం జరిగింది.

అలాగే గ్రామంలోని ఇండ్లలో మరుగుదొడ్ల వినియోగం మరియు చెత్త నిర్వహణ, ఇంకుడు గుంతల వినియోగాలను పరిశీలించడం జరిగింది. ప్రతీ గ్రామంలో వైకుంఠ దామాలు, డంపింగ్ యర్డ్స్, పల్లె ప్రకృతి వనాలు అన్ని కుడా సరైన సమయంలో నిర్మించడంతో పాటు దీనికి సహకరించిన అందరికి శుభా కాంక్షలు తెలిపారు.

ఈ అవార్డు రావడం మన అందరికి ఎంత సంతోషంగా ఉందొ బాధ్యత కూడా అంతే పెరుగుతుందని తెలిపారు. ఇక ముందుకూడా స్వచ్చత ను ఇలాగే కొనసాగిస్తూ జిల్లాను జాతీయ స్థాయిలో ముందు వరుసలో ఉంచడానికి కృషి చేస్తామని కలెక్టర్ వివరించారు.