ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
( J. Surender Kumar )
మిషన్ భగీరథ తో తెలంగాణలో తాగునీటి సమస్య పరిష్కారమైందని, జాతీయస్థాయి ‘జల్ జీవన్’ అవార్డు రావడం బిజెపి, టీఆర్ఎస్ మైత్రికి నిదర్శనమని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇందిరా భవన్ లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ తో కలిసి పట్టభద్రులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విలేకరుల శుక్రవారం పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. .మిషన్ భగీరథ పథకం పూర్తిగా మోసపూరితమని, కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా చేశారనీ, .మిషన్ భగీరథ నీటిని ఎవరు తాగడం లేదని, కేవలం గృహ అవసరాలకే ఉపయోగించుకోవడం జరుగుతుందన్నారు. మరి ఈ పథకం ఏ మేరకు తాగునీరు అందిస్తుందో, అద్దం పడుతోందని అన్నారు. ఇది కేవలం వ్యక్తిగత లాభాపెక్ష, కమిషన్ల కక్కుర్తి తోనే, ₹50 వేల కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించారని విమర్శించారు. మిషన్ భగీరథ తో తెలంగాణలో తాగునీటి సమస్య పరిష్కారమైందని జాతీయస్థాయి జల్జీవన్ అవార్డు రావడం బిజెపి టీఆర్ఎస్ మైత్రికి నిదర్శనమని అన్నారు.. మిషన్ భగీరథ నీరు ఎవరు తాగడం లేదని నీళ్లు కొనుగోలు చేసుకుని తాగుతున్న విషయాన్ని ఆయన స్పష్టం చేశారు.. ఈ నీరు కేవలం 20 కిలోమీటర్ల మేరకు క్లోరినేషన్ ప్రభావం ఉంటుందని, అనంతరం రీ క్లోరినేషన్ చేయాల్సిందేనని అధికారులు చెప్పారని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ఏదైనా గ్రామంలో రీ క్లోరినేషన్ జరిగిందని నిరూపిస్తే అభినందిస్తానని అన్నారు. ముందుగా టిఆర్ఎస్ నాయకులు ,మిషన్ భగీరథ నీరు తాగాలని సూచించారు.

జగిత్యాల మున్సిపాలిటీకి కేవలం ఎనిమిది నెలల మిషన్ భగీరథ నీటి వినియోగానికి రెండు కోట్ల 50 లక్షల 91 వేల బిల్లు కట్టాలంటూ డిమాండ్ నోటీసు పంపించారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ లో ప్లాస్టిక్ నిషేధం ఉందా.. అని ప్రశ్నించారు. స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు రావడం బీజేపీ, టీఆర్ఎస్ మైత్రికి నిదర్శ మన్నారు. టిఆర్ఎస్ కు బిజెపి కొమ్ముకాస్తుందని, దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్లుగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు.
ప్రజల దృష్టి మళ్లించేందుకు జాతీయ పార్టీ తెలంగాణ
రాష్ట్రంలో టిఆర్ఎస్ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టి మళ్లించేందుకే, సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ తెరపైకి తెచ్చారని జీవన్ రెడ్డి విమర్శించారు., తెలంగాణలో 24 గంటలు విద్యుత్ సరఫరా ఎక్కడ చేస్తున్నారు. 24 గంటలు విద్యుత్ సరఫరా చేసే ట్రాన్స్ఫార్మర్ ఉందంటే సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావుకు, తానే క్షీరాభిషేకం చేస్తానని జీవన్ రెడ్డి సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టి ఎవరిపై పోటీ చేస్తారో స్పష్టత లేదన్నారు. ఎంపీలు బండి సంజయ్, .అరవింద్ కుమార్ మాట మాట్లాడితే రేపు మాపు సీఎం కెసిఆర్ ను జైలుకు పంపిస్తామని, కరీంనగర్లో జైలుకు గది సిద్ధం చేశామంటూ మాటలు మాట్లాడతారని ఈ మాటలు కాకుండా మిషన్ భగీరథ పథకాన్ని పరిశీలిస్తే చాలని అన్నారు. గతంలో వేసిన పైప్ లైన్లు ఉండగా, కేవలం వ్యక్తిగత లావాపేక్షతోనే కొత్త పైప్లైన్ వేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని మిషన్ భగీరథ , పనుల్లో నాణ్యత లోపం ఉందని, ప్రమాణాలు పాటించడం లేదని చెప్పినప్పటికీ పట్టించుకోలేదన్నారు. కేవలం కమిషన్ల కక్కుర్తి తోనే మెగా కృష్ణారెడ్డికి, ఈ పనులు అప్పగించారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ నీ ఏర్పాటు చేసినప్పటికీ 15 సీట్లు నుంచి పోటీ చేయలేరని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ , పిసిసి సభ్యులు, గిరి నాగభూషణం, జిల్లా మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు సత్తిరెడ్డి, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు మన్సూర్ అలీ పట్టణ అధ్యక్షుడు కొత్త మోహన్ మైనార్టీ పట్టణ అధ్యక్షుడు నేహాల్ తదితరులు.పాల్గొన్నారు.