నవ సమాజానికి ఆదర్శప్రాయుడు కరీంనగర్ గాంధీ : మంత్రి కొప్పుల


స్వాతంత్ర్య సమరయోధుడిగా, ప్రజాస్వామిక ప్రజాప్రతినిధిగా నవసమాజానికి ఆదర్శప్రాయుడు తోటపల్లి గాంధీ బోయినపల్లి వేంకటరామారావు అని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్  కొనియాడారు.
బోవేరా శతజయంతి ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో గల బోవేరా భవన్ లో ఆయన కుమారుడు బోయినిపల్లి హన్మంతరావు, మరియు తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ, చైర్మన్ అల్లం నారాయణ, నగర మేయర్ సునీల్ రావు తో కలిసి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ , జ్యోతి ప్రజ్వలన చేసి  కార్యక్రమాన్ని ప్రారంభించి, అనంతరం బోవేరా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.


ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ…  స్వాతంత్ర్య సమరయోధుడిగా పోరాటం సాగించి, స్వాతంత్ర్యానంతరం ప్రజాప్రతినిధిగా ప్రజల మన్ననలు పొందిన మహనీయుడని కొనియాడారు.
తన జీవన ప్రయాణంలో నిత్యం ఎస్సీ, ఎస్టీ, బీసీల అభ్యున్నతికి పాటుపడిన మానవతావాది, కుల వ్యవస్థ ను బహిష్కరించిన మహా గొప్ప వ్యక్తి, వారి జీవితం ఉద్యమ జీవితం అని పేర్కొన్నారు.
కరీంనగర్ గాంధీగా, బోవేరాగా ప్రజలు ప్రేమతో పిలుచుకునే బోయినపల్లి వెంకటరామారావు, ఆశయ సాధనకు కృషి చేయాలని, మహనీయుల చరిత్రను స్మరించుకోవాలని, విస్తృతంగా చర్చించాలని, కరీంనగర్ జిల్లా కేంద్రంలో వారి విగ్రహ ప్రతిష్ఠ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో  ప్రముఖ రచయిత వాగ్గేయకారులు వరంగల్ శ్రీనివాస్ కు బోవేరా కవిత పురస్కారాన్ని మంత్రి అందించి, సన్మానించారు,

అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేయించాలి
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్


జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు.
శుక్రవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ రాష్ట్ర ఉన్నత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ జి రవి, జిల్లా అదనపు  కలెక్టర్ అరుణ శ్రీ, drdo వినోద్ కుమార్, ఆర్డీఓ లతో కలిసి పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతూ, 2004 జనవరి ఒకటి నుండి 2004 డిసెంబర్ 31 వరకు జన్మించిన పిల్లల వివరాలను స్థానిక పంచాయతీలు, మున్సిపాలిటీల నుంచి సేకరించి వారిని నూతన ఓటరుగా నమోదు చేయాలనీ, అదే విధంగా గత సంవత్సరం కాలంలో మరణించిన వారి వివరాలను పంచాయతీ, మున్సిపాలిటీ నుండి సేకరించాలని సూచించారు.
పంచాయతీలు, మున్సిపాలిటీల నుండి వచ్చిన జాబితాను బూత్ స్థాయి అధికారుల పరిధి నిర్దేశించి బాధ్యతలు అప్పగించాలని, నూతన ఓటరు నమోదు, మరణించిన వారి తొలగించే ప్రక్రియ చేపట్టాలని ఆయన ఆదేశించారు.


జిల్లాలో ఉన్న స్వశక్తి మహిళా సంఘాలతో బూత్ లెవెల్ స్థాయి అధికారులు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, వారి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని, సెప్టెంబర్ 5 నుంచి 9 వరకు సదరు సమావేశాలు ప్రారంభించాలని సూచించారు. జిల్లాలో ఉన్న ప్రతి బూత్ కవర్ అయ్యేలా స్వశక్తి మహిళా సంఘాల సమావేశాలు నిర్వహించాలని సూచించారు.
సెప్టెంబర్ 11 నుంచి సెప్టెంబర్ 16 వరకు జిల్లాలో ఉన్న గర్భవతులు, బాలింతలను ఓటరు జాబితాలో నమోదు చేయడం పై శ్రద్ద వహించాలని, ఇందుకు గాను అంగన్ వాడి టీచర్లను, సహాయకులను వినియోగించుకోవాలని ఆయన ఆదేశించారు. జిల్లాలో ఉన్న కళాశాల నుంచి విద్యార్థుల్లో అంబాసిడర్ లను ఏర్పాటు చేసి వారితో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించాలని సూచించారు. జిల్లాలోనీ విద్యా సంస్థల్లో చదువుతున్న 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలని ఆయన ఆదేశించారు.
సెప్టెంబర్ 19 నుంచి సెప్టెంబర్ 24 వరకు జిల్లాలో ఉన్న ఆసుపత్రులలో ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టాలని, జిల్లాలో ఉన్న వ్యాపారులతో చర్చించి వారి సంస్థలో పని చేస్తూ ఉన్న 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని తెలిపారు.
జిల్లాలో ఉన్న దివ్యాంగుల జాబితా సదరం క్యాంపు నుంచి సేకరించి వారి వివరాలను ఓటరు జాబితాలో నమోదు చేయాలని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో ఓటరు ప్రాముఖ్యత వివరిస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. బూత్ లెవెల్ అధికారిగా vro లు ఉన్న చోట ఇతరులకు బాధ్యతలు అప్పగించాలని సూచించారు. 

నేటి నుంచి ధర్మపురి క్షేత్రంలో భాగవత సప్త హాలు !

పుణ్యక్షేత్రమైన ధర్మపురిలో శనివారం  వారం రోజులపాటు భాగవత సప్తాహ పురాణ ప్రవచన కార్యక్రమం జరగనున్నది.


ధర్మప్రచారం లో భాగంగా భాద్రపద మాసంను పురస్కరించుకుని అనుబంధ దేవాలయమైన శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం లో శ్రీలక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానం మరియు స్థానిక శారదామహిళామండలి ఆధ్వర్యంలో తేది 3-09-2022 నుండి 10-09-2022 వరకు బ్రహ్మశ్రీ  Dr గర్రెపల్లి మహేశ్వర శర్మ మానకొండూర్ వారిచే ” భాగవత సప్తాహ” కార్యక్రమం స్థానిక రామలింగేశ్వర స్వామి ఆలయంలో జరగనున్నది.


బాచంపల్లి పురాణ ప్రవచనం !


ప్రముఖ పురాణ ప్రవచకులు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి, స్థానిక బ్రాహ్మణ సంఘ భవనంలో . పురాణ ప్రవచనం శనివారం ప్రారంభించనున్నారు. .క్షేత్రంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు, పురాణ ప్రవచనాలతో  ఆధ్యాత్మికత, శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దర్శనం, పవిత్ర గోదావరి నదిలో స్నానాల కోసం తరలివచ్చే భక్తజనంతో ధర్మపురి క్షేత్రం కిక్కిరిసిపోనున్నది.