లక్ష్యాల సాధనలో బ్యాంకర్లు సహకరించాలి కలెక్టర్ జి. రవి


( J.Surender Kumar )
ప్రభుత్వ లక్ష్యాల సాధనలో బ్యాంకర్ల సహకరించాలని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు. జూన్ 2022 కు సంబంధించిన త్రైమాసిక సమీక్ష లో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న అర్హులైన లబ్ధిదారులకు తక్షణం రుణ సదుపాయం అందేలా కృషి చేయాలని ఆదేశించారు.

జిల్లాలోని బ్యాంకు రుణ లక్ష్యాలు జూన్ 30 నాటికి సంబంధించిన పలు అంశాలపై కలెక్టర్ బుధ వారం సంబంధిత బ్యాంకు అధికారులు మరియు సంబంధిత ఏజెన్సీ సంబంధించిన సంస్థలతో లీడ్ బ్యాంకు కార్యాలయంలో, డిసిసి మరియు డీఎల్ఆర్సి సమావేశం నిర్వహించారు.

గత సమావేశంలో చర్చించిన అంశాల పట్ల బ్యాంకర్లు అధికారులు తీసుకున్న చర్యలను సమీక్షించారు.
జిల్లాలో ఎస్సీ సబ్ ప్లాన్ కింద పెండింగ్ లో ఉన్న 52 యూనిట్లు తక్షణమే గ్రౌండ్ చేసేలా చర్యలు తీసుకొని యూసి లు అప్లోడ్ చేయాలని ఆదేశించారు. జిల్లాల వ్యవసాయ రుణాలకు సంబంధించి యాసంగిలో 284 కోట్లు పంట రుణం 163 కోట్లు వ్యవసాయ టర్మ్ రుణాలు మంజూరు చేస్తూ, వార్షిక రుణ ప్రణాళిక కింద మొత్తం 590 కోట్ల రుణాల్ని మంజూరు చేశామని వివరించారు.
అలాగే వీధి వ్యాపారులకు సంబంధించి మొదటి విడతలో 11320 మందికి రెండవ విడతలో 4,000 మందికి రుణాలు మంజూరు చేసామని తెలిపారు. మూడో విడత రుణాలు ఆశాజనకంగా లేవని దీనిపై అన్ని బ్యాంకులు తక్షణం అర్హులైన లబ్ధిదారులకు రుణ సదుపాయం అందించాలని సూచించారు.
అలాగే సూక్ష్మ చిన్న మరియు మధ్యతరహా రుణాల కింద 86 కోట్లు, ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద 23 మందికి మంజూరు చేశామని తెలిపారు.
జిల్లాలో గ్రామీణ ప్రాంతంలో ఉన్న స్వశక్తి సంఘాలకు 109 కోట్లు పట్టణ ప్రాంత సంఘాలకు 19 కోట్లు అందించామని తెలిపారు.
జిల్లాలో ఇప్పటివరకు ప్రైవేటు బ్యాంకులు పలుమార్లు సమావేశంలో నిర్వహించినప్పటికీ కొన్ని స్కీం లలో ఆశించిన స్థాయిలో పురోగతి లేదని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బ్యాంకర్లు స్టాండప్ ఇండియా స్కీం, డైరీ ఫార్మ్, ఫిషరీస్ పశుసంవర్ధక పథకాలపై ఎక్కువ శ్రద్ధ వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ, లీడ్ బ్యాంకు మేనేజర్ పొన్న వెంకటరెడ్డి, ఆర్బీఐ ఎల్. డి. ఓ. కే. అనిల్ కుమార్, నాబార్డ్ ఏజీఎం పి. అనంత్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ హెడ్ అరుణ్ కుమార్, ఎస్బిఐ రీజినల్ మేనేజర్ ఫణి శ్రీనివాసులు తో పాటు వివిధ బ్యాంకుల ఉన్నత అధికారులు, సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు
స్త్రీ శిశు సంక్షేమం సంక్షేమ కార్యాలయంలో
బతుకమ్మ ఉత్సవాలు!


మరియు శిశు సంక్షేమ శాఖ జగిత్యాల జిల్లా ఆధ్యర్యంలో నిర్వహిస్తున్న బతుకమ్మ సంబరాలలో ముఖ్య అతిథిగా హాజరై మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ ,

అడిషనల్ కలెక్టర్ అరుణ శ్రీ ,మున్సిపల్ ఛైర్మన్ భోగ శ్రావణి ప్రవీణ్ , కౌన్సిలర్ వొద్ది శ్రీలత, DWO నరేశ్, DRDO వినోద్ సిపిడివోస్ ఐసీడీఎస్ మరియు అంగన్వాడీ సిబ్బంది ,అధికారులు, మహిళలు తదితరులు. పాల్గొన్నారు.
2లక్షల 50వేల రూపాయల LOC
అందజేసిన ఎమ్మెల్యే డా.సంజయ్!


జగిత్యాల పట్టణ 17వ వార్డ్ కి చెందిన కొండ్ర ముకేష్ గుండె సంబంధిత వ్యాధితో భాదపడుతుండగా వార్డ్ కౌన్సిలర్ సిరికొండ పద్మ సింగ రావు తో కలిసి ఆరోగ్య పరిస్థితిని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ దృష్టికి తీసుకురాగా నిమ్స్ లో శస్త్ర చికిత్స నిమిత్తం ₹ 2 లక్షల 50వేల రూపాయల LOC ని ముకేష్ తల్లిదండ్రులు లావణ్య శేకర్ కు ఈరోజు అందజేసిన జగిత్యాల శాసన సభ్యులు డా.సంజయ్ కుమార్ గారు.ముకేష్ కి 2 లక్షల 50 వేల LOC రావడానికి కృషి చేసిన ఎమ్మేల్యే గారికి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధికార ప్రతినిధి గంగారాం, కొండ్ర నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
మహిళలకు అన్నగా కేసీఆర్ !
జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత


జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలో బుధవారం బతుకమ్మ చీరలు పంపిణి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్పీ చైర్ పర్సన్ దావా వసంత హాజరయ్యారు. బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నరు..
జెడ్పీ చైర్మన్ గారు మాట్లాడుతూ:
👉🏻దసరా,బతుకమ్మ పండుగల సందర్భంగా మహిళలకు అన్నగా,.పెద్ద కొడుకుగా సీఎం కేసిఆర్ పంపిస్తున్న పుట్టింటి కానుక బతుకమ్మ చీర అని జెడ్పీ చైర్ పర్సన్ అన్నారు..


👉🏻నాడు తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే బతుకమ్మ పండుగ జరుపుకునేవాళ్ళం నేడు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు..
👉🏻ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపు రెడ్డి, జడ్పీటీసీ నాగం భూమయ్య, ఎంపీపీ జవ్వాజి రేవతి గణేష్, మార్కెట్ కమిటి చైర్మన్ వర్దినేని నాగేశ్వర్ రావు,.వైస్ ఎంపీపీ గండ్ర కిరణ్ రావు, సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు మిట్ట పెల్లి గంగ రెడ్డి, సర్పంచులు,.ఎంపిటీసీలు, ఆధికారులు,ఎంపీడీఓ నవీన్,తదితరులు పాల్గొన్నారు..