మంత్రి ఈశ్వర్ అధికార దుర్వినియోగం చేస్తున్నారు!

డిసిసి అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్.


( J.Surender Kumar )
మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎందుకోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసి అధికార దుర్వినియోగం చేస్తున్నారో,
ఆయనకు వచ్చే జీతం ₹ 2 లక్షల రూపాయల కానీ, ఇన్ని కోట్ల రూపాయలు ఎల్.ఎం కొప్పుల ట్రస్టు కి ఎలా వచ్చాయో మంత్రి ఈశ్వర్ ప్రజలకి చెప్పాలి.. అంటూ జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అడ్డూరి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు.


ధర్మపురి లో శుక్రవారం ఆయన గృహంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. .ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్, మంత్రి ఈశ్వర .కొప్పుల చారిటబుల్ ట్రస్ట్ పై. పలు ఆరోపణలు చేశారు.
ధర్మపురి లో మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎల్.ఎం కొప్పుల ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు కోలాట.పోటీలు,.యువకులకు క్రికెట్ లాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అన్నారు.
మా అంచనాల ప్రకారం మంత్రి ఈశ్వర్ ఎల్.ఎం కొప్పుల ట్రస్ట్ ద్వారా దాదాపుగా 30 లక్షల రూపాయల ఖర్చు చేశారు. ఉగాదిని పురస్కరించుకుని పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈశ్వర్ ఎందుకని కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇంత పెద్ద అధికార దుర్వినియోగం చేయడం జరుగుతుందని ఆరోపించారు. మంత్రి.ఈశ్వర్ 2009 లో ఎమ్మెల్యే గా, 2014 .నుండి, ప్రభుత్వం లో విప్ గా, మంత్రి గా సేవలు అందిస్తున్నారు. ఉన్నట్టుండి ఎందుకు మంత్రి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు చెప్పాలన్నారు.


ఎమ్మెల్సీ కవిత చెప్పులు వేసుకొని మహిళలు గౌరి దేవత ప్రతిరూపంగా పూజించే బతుకమ్మ ను ఎత్తుకోవడం ఏమిటి అంటూ ప్రశ్నించారు.
గురువారం జరిగిన కోలాటాల పోటీలు ప్రభుత్వం కార్యక్రమం కాదు. ఎల్.ఎం కొప్పుల ట్రస్టు. ఆధ్వర్యంలో జరిగే ప్రయివేట్ కార్యక్రమం.. శాంతిభద్రతల కాపాడాల్సిన పోలీసులు ఒక ప్రయివేటు కార్యక్రమనికి అంత భారీస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం,. మున్సిపాలిటీ తరపున ఏర్పాట్లు చేయడం,.అంబేద్కర్ విగ్రహం చుట్టూ టీఆర్ఎస్ పార్టీ జెండాలు కట్టడం . ఇదేనా మీరు అంబెడ్కర్ గారి పట్ల చూపించే గౌరవం. అంటూ లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు
ధర్మపురికి వరదలు వచ్చినప్పుడు, కరోన సమయంలో ఎల్.ఎం కొప్పుల ట్రస్టు ఎక్కడ ?. ఎల్.ఎం కొప్పుల ట్రస్ట్ కి సంబంధించి డబ్బుల ఎక్కడ నుండి వచ్చాయి అనే విషయంలో శ్వేతా పత్రం విడుదల చేయలని లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు.
పాత్రికేయుల సమావేశంలో సంగనభట్ల దినేష్, వేముల రాజేష్, సింహరాజు ప్రసాద్, కుంట సుధాకర్,.చిల్ముల లక్ష్మణ్, కస్తూరి శ్రీనివాస్,,రఫియొద్దిన్, అప్పం తిరుపతి, స్తంబంకాడి గణేష్,.జంజిరికానీ భరత్, తదితరులు పాల్గొన్నారు.