ఎమ్మెల్యే ప్రారంభోత్సవాలు పరిశీలనలు!


(J. Surender Kumar)
జగిత్యాల అర్బన్ మండల అంబారీపెట్ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ₹1కోటి రూపాయలు నిధులతో చేపట్టిన అర్బన్ పార్క్ ను గురువారం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సందర్శించారు. ఆయన వెంట జిల్లా లైబ్రరీ ఛైర్మెన్ డా చంద్రశేఖర్ గౌడ్ తదితర నాయకులు పాల్గొన్నారు.


అంబారిపెట్ RGSA _₹ 20 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. .అనంతరం అంగన్ వాడి కేంద్రన్ని పరిశీలించి వసతులను పరిశీలించారు.
డబుల్ బెడ్ రూమ్ లో పరిశీలన !


జగిత్యాల పట్టణములో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నుకాపల్లి డబల్ బెడ్ రూం ఇండ్లను ప్రజా ప్రతినిదులు,అధికారులతో కలిసి ఎమ్మేల్యే డా. సంజయ్ కుమార్ పరిశీలించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ జగిత్యాల పట్టణ నిరుపేద ప్రజల చిరకాల కోరిక డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణమని, నూక పల్లి లోని 4520 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు రాష్ట్రానికే తలమానికం అని, లక్ష జనాభా ఉన్న ఏ పట్టణంలో కూడా ఇంత పెద్ద మొత్తంలో డబల్ బెడ్ రూం నిర్మాణాలు జరగడంలేదని, దాదాపు 20 వేల మంది ఆత్మ గౌరవం తో ఉండాలనే ఈ కార్యక్రమం ద్వారా గూడు ను కల్పిస్తున్నామని త్వరలోనే పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. దాదాపు 70 శాతం నిర్మాణాలు పూర్తయ్యాయని, అతి త్వరలోనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఏలాంటి పైరవీలు లేకుండా పారదర్శకంగా. పంపిణీ చేస్తామన్నారు.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలకు సహకరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల పక్షాన ధన్యవాదాలు అని అన్నారు.
ఎమ్మేల్యే వెంట వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,నాయకులు భోగ ప్రవీణ్,PACS ఛైర్మెన్ సాగర్ రావు,EE రహమాన్,DSP ప్రకాష్, .కమిషనర్ గంగాధర్, DE లు మీలింధ్, రాజేశ్వర్, AE రాజ మల్లయ్య, సైట్ ఇంఛార్జి లీల మోహన్,అధికారులు, తదితరులు ఉన్నారు

లోకాయుక్తకు “బుగ్గారం పంచాయతీ నిధుల దుర్వినియోగం.. పై ఫిర్యాదు!


జగిత్యాల జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ లతో పాటు, జిల్లా పంచాయతీ అధికారి, జగిత్యాల డివిజనల్ పంచాయతీ అధికారులను కూడా బాధ్యులను చేస్తూ తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆప్ లోకాయుక్త ఆఫ్ తెలంగాణ లో పిర్యాదు చేసారు.
పనులు చేపట్టకుండానే తప్పుడు తీర్మానాలు, దొంగ రికార్డులు, దొంగ బిల్లులు సృష్టించినట్లు ప్రజా సమక్షంలోనే అధికారుల విచారణ లో తేలిందన్నారు.
అధికారులకు, ఉన్నతాధికారులకు పిర్యాదుల మీద ఫిర్యాదులు చేసి ఏండ్లు గడిచినా రాజకీయంగా వచ్చిన ఒత్తిడి, పేరుకుపోయిన విచ్చలవిడి అవినీతితో బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా అధికారులు నిర్లక్ష్యం వస్తున్నారని అని ఫిర్యాదులో. చుక్కగంగారెడ్డి పేర్కొన్నారు.

బుగ్గారం ఎస్సై మీద హెచ్.ఆర్.సి. లో పిర్యాదు!


జనసమితి జిల్లా అధ్యక్షుడు చుక్క గంగారెడ్డి
నాయకులకు వంతపాడుతూ మండల ప్రజలకు అన్యాయం చేస్తూ, ఏకంగా న్యాయస్థానాన్నే తప్పుదారి పట్టించే దారిలో. జగిత్యాల జిల్లా బుగ్గారం ఎస్సై తీగల అశోక్ ప్రయత్నిస్తున్నాడని. జన సమితి జిల్లా అధ్యక్షుడు చుక్క గంగారెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు
గత మే నెల 1న సాక్షాత్తు పోలీస్ స్టేషన్ గేటుముందే తనపై జరిగిన హత్యాయత్నం, దాడి కేసులో ప్రస్తుత ఎస్సై తీగల అశోక్ నాయకుల, ప్రజాప్రతినిధుల పేర్లు తొలగించి కేసును నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారని మానవహక్కుల కమీషన్ కు ఇచ్చిన పిర్యాదు లో పేర్కొన్నారు
. జిల్లా ఎస్పీకి పిర్యాదు చేసినా చర్యలు శూన్యం కావడంతో మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. హత్యాయత్నం కేసులో నిందితుడైన ఒక వ్యక్తి తనపై పెట్టిన తప్పుడు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పై, దొంగ సాక్షులపై కూడా పునర్విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని తెలంగాణ మానవ హక్కుల కమీషన్ ను చుక్క గంగారెడ్డి కోరినట్లు వివరించారు.