( J. Surender Kumar )
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం శ్రీరాముల పల్లె (ఇబ్రహీంనగర్) గ్రామంలో 3 కోట్ల 30 లక్షల తో పలు అభివృద్ధి పనులను ప్రారంభించి, శంకుస్థాపన చేసిన మంత్రి కొప్పుల ఈశ్వర్..

గొల్లపల్లి మండలం కేంద్రంలోని. రెడ్డి సంఘం భవనం వేదికగా, బతుకమ్మ చీరల పంపణ కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభించి, మహిళలకు బతుకమ్మ చీరలు మంత్రి పంపిణీ చేశారు.
ధర్మపురి లో దసరా కోలాట సంబరాలు!

జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఎల్.యం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ మరియు ధర్మపురి నియోజకవర్గం తెరాస పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దసరా కోలాట సంబరాల్లో భాగంగా శనివారం ధర్మారం మండలం నుండి 26 జట్లు పాల్గొన్నాయి.

ఈ పోటీల్లో పాల్గొన్న ప్రతి జట్టు సభ్యులకు ఎల్.యం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్ పర్సన్ కొప్పుల స్నేహాలత గారు చీరలను అందించారు.
ఈ కార్యక్రమంలో ధర్మారం యంపిపి ముత్యాల కరుణ శ్రీ, జెడ్పీటీసీ పుస్కూరి పద్మజ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కోమటి రెడ్డి బుచ్చిరెడ్డి, జిల్లా రైతు బంధు సమితి సభ్యులు పూస్కూరి రామారావు, ధర్మారం మండల రైతు బంధు సమితి కో ఆర్డినేటర్ పాకాల రాజయ్య, అన్ని గ్రామాల సర్పంచ్ యంపిటిసిలు
స్వచ్ఛ సర్వేక్షన్ లో కోరుట్ల టాప్ !

కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా నిర్వహించే స్వచ్ఛ సర్వెక్షన్ పోటీల్లో 2022 సంవత్సరం నకు గాను కోరుట్ల మున్సిపాలిటీ ఉత్తమ మున్సిపాలిటీగా ఎంపిక కాబడింది. ఈ పోటీల్లో దేశం లోని 4800 మున్సిపాలిటీలు పోటీ పడగా అందులో తెలంగాణ నుండి కోరుట్ల మున్సిపాలిటీకి ఉత్తమ మునిసిపాలిటీ గా అవార్డ్ లభించింది.
ఇట్టి అవార్డ్ ను అక్టోబర్ 1వ న గౌరవ భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చే మునిపల్ చైర్ పర్సన్ మరియు కమిషనర్ అందుకోనున్నారు.
గౌరవ చైర్ పర్సన్ శ్రీమతి అన్నం లావణ్య మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షన్-2022 పోటీల్లో కోరుట్ల మున్సిపాలిటీకి అవార్డు దక్కడం రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం చాలా అదృష్టం గా భావిస్తున్నమని అన్నారు. ఇందుకు సహకరించిన స్వచ్ఛ సర్వేక్షన్ కోరుట్ల బ్రాండ్ అంబాసిడర్ అయిన ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అలాగే జిల్లా కలెక్టర్ , అడిషనల్ కలెక్టర్ వైస్ చైర్మన్ , గౌరవ కౌన్సిలర్లకు మరియు కోఆప్షన్ మెంబర్లకు, SHG మెంబర్లకు, ఆర్పీలకు ముఖ్యంగా పారిశుద్య కార్మికులకు, శానిటరీ ఇన్స్పెక్టర్ కు, హెల్త్ అసిస్టెంట్ కు, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ కు మరియు పట్టణ ప్రజలకు, ఆఫీస్ సిబ్బందికి అందరికి ధన్యవాదాలు తెలియజేసినారు.
ఉచిత వైద్య శిబిరం కు భారీ స్పందన!

ధర్మపురి పట్టణ కేంద్రంలో గల స్థానిక మునిసిపల్ కార్యాలయ పరిధిలో గల శ్రీ లక్ష్మీ నరసింహ రెసిడెన్సి అపార్ట్ మెంట్ పార్కింగ్ స్థలం నందు స్థానిక 11వ వార్డ్ కౌన్సిలర్ జక్కు పద్మ రవీందర్ ఆధ్వర్యంలో.. జగిత్యాల సిగ్మా ఆసుపత్రి సిబ్బంది సహకరంతో.. శనివారం రోజు ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు జరిగిన ఉచిత వైద్య శిబిరం కు భారీ స్పందన లభించింది.
ఇట్టి వైద్య శిబిరాన్ని స్థానిక కౌన్సిలర్ జక్కు పద్మ రవీందర్ ప్రారంభించారు.. ఇట్టి వైద్య శిబిరానికి సుమారు మూడు వందల మందికి పైగా పట్టణ ప్రజలు హాజరు అవ్వగా.. వారికి ఉచితంగా బీపీ, ఈసీజీ, షుగర్, రక్త పరీక్షలు నిర్వహించి, సుమారు ₹ లక్ష రూపాయలకు పైగా విలువైన మందులను వారికి పంపిణీ చేశారు. తధానంతరం ఉచితంగా సేవలు అందించిన సిగ్మా ఆసుపత్రి రెసిడెంట్ డాక్టర్ ప్రణయ్ కుమార్, డాక్టర్ మహ్మద్ అప్రోజ్, మేనేజర్ గణేష్, క్యాంపు ఇంచార్జి మహ్మద్ షవర్, మహ్మద్ నావిద్, మహ్మద్ జవాద్, పవన్, సుజాత, పీఆర్ఓ పృథ్వీ, సీనియర్ జర్నలిస్ట్ జైషేట్టి రాకేష్ లను, స్థానిక 11వ వార్డ్ కౌన్సిలర్ జక్కు పద్మ రవీందర్ స్వీట్ బాక్స్ ఇచ్చి, కృతజ్ఞతలు తెలిపి, శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఇట్టి కార్యక్రమంలో వారితో పాటు జక్కు దేవేందర్, పప్పుల శ్రీనివాస్, రంగ హరినాథ్, పాలేపు గణేష్, సాధు శ్రీకాంత్ లతో పాటు, స్థానిక అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ముందస్తు బతుకమ్మ వేడుకలు.

ధర్మపురి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు చెరుకు రాజన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళా ఉపాధ్యాయినులు, విద్యార్థినిలు ఉత్సాహంగా పాల్గొన్నారు.