పిసిసి సభ్యుడిగా దినేష్ !

(J. Surender Kumar)

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగా ధర్మపురి నియోజకవర్గ కేంద్రమైన ధనపురి పట్టణంకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, సంగనభట్ల దినేష్ ను టి పి సి సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బుధవారం నియమించారు.

  1. మంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న దినేష్ ను. దేవదాయ శాఖ మాజీ మంత్రి స్వర్గీయజువాడి రత్నాకర్ రావు. తన హయాంలో ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ దేవస్థానం పాలకమండలి చైర్మన్ గా నియమించారు. ఎంపీటీసీగా తదితర అనేక పదవులు, నిర్వహించిన దినేష్, ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తన శ్రీమతి సంతోషిని, కౌన్సిలర్ గా గెలిపించుకోవడంతోపాటు 15 కౌన్సిల్ స్థానాల లో జరిగిన హోరాహోరి పోరులో ఏడు కౌన్సిలర్ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుపులో దినేష్ పాత్ర కీలకం . మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, 17. సంవత్సరాలుగా . కాంగ్రెస్లో కొనసాగుతున్న దినేష్ కు, పార్టీ మారాలి అంటూ ఇతర రాజకీయపార్టీలు అనేక ప్రలోభాలు, నామినేటెడ్ పదవులు ఆఫర్ చేసిన, కాంగ్రెస్ పార్టీనీ వీడలేదు. పి సి సి సభ్యుడిగా నియామకం పట్ల కాంగ్రెస్ శ్రేణులు, పలువురు వర్షం వ్యక్తం చేశారు.

జగిత్యాల జిల్లాలో..
ఫైనాన్స్ నిర్వహిస్తున్న వారి ఇళ్లపై పోలీసుల ఆకస్మిక దాడులు


జిల్లా ఎస్పీ శ్రీమతి సింధుశర్మ ఆదేశాల మేరకు జిల్లా పరిధిలోని జగిత్యాల, జగిత్యాల రూరల్, కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి పట్టణాల్లో అక్రమ ఫైనాన్సు,వడ్డీ వ్యాపారం చేస్తున్నవారి ఇళ్లపై జిల్లా పోలీసులు ఏక కాలంలో తనిఖీలు నిర్వహించడం జరిగింది. వారివద్ద నుండి నాన్ జుడిసియల్ బాండ్ పేపర్,ప్రాంసరి నోట్స్ , చెక్కు లు, ద్విచక్ర వాహనాల RC కార్డులు స్వాధీన జగిత్యాల డి.ఎస్.పి ప్రకాష్ తెలిపారు.


మొత్తం స్వాధీనపరుచుకున్న వాటి వివరములు :
స్వాధీనపరుచుకున్న నగదు సుమారు :₹ 32,11,870/- రూపాయలు, ప్రాంసరి నోట్స్ -(268), ప్రాంసరి నోట్స్ empty book (1) ,empty చెక్ లు (10), రెసిడెన్షియల్ డాక్యుమెంట్స్ (05), ద్విచక్ర వాహనాల RC కార్డులు (34), సుమారు కిలో నర వరకు బంగారం స్వాధీనం, బంగారం లెక్కింపు ఇంకా కొనసాగుతుంది.
జగిత్యాల పోలీస్ పట్టణ పరిధిలో 4 ఇళ్లలో,
కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో 6 ఇళ్లలో, ధర్మపురి పట్టణంలో 6 ఇళ్లల్లో మెట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 2 చోట్ల రాయికల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండిళ్ళు. జగిత్యాల రూరల్ పరిధిలో 3 నివాసాలతో ఆకస్మిక దాడులు జరిపినట్టు పోలీసులు వివరించారు


అనుమతులు లేకుండా ఫైనాన్స్ నిర్వహించిన, అధిక వడ్డీలతో సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పని హెచ్చరించారు
ప్రజలు తమకు ఉన్న అత్యవసర పరిస్థితి , తాత్కాలిక ఇబ్బందులకోసం అధిక మొత్తంలో అవసరంకి మించి అధిక వడ్డిలకు అప్పులు చేసి తరువాత ఆ అప్పులు,అధిక వడ్డీలు చెల్లించ లేక ఇబ్బందులతో ఆత్మహత్యలకు పాల్పడి తమ కుటుంబాలను ఇబ్బందులకు గురి చేయవద్దని కోరారు. ప్రభుత్వ అనుమతితో చట్టపరమైన పద్దతులలో ఫైనాన్స్ నిర్వహించే వారిని మాత్రమే నమ్మాలి అని ఎటువంటి ప్రభుత్వ అనుమతి లేకపోయిన అక్రమ ఫైనాన్సు వ్యాపారం నడిపేవారి వివరాలు పోలీస్ వారికి తెలియపరిస్తే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అప్పు తీసుకోవడం,ఇవ్వడం నేరం కాదు కానీ RBI నియమనిబందనలు,తెలంగాణా మని లెండింగ్ చట్టంలోని నిబందనల ప్రకారం చట్ట బద్దంగా ఎవరైనా లైసెన్స్ తొ అప్పులు ఇవ్వవచ్చు, తీసుకోవచ్చు.కాని చట్ట విరుద్ధంగా, అధిక వడ్డీ రేట్లతో సామాన్యుల పై దౌర్జన్యం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తనిఖీ లో డిఎస్పీ లు ప్రకాష్ ,రవీంద్ర రెడ్డి , జగిత్యాల, జగిత్యాల రూరల్, కోరుట్ల,మెట్పల్లి, ధర్మపురి ఇన్స్పెక్టర్ లు కిషోర్, కృష్ణకుమార్, రాజశేఖర రాజు, శ్రీను, కోటేశ్వర్ ఎస్.ఐ లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.