. ఎమ్మెల్యే సంజయ్ కుమార్, చైర్ పర్సన్ దావ వసంత
( J. Surender Kumar)
జగిత్యాల. మండలం. కన్నాపూర్ గ్రామంలో నూతనంగా మంజూరైన 46 ఆసరా పెన్షన్ ప్రొసీడింగ్లను ఐదుగురికి సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన ₹ 1 లక్ష 35 వేల రూపాయల విలువగల చెక్కులను, ఒకరికి కల్యాణలక్ష్మి చెక్కును, అందజేసి మంగళవారం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జెడ్పి చైర్ పర్సన్ దావ. వసంత. అందజేశారు. అనంతరం గ్రామంలో డిఎంఎఫ్టీ నిధులు ₹ 4.60 లక్షలతో నిర్మించిన తులసి మహిళ గ్రామ ఐక్య సంఘం భవనాన్ని ప్రారంభించి, సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు..

ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ, మహిళల అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక కార్యక్రమాలు చేపట్టారని మహిళలు ఆత్మగౌరవంతో ఉండేలా మహిళ సంఘ భవనాలు నిర్మాణం చేస్తున్నామని, మహిళల కోసం ఆరోగ్య లక్ష్మి, కెసిఆర్ కిట్, అమ్మ ఒడి, షీ టీమ్స్, బీడీ పెన్షన్స్, ఒంటరి మహిళ పెన్షన్స్, మహిళా గురుకుల పాఠశాలల ఏర్పాటు, ,కళ్యాణ లక్ష్మి, బతుకమ్మ చీరల పంపిణీ సంక్షేమ పథకాలు అమలు చేపట్టడం జరిగిందని అన్నారు .
ఎమ్మెల్యే మాట్లాడుతూ,

కన్నాపూర్ గ్రామంలో నేడు నూతన పెన్షన్ల పంపిణీ, మహిళా సంఘ భవనం ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని ఎమ్మేల్యే అన్నారు. కన్నాపూర్ గ్రామంలో 320 మంది రైతులు ఉంటే ఇప్పటివరకు మూడు కోట్లకు పైగా రైతుబంధు ద్వారా గ్రామానికి నిదులు వచ్చాయని అన్నారు. .కన్నాపూర్ గ్రామంలో ఏడుగురు రైతులు చనిపోతే.₹ 35 లక్షలు ఆయా కుటుంబాల ఖాతాలో ఎలాంటి పైరవీ లేకుండా జమ అయ్యాయని అన్నారు ..తెలంగాణ రాష్ట్రంలో 43 లక్షల మంది రైతులకు ఒక్కొక్కరికి ₹ 3886 చొప్పున ప్రీమియం చెల్లిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. కన్నాపూర్ గ్రామంలో 256 పెన్షన్లు ఉన్నాయని ఇండ్ల సంఖ్య కంటే పెన్షన్ ల సంఖ్య ఎక్కువ అని అన్నారు. నేడు రాష్ట్రంలో ప్రజలు అభివృద్ధిని తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాకముందు అనే విధంగా ఆలోచన చేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజేంద్ర ప్రసాద్, పాక్స్ ఛైర్మెన్ మహిపాల్ రెడ్డి, ,మండల రైతు బందు సమితి కన్వీనర్ నక్కల రవీందర్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు బాల ముకుందం, సర్పంచ్ కొక్కు సుధాకర్, ఎంపీటీసీ రెడ్డి రత్న రవి,, నాయకులు, కార్యకర్తలు,అధికారులు, ప్రజలు, తదితరులు, పాల్గొన్నారు.
పరామర్శలు !
జగిత్యాల రూరల్ మండలం గుట్రాజపల్లి గ్రామానికి చెందిన శ్రీరామ్ గంగవ్వ అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను,
రాయికల్ మండల భూపతి పూర్ గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు యండి రబ్బానా డెంగ్యూ జ్వరంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను

రాయికల్ మండల కుమ్మరి పెళ్లి గ్రామానికి చెందిన యువకుడు కొరుకొండ రాజీ రెడ్డి ఇటీవల వినాయక నిమజ్జనం సందర్భం గా విద్యుత్ తీగలు సరిచేస్తూ విద్యుత్ ఘాథానికి గురై మరణించగా రాజీ రెడ్డి కుటుంబ సభ్యులను . ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పరామర్శించి,సానుభూతి తెలిపారు.