జిల్లా కలెక్టర్ జి. రవి
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ జి. రవి అధికారులను ఆదేశించారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలో స్థానిక ఐ ఎం ఏ హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 22 మంది ప్రజల సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను అదనపు కలెక్టర్లు బి.ఎస్. లత, అరుణశ్రీ తో కలిసి జిల్లా కలెక్టర్ స్వీకరించారు. ప్రజల నుండి అందిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించుటకు సంబంధిత శాఖలకు కలెక్టర్ తెలిపారు.

ఆర్డీవో వినోద్ కుమార్ మరియు జిల్లా అధికారులు వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు
యూత్ కాంగ్రెస్ నాయకుల ముందస్తు అరెస్టు !
ఖండించిన జువ్వాడి కృష్ణ రావు.

యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి పిలుపు మేరకు కోరుట్ల నియోజకవర్గo లోని యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ ఏలేటి మహిపాల్ రెడ్డి ని మరియు యువజన కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ ని టీపీసీసీ నేత జువ్వాడి కృష్ణ రావు తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్రం లో (వి ఆర్ ఏ)లు పడుతున్న ఇబ్బందుల గురించి ప్రభుత్వ నికి తెలియజేయడానికి , అసెంబ్లీ ముట్టడి కి పిలుపునిచ్చింన యువజన కాంగ్రెస్ నాయకులను మెచ్చుకున్నారు. .అనంతరం జువ్వాడి కృష్ణ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినాక తెలంగాణలో ధర్నా లు చేసేవారే అగుపించరు, అని అన్న ముఖ్యమంత్రి రాష్ట్రంలో VRA లు ఎందుకు ధర్నాలు చేస్తున్నారు ? అని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా VRA లను రెగ్యులర్ చేస్తా అని చెప్పిన సీఎం ఇప్పటి వరకు ఎందుకు చేయలేదు అని ప్రశ్నించారు. గత 50 రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ధర్నా లు మీకు ఎందుకు కనిపించడం లేదు ? అని అన్నారు. ప్రజా పాలన పక్కన పెట్టి ,దేశ రాజకీయలు అంటు తిరుగుతున్న సీఎం. ప్రజా సమస్యలను గాలికి వదిలేశారు అని జువ్వాడి ఆరోపించారు. ముఖ్యమంత్రి కి పాలన చేతన అయితే చేయాలి లేకుంటే పదవికి రాజీనామా చేయాలి అంటూ ఆయన డిమాండ్ చేశారు.
ధర్మపురిలో ముందస్తు అరెస్టులు !

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి అసెంబ్లీ ముట్టడికి పిలుపు ఇచ్చిన సందర్బంగా ధర్మపురి పోలీస్ లు ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. అరెస్ట్ ఐన వారిలో ధర్మపురి నియోజకవర్గ యూత్ అధ్యక్షులు సింహారాజు ప్రసాద్, ధర్మపురి మండల యూత్ అధ్యక్షులు రందేని మోగిలి, ధర్మపురి పట్టణ యూత్ అధ్యక్షులు అప్పం తిరుపతి ఉన్నారు.
ప్రవాసులు పంపిన 89 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యం !
సి-20 దేశాల సమావేశంలో భారత ప్రతినిధి
మంద భీంరెడ్డి వెల్లడి!

కోవిడ్ సమయంలో అధిక విమాన చార్జీలు, క్వారంటైన్ చార్జీలతో ఇబ్బంది పెట్టిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
గల్ఫ్ నుంచి వాపస్ వచ్చేవారి కోసం విపత్తు నివారణ లాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలి అంటూ వివరించారు.
ఈనెల 13, 14 న జి-20 దేశాల కార్మిక మంత్రుల స్థాయి సదస్సు జరుగనున్న నేపథ్యంలో వలస కార్మికుల అభిప్రాయాలను వ్యక్తం చేయడం కోసం సోమవారం ఇండోనేషియా లోని ‘మైగ్రెంట్ కేర్’ అనే సంస్థ సి-20 అనే సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ (సభ్య సమాజ సంస్థలు) సమాంతర సమావేశాన్ని (సైడ్ ఈవెంట్) ను నిర్వహించింది. ఈ సమావేశాన్ని హైబ్రిడ్ మోడ్ (మిశ్రమ విధానం) లో ఇండోనేసియా లోని బాలి లో ప్రత్యక్ష సమావేశం ఏర్పాటు చేసి, జూమ్ ద్వారా వివిధ దేశాల నుంచి ప్రతినిధులు ఆన్ లైన్ లో పాల్గొనేలా నిర్వహించారు.
సమావేశంలో జూమ్ ద్వారా ఆన్ లైన్ లో భారత ప్రతినిధిగా పాల్గొన్న వలస వ్యవహారాల విశ్లేషకులు, అంతర్జాతీయ వలస కార్మిక నాయకుడు మంద భీంరెడ్డి మాట్లాడుతూ… కరోనా సందర్బంగా గల్ఫ్ నుంచి భారత్ కు వాపస్ వచ్చిన లక్షలాది మంది కార్మికులు వారికి రావాల్సిన జీతం బకాయిలు, ఎండ్ ఆఫ్ సర్వీస్ బెనిఫిట్స్ (ఉద్యోగ అనంతర ప్రయోజనాలు) పొందలేకపోయారని అన్నారు. గల్ఫ్ లోని కంపెనీ యాజమాన్యాలు కార్మికులకు జీత, భత్యాలు ఎగవేయడంపై ‘జస్టిస్ ఫర్ వేజ్ థెఫ్ట్’ (వేతన దొంగతనంపై న్యాయం చేయండి) అనే ఉద్యమం నడుస్తున్నది అని వివరించారు.
గత సంవత్సరం (2021-22) లో ప్రవాస భారతీయులు నుంచి 89 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన విదేశీ మారక ద్రవ్యం (ఫారెక్స్) భారతదేశం పొందిందని మంద భీంరెడ్డి అన్నారు. ఇది దేశ జిడిపి (స్థూల దేశీయ ఉత్పత్తి) లో 3 శాతం అని అన్నారు. ఇందులో ఆరు అరబ్ గల్ఫ్ దేశాలలో నివసించే సుమారు 10 మిలియన్లు (ఒక కోటి) మంది భారతీయ కార్మికుల చెమట చుక్కల ద్వారా సంపాదించిన సొమ్మే అధికమని ఆయన అన్నారు.
కోవిడ్ సందర్బంగా విదేశాల నుంచి వాపస్ వచ్చిన కార్మికులను అధిక విమాన చార్జీలతో కేంద్ర ప్రభుత్వం, క్వారంటైన్ చార్జీలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెట్టాయని మంద భీంరెడ్డి విమర్శించారు. వాపస్ వచ్చిన వారిని ఆదుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి పునరావాస కార్యక్రమాలు చేపట్టలేదని అన్నారు.
గల్ఫ్ దేశాల నుంచి రకరకాల కారణాల వలన వాపస్ వచ్చే వారిని ఆదుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఒక శాశ్వత వ్యవస్థ ఏర్పాటు చేయాలని భీంరెడ్డి సూచించారు. కోవిడ్-19 మహమ్మారి వలన ఉత్పన్నమైన పరిస్థితులు, వాతావరణ మార్పులు, యుద్ధాలు, ప్రపంచ ఆర్థిక మాంద్యం, కంపెనీలు దివాలా తీయడం, వీసాలు లేని వారిని వాపస్ పంపే ఆమ్నెస్టీ (క్షమా బిక్ష) లాంటి సంక్షోభాలకు పరిష్కారం చూపేలా ఆకస్మిక ఆపద, విపత్తు నివారణ లాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసినట్టు భీమ్ రెడ్డి పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.