ప్రకృతి ఆరాధించే పండుగ  బతుకమ్మ ! కొప్పుల స్నేహలత!



తెరాస మహిళా విభాగం ఆధ్వర్యంలో మరియు ఎల్. యం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ సహకారం తో జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం స్థాయి దసరా కోలాట సంబరాల ఫోటీలు ధర్మపురి ప్రభుత్వ కళాశాల వేదికగా నిర్వహించనున్నారు.
సోమవారం ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ధర్మపురి నియోజకవర్గ తెరాస మహిళా విభాగం ఆధ్వర్యంలో ఎల్.యం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్ పర్సన్ కొప్పుల స్నేహలత  దసరా కోలాటాల సంబరాల పోటీలకు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు.


ఈ సందర్భంగా స్నేహలత గారు మాట్లాడుతూ
ధర్మపురి నియోజకవర్గం స్థాయి దసరా కోలాట సంబరాల పోటీలు ముఖ్య ఉద్దేశ్యం నియోజకవర్గ మహిళల ప్రతిభను చాటి చెప్పటానికి , మహిళలను ఒకే వేదికపై తీసుకురావాలని చేస్తున్నా ప్రయత్నం….
ప్రకృతి పండుగ బతుకమ్మ పండుగ, ఈ పండుగ ఆడబిడ్డల పండుగ, ప్రపంచంలో ప్రకృతి ఆరాధించే అరుదైన పండుగ ఏది అంటే ఏమాత్రం సందేహం లేకుండా చెప్పే పండుగ, బతుకమ్మ పండుగ.

అని అన్నారు. బతుకమ్మ అంటే ప్రకృతే. ఆడపిల్లలను బతుకు అమ్మా’ అని మనసారా ఆశీర్వదించే పండుగ ఈ బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన ఆడపడుచు ఇష్టమైన బతుకమ్మ పండుగ ప్రపంచంలోనే గుర్తింపు పొందింది, దీనికి ముఖ్య కారణం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ యంపి, ప్రస్తుత నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అని అన్నారు.
ఈ  పోటీలు ఈ నెల 22-9-2022 తేదీ నుండి ఘనంగా నిర్వహిస్తున్నట్లు స్నేహలత వివరించు
  కోలాట సంబరాల కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ సెప్టెంబర్ 12.వ తేది నుండి సెప్టెంబర్ 20.వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు,


నగదు బహుమతుల ప్రథమబహుమతి: ₹ 50,000/ద్వితీయబహుమతి: ₹ 30,000/- తృతీయబహుమతి: ₹ 20,000/-
ప్రతిభ కనబర్చిన మహిళకు ప్రత్యేక వ్యక్తిగత కన్షోలేషన్  బహుమతులు ఇవ్వడం జరిగిందన్నారు.
పోటీకి ఎటువంటి ఎంట్రీఫీజు లేదు
ధర్మపురి నియోజకవర్గ నుండి మొట్టమొదటి సారి మహిళల కోసం నిర్వహిస్తున్న ఈ పోటీలకు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు..

పీఠాధిపతుల నియామకం !


రెండు ఆమ్మాయ పీఠాలకు వారసులను ప్రకటించారు. స్వామి ఉత్తరామ్నాయ బదరీపీఠం పీఠాధీశ్వరులుగా శ్రీశ్రీశ్రీ అవిముక్తేశ్వరానంద సరస్వతీ స్వామివారు మరియు పశ్చిమామ్నాయ ద్వారకా పీఠం పీఠాధీశ్వరులు గా స్వామి సదానంద వరుసగా జ్యోతిష్పీఠం బద్రీనాథ్ మరియు ద్వారకా శారదా పీఠాలకు అధిపతులుగా నియమితులయినట్లు మఠం వర్గాలు వెల్లడించాయి,


ఉత్తరామ్నాయ బదరీపీఠం, పశ్చిమామ్నాయ ద్వారకా పీఠం పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య ధర్మసమ్రాట్ శ్రీశ్రీశ్రీ స్వరూపానంద సరస్వతి మహరాజ్, బ్రహ్మైక్యం తర్వాత ఈ నియామకాలు జరిగాయి. 


మంగళవారం ధర్మపురి పట్టణం బంద్ !


హిందూ దేవి దేవతలను అవహేళన చేస్తున్న కొందరు హిందూ వ్యతిరేకులు నిర్వహిస్తున్న కామెడీ షోను అడ్డుకున్నందుకు  గోషామాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ను  పిడి ఆక్ట్ కింద అరెస్టు చేసి జైల్లో పెట్టడం జరిగింది,హిందూ పడుగలకి, హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం కు వ్యతిరేకంగా అలాగే రాజాసింగ్ కు మద్దతుగా ధర్మపురి  లో మంగళవారం 13-09-2022  రోజున ధర్మపురి బంద్ ను ప్రకటించారు.   రాజకీయాలకు అతీతంగా అందరం ఒకటే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా హిందూ ఐక్య వేదిక  ప్రకటన లో పేర్కొన్నారు.

దళితబంధు ఇస్తారా.. విషం తాగి చావాలా?’


తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న ‘దళిత బంధు’ పథకం ద్వారా ఇచ్చే రూ. 10లక్షలను తమకూ ఇవ్వాలని  హుజూరాబాద్ కి ఇల్లందకుంట కి  చెందిన  దళితులు కరీంనగర్ కలెక్టరేట్ వద్ద పురుగుల మందు డబ్బాలతో నిరసనకు దిగారు. అభ్యర్థులను ఎంపిక చేయడంలో మోసాలు జరిగాయని ఆరోపిస్తూ.. దరఖాస్తుదారులు ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.


ఎమ్మెల్సీ కవితకు  కరోనా !


ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ‌కరోనా పాజిటివ్
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది… గత రెండు ‌మూడు రోజులుగా స్వల్ప దగ్గుతో బాధపడుతున్న ఎమ్మెల్సీ కవిత, పరీక్షలు నిర్వహించగా కరోనా నిర్దారణ అయింది.
దీంతో గత కొన్ని రోజులుగా తనను‌ కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు. అంతేకాదు కొన్ని రోజుల పాటు హోం ‌ఐసోలేషన్ లో ఉండనున్నట్లు ఎమ్మెల్సీ కవిత  ట్విట్టర్లో పేర్కొన్నారు.


రేపు సంకష్ట చతుర్థి !


13-09-2022 మంగళవారం “అంగారక సంకటహర చతుర్థి”  సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం లో గల శ్రీ గణపతి ఆలయంలో  ఉదయం 9-00 గంటలకు అభిషేకం, హారతి మంత్రపుష్పం కార్యక్రమాలతో అత్యంత వైభవంగా నిర్వహించ ఉన్నట్టు ఆలయ అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు.