సికింద్రాబాద్ అగ్నిప్రమాదంలో
(J.Surender Kumar)
మండుతున్న అగ్నిగుళంలా ఎగిసిపడుతున్న అగ్ని కీలలు దట్టమైన పొగ, ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అయిన పలువురి ప్రాణాలు. ఈ దశలో ప్రాణాలు పణంగా పెట్టి తన ప్రాణాన్ని లెక్కచేయకుండా, ప్రమాదంలో ఉన్న వారి ప్రాణాలు కాపాడడం కోసం సాహసం చేసి వారి ప్రాణాలు కాపాడిన భయానక సంఘటన గురించి వణుకు పుడుతుంది.. వారిప్రాణాలను కాపాడిన కానిస్టేబుల్ ఆడెపు రాకేష్, మార్కెట్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. స్వగ్రామం జగిత్యాల జిల్లా. బీర్పూర్ మండలం తుంగూరు

సికింద్రాబాద్ లోని రూబీ లాడ్జింగ్ లో అగ్ని ప్రమాదం సంబంధించి ఎనిమిది మంది మృతి చెందగా పలువురు తీవ్ర గాయాల పాలైన విషయం తెలిసిందే.
సోమవారం రాత్రి 9 -10 గంటల ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసు వాహనంకు 100 నుంచి పోలీస్ యంత్రాంగం అప్రమత్తం చేస్తూ ఆదేశాలు వచ్చాయి. సికింద్రాబాద్ రూబీ లాడ్జింగ్, వద్ద ఏదో జరుగుతుంది వెళ్ళండి అంటూ దాని సారాంశం. ఆ దారి గుండా వెళ్తున్న పెట్రోలింగ్ పోలీసు వాహనం అక్కడ ఆగింది.

బిలబిలమంటూ పోలీసులు దిగారు. దట్టమైన నల్లటి పొగ, మంటలు. ఆ పాటికే చాలా మంది మంటలను, ఆర్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. కొందరు నీటి క్యాన్లు తో చల్లార్చడానికి ప్రయత్నం చేయగా, పెట్రోలింగ్ పోలీసుల. బృందం అడ్డుకుంది. విద్యుత్ సరఫరా కొనసాగితే షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం సంభవిస్తుందని వీరు వారిని అప్రమత్తం చేశారు. పరిస్థితిని పోలీసు ఉన్నతాధికారులకు, అంబులెన్స్, ఫైర్ స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. ఈ దశలో లాడ్జింగ్ నుంచి ఆర్తనాదాలు

వినిపించసాగాయి. రూబీ లాడ్జింగ్ లోనికి వెళ్లడానికి వీల్లేదు. దట్టంగా వస్తున్న నల్లటి పొగ పోలీసులను, అక్కడివారిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. లోనికి వెళ్లడం ఎలా అంటూ ఆలోచనతో పక్కనే ఉన్న “యాత్రిక్ లాడ్జి” వైపు ఆడెపు రాకేష్ అనే కానిస్టేబుల్ పరిగెత్తాడు. అక్కడే ఉన్న ఆ లాడ్జింగ్ receptionist వెంటబెట్టుకొని వారి లాడ్జ్ మెట్టకుండా టెర్రస్ పైకి చేరుకొని రూబీ లాడ్జిలో ఉన్న వారిని కేకలు వేస్తూ, అరుస్తూ అప్రమత్తం చేశాడు. అప్పటికే దట్టమైన నల్లని పొగలు 3 అంతస్తుల వరకు వ్యాపిస్తున్నాయి. వీరి అరుపులకు లాడ్జి రూముల్లో ఉన్నవారు గదిలో తలుపులు తేర్చుకొని బయటికి రావడానికి ప్రయత్నించారు. కానీ రాలేకపోయారు, కిటికీల గుండా వారి పరిస్థితిని అరిచిన వైపు చూస్తూ రోధిస్తూ వివరించారు. చిమ్మ చీకటి ఈ దశలో రాకేష్ “యాత్రి లాడ్జి టెర్రస్ పై నుండి రూబీ లాడ్జి టెర్రస్” పైకి చేరుకున్నాడు. టెర్రస్ పై నుండి మెట్లు దిగుతూ నాలుగో ఫ్లోర్ లోని రూములలో ఉన్న వాళ్ళని తట్టుతూ అప్రమత్తం చేశాడు. ఈ దశలో ఇన్చార్జ్ ఎస్ఐ కనకయ్య కూడా అదే దారి ద్వారా వచ్చారు. ముందుగా లాడ్జి గదులలో నివాసం ఉన్న నలుగురిని (గదులు అద్దెకు తీసుకున్న వారిని ) టెర్రస్ పైకి తీసుకొచ్చారు.. వారికి ధైర్యం చెబుతూ, మీకేం కాదు, మా శాఖ అన్ని విధాలు అదుకుంటుంది, ఫైర్ ఇంజన్లు వస్తున్నాయి, అంటూ ఓదార్చారు.

.తిరిగి మిగతా వారి కోసం కిందికి దిగారు అదే మెట్లగుండా మూడో ఫ్లోర్ లోకి చేరుకోవడానికి విశ్వ ప్రయత్నం చేశారు. కానీ దట్టమైన పొగ కారిడార్ లో ఇద్దరు ,ముగ్గురు పడిపోయి ఉన్నారు. ఆ పాటికే వారు స్పృహంలో లేరు. చిమ్మ చీకటి. ఈ దశలో ఫైర్ ఇంజన్ లు అక్కడికి చేరుకొని మంటలు అదుపులోకి తేవడానికి కష్టపడుతున్నారు. ఫైర్ ఇంజన్ క్రేన్ సహాయంతో రూబీలాడ్జ్ టెర్రస్ పై ఉన్న నలుగురిని సురక్షితంగా కిందికి దించారు. ప్రాణాలకు తెగించి సాహసం చేసిన కానిస్టేబుల్ రాకేష్ ధర్మపురి పట్టణంలోని శ్రీవాణి విద్యాలయంలో పదవ తరగతి వరకు చదువుకున్నాడు. ప్రాణాలకు తెగించి అతని సాహసాన్ని ప్రచార సాధనాల్లో మారుమోగా, అతని స్నేహితులు రాకేష్ ఫోటోలు. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
రియల్లీ రాజేష్ యువర్ గ్రేట్.
రియల్లీ రాజేష్ యువర్ గ్రేట్.