(J. Surender Kumar)
ప్రపంచంలో అత్యంత ధనిక హిందూ దేవాలయం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానముగా గుర్తింపు కలిగి ఉందని ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ వై .వి .సుబ్బారెడ్డి తెలిపారు.
దేశవ్యాప్తంగా 960 ప్రాంతాల్లో ₹.85, 705 ( 85 వేల 705, కోట్లు) విలువ గల ఆస్తులు ఉన్నాయని, ఈ ఆస్తులు మొత్తం 7, 123 ఎకరాలలో విస్తరించి ఉందన్నారు.

1974 నుంచి 2014 వరకు వివిధ ప్రభుత్వాల ఆధ్వర్యంలో వివిధ ట్రస్టుల ద్వారా వివిధ రకాల కారణాలతో ఆలయం కు చెందిన 113 ఆస్తులను కోల్పోయారని అన్నారు. 2014. తరువాత నేటి వరకు ఎలాంటి ఆస్తులు, ఆదాయం కోల్పోలేదని వివరించారు. దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకులలో ₹ 14,000/- ( 14 వేల కోట్ల రూపాయలు) సెక్స్ రెడ్ డిపాజిట్ రూపంలో ఉన్నాయన్నారు. వీటితోపాటు 14 టన్నుల బంగారం నిలువలు ఉన్నాయన్నారు. ఏపీ ప్రభుత్వం ఆదేశాల మేరకే టీటీడీ హాస్టల్కు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేశామని, ఆస్తులకు సంబంధించిన వివరాలను శ్వేత పత్రం విడుదల చేస్తామన్నారు