సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలి

ప్రజావాణికి 25 ధరఖాస్తులు
కలెక్టర్ జి. రవి


( J.Surender Kumar )
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ జి. రవి అధికారులను ఆదేశించారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలో స్థానిక ఐ ఎం ఏ హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 25 మంది ప్రజల సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను అదనపు కలెక్టర్లు బి.ఎస్. లత, అరుణశ్రీ తో కలిసి జిల్లా కలెక్టర్ స్వీకరించారు. ప్రజల నుండి అందిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించుటకు సంబంధిత శాఖలకు కలెక్టర్ తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను ప్రాధాన్యతతో వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ సూచించారు.
ఆర్డీవోలు. వినోద్ కుమార్. మాధురి మరియు జిల్లా అధికారులు వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు
సన్మానం !


అనంతరం స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ భారత్ లో దేశంలోనే జగిత్యాల జిల్లా కు 2 వ ర్యాంకు సాధించిన సందర్భంగా జిల్లా కలెక్టర్ రవి నాయక్ గారికి శుభాకాంక్షలు తెలియజేసి సన్మానించిన జిల్లా అధికారులు.

పెండింగ్ లో ఉన్న పనులను

వేగవంతంగా పూర్తీచేయాలనీ జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

సోమవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జిల్లా అధికారులతో హరిత హారం, ఈ.జి.ఎస్., దళిత బంధు, వైకుంఠ ధామం, తదితర అంశాలపై జూమ్ మీటింగ్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హరిత హారం కార్యక్రమంలో భాగంగా ఎన్ని మొక్కలు నాటారు, తీసేసిన మొక్కల స్థానంలో మొక్కలు నాటారా లేదా, మొక్కలు తీసేసిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు అని అధికారులను హెచ్చరించారు. మొక్కలకు జియో ట్యాగింగ్ చేయించాలని ఆదేశించారు. ఈ.జి.యస్ పనులలో భాగంగా ఫీల్డ్ తనిఖి కి వెళ్ళినప్పుడు ఎంతమంది కూలీలు ఉంటారో, రోజూ కూడా అంతే మంది కూలీలు ఉండే విధంగా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రిజిష్టర్ లు ఎప్పటికప్పుడు పెండింగ్ లో లేకుండా చెక్ చేసుకోవాలని సూచించారు. దళిత బంధు లబ్దిదారుల జాబితాను వేగవంతంగా పూర్తీ చేసి వెరిఫికేషన్ చేయాలనీ కలెక్టర్ ఆదేశించారు. వైకుంఠ ధామం వైపు వెళ్ళే రోడ్డు గుంతలు లేకుండా సరి చేయించాలని అధికారులను ఆదేశించారు. ఈ- ఆఫీస్ లో వచ్చిన ఫైల్స్ ని వెంట వెంటనే చెక్ చేసి రిపోర్ట్ చేసి వాటిని వేగవంతంగా పూర్తీ చేయాలనీ తెలిపారు. ప్రజావాణి లో వచ్చిన సమస్యలను పెండింగ్ లో లేకుండా వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా అధికారులు సమన్వయంతో కలిసి పనిచేసుకోవాలని అధికారులకు సూచించారు. పించన్ కార్డుల జారీ లో జాప్యం జరుగకుండా వెంట వెంటనే లబ్దిదారులకు పంపిణి చేయాలనీ కలెక్టర్ ఆదేశించారు.
ఈ జూమ్ మీటింగ్ లో అదనపు కలెక్టర్లు బి.ఎస్.లత, అరుణ శ్రీ, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.