సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా !
మంత్రి కొప్పుల ఈశ్వర్!


తిరుమలగిరి 135.వ డివిజన్ వెంకటాపురం లోని బుర్హాని హౌసింగ్ సొసైటీని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సందర్శించి, ఈ సందర్భంగా బోహ్రాస్ మత ప్రముఖులు లతో ఆదివారం సమావేశమయ్యారు.
అంతకు ముందు కాలనీలో మంత్రి కొప్పుల ఈశ్వర్ కు కమ్యునిటి ప్రెసిడెంట్ జనాబ్ జుజర్ భాయ్ షాహిద్, అలీ అస్తఘర్ భాయ్, అహ్మద్ షకీర్ ఘన స్వాగతం పలికారు.


కాలనీలోని పలు సమస్యలను వివరించగా పరిష్కారాలకు మంత్రి సానుకూలం స్పందించారు, అనంతరం బోహ్రాస్ మత ప్రముఖులు మంత్రి కి శాలువా తో సత్కరించారు.

భవన నిర్మాణానికి శంకుస్థాపన !


కోరుట్ల పట్టణంలో మైనారిటీ బైతుల్ మాల్ వెల్ఫేర్ సొసైటీ భవన నిర్మాణానికి ఆదివారం శంకుస్థాపన చేసిన కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు . అనంతరం మైనారిటీ బైతుల్ మాల్ వెల్ఫేర్ సొసైటీ చేస్తున్న వివిధ సామాజిక కార్యక్రమాలను గురించి వివరించిన మజర్ మౌలానా . నిరుపేద కుటుంబాలు చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరితే వారి యోగక్షేమాలు తెలుసుకోవడంతో పాటు వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు సొసైటీ స్థాపించినప్పుడు నుంచి ఇప్పుడు వరకు ప్రతి నెల ఆరు వందల మంది వితంతువులకు పెన్షన్ అందిస్తున్నామని తెలిపారు. బైతుల్ మాల్ వెల్ఫేర్ సొసైటీ వారు అందజేసే పెన్షన్లను లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందించారు.
ఈ సందర్భంగా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడుతూ: తెలంగాణ రాష్ట్రంలో సర్వ మతాలను సమానంగా చూడడంతో ప్రజలందరూ కలిసిమెలిసి జీవిస్తున్నారని అన్నారు. ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వలేనటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రిగా నిలిచారని అన్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహి లు, బీడీ కార్మికులు గీత కార్మికులు, ప్రభుత్వం ప్రతినెల ఆసరా పెన్షన్లు అందిస్తున్న ఘనత దివ్యాంగులకు నెలకు రూ.3016 వృద్ధులు వితంతువులకు, ఇతర కేటగిరీల వారికి రూ.2016 చొప్పున అందిస్తున్నారని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని వర్గాల ప్రజలు అండగా నిలుస్తున్నారని తెలిపారు. సీఎం కెసిఆర్ ని నిండు మనసుతో ఆశీర్వదించాలని ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రజలందరినీ కోరారు.
ప్రజలకు ఇచ్చిన మాటపై నిలబడే నాయకుడు సీఎం కేసీఆర్ పాలనలో పనిచేయడం సంతోషం ఉందన్నన్నారు. ఎమ్మెల్యేగా తనకిచ్చిన ఈ అవకాశాన్ని మీ అందరికీ ఉపయోగపడే విధంగా అభివృద్ధి కార్యక్రమాల కోసం పాటుపడతానని త్వరలోనే ప్రతి మీ ఇంటికి వస్తానని అన్నారు.పేదల అభ్యున్నతికి సంక్షేమ పథకాలను చేయడంతో పాటు వారి ఆత్మగౌరవం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు.

అధిక ధరలకు నిరసనగా జిల్లా మహిళ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన.,


స్థానిక ఇందిర భవన్ నుండి బయలుదేరి తహసిల్ చౌరాస్తా వద్ద విభిన్నమైన రీతిలో కూరగాయల దండలు వేసుకొని నిరసన కార్యక్రమం మరియు రాస్తారోకో నిర్వహించిన నాయకులు.
ఈ సందర్భంగా జిల్లా మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.

.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు GST పేరుతో పేద ప్రజలను దోచుకున్నరంటు, గ్యాస్ సిలిండర్ పై సబ్సిడీ ఎత్తివేసి మధ్యతరగతి కుటుంబాలను ఆవేదనకు గురిచేస్తున్నారని,2014 వరకు 435 రూపాయలు ఉన్న సిలండర్ ధరను ఈరోజు 1150 రూపాయలు చేసి పేద ప్రజలను మనోవేదనకు గురిచేస్తున్నారని,నిత్యావసర వస్తువులైన కూరగాయలు, పప్పులు,వంటనూనె, చింతపండు,టి పౌడర్, పిండి,అటుకులు, ఉప్పు, ఆఖరుకు పసిపిల్లలు తాగే పాల ధర పైన GST వేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిగ్గుపడాలని,GST పేరుతో ప్రతి పేదవాణ్ణి ఇంకా పేదరికంలోకి నెట్టుటకు కుట్ర జరుగుతోందని మండి పడ్డారు., బిజెపి ప్రభుత్వం మతరాజకీయాలు తప్ప సామాన్య ప్రజలకు న్యాయం చేయట్లేదని ఎద్దేవా చేశారు. అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆస్తులను అమ్ముకుని ఈ దేశాన్ని నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులు ఈరోజు వరకు ఆ ఫలాలు పేద ప్రజలకు అందుతున్నాయని,కాంగ్రెస్ పార్టీ అనాడైన ఈనాడైనా పేద ప్రజల సంక్షేమాన్ని కోరుతుందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్పుల మీద అప్పులు చేస్తూ పుట్టబోయే ప్రతి బిడ్డమీద చెరో లక్ష రూపాయల అప్పు వేశారని మండిపడ్డారు.


ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అద్యక్షులు కొత్త మోహన్, మాజీ మున్సిపల్ చేర్మెన్ గిరి నాగభూషణం, పులి సునీత, బింగి సుమ,చిట్ల లత, ఆకరపు రూప,నాగిరెడ్డి రజిత,సామ సుజాత,కుర్మ లత, మరియుకాంగ్రెస్ నాయకులు,యూత్ కాంగ్రెస్,NSUI నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంఘ భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే సంజయ్!


జగిత్యాల రూరల్ మండల చల్ గల్ గ్రామంలో సిడిపి,DMFT నిదులు 6.30లక్షల తో నిర్మించిన మున్నూరు కాపు వెల్ఫేర్ సొసైటీ నలువాల వాడ మున్నూరు కాపు సంఘ కమ్యూనిటీ హాల్ ను ప్రారంబించిన జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ గారు, జెడ్పీ చైర్ పర్సన్ దావా వసంత సురేష్ గారు.అనంతరం.మున్నూరు కాపు సంఘం అధ్వర్యంలో వినాయకుణ్ణి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి,అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే,జెడ్పీ చైర్ పర్సన్.


ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బందు సమితి అధ్యక్షుడు చీటీ వెంకట్ రావు,.ఎంపీపీ రాజేంద్ర ప్రసాద్, AMC ఛైర్మెన్ నక్కల రాధ రవీందర్ రెడ్డి , PACS ఛైర్మెన్ మహిపాల్ రెడ్డి, AMC వైస్ చైర్మన్ అసిఫ్ , సర్పంచ్ గంగనర్సు రాజన్న,ఉప సర్పంచ్ పద్మ తిరుపతి,గ్రామ శాక అధ్యక్షులు శ్రీనివాస్, AMC డైరెక్టర్ శ్రీనివాస్,మాజీ AMC డైరెక్టర్ మోహన్ రెడ్డి నాయకులు కార్యకర్తలు గ్రామస్థులు మహిళలు అధికారులు తదితరులు పాల్గొన్నారు.


ఆధ్యాత్మిక ద్వారానే మానసిక ప్రశాంతత !
ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్.

మెట్ పల్లి మండలం చెవుల మద్ది పెద్దపూర్ క్యాంప్ వద్ద గల ఇస్కాన్ టెంపుల్ ను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్
అనంతరం మాట్లాడుతూ దైవ ప్రార్థన ల ద్వారానే మానసిక ప్రశాంతను పొందవచ్చని అన్నారు.నేటి సమాజంలో వృత్తి రీత్యా ప్రతి ఒక్కరూ తీరిక లేని సమయాన్ని గడుపుతూ మానసిక ఆందోళనకు లోనవుతున్నారు అని దైవ ప్రార్థన ,దైవ దర్శనం ద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుందని అన్నారు.నేటి యువత నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా డీజే చప్పుళ్ళు మాత్రమే కాకుండా తొమ్మిది రోజులు తొమ్మిది శ్లోకాలు నేర్చుకోవాలని తద్వారా ఆధ్యాత్మిక భావన కలుగుతుంది అని అన్నారు.చెడు అలవాట్లకు,ఆలోచనలు రాకుండా ఉంటుందని అన్నారు.


వెంట ఎంపీపీ సాయి రెడ్డి,టీఆరెఎస్ నాయకులు డా.అనూప్ రావు, తదితరులు ఉన్నారు.


పెన్షన్ కార్డులు పంపిణీ !
జగిత్యాల పట్టణములో 17 వార్డులకు చెందిన 758 మంది లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన ఆసరా పెన్షన్ కార్డ్ లని లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ఈ కార్యక్రమంలోమున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి ప్రవీణ్ గారు డి ఈ రాజేశ్వర్,పట్టణ పార్టీ అధ్యక్షులు గట్టు సతీష్,మైనార్టీ పార్టీ అధ్యక్షులు అబ్దుల్ ఖాదర్ ముజాహిద్ ,స్థానిక కౌన్సిలర్ లు, నాయకులు,కార్యకర్తలు,ప్రజలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.