సెప్టెంబర్ 17 తెలంగాణ జాతీయ సమైక్యతా దినం ! తెలంగాణ కేబినెట్ నిర్ణయం

(J.Surender Kumar)

శనివారం సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.
2022 సెప్టెంబర్ 17 ను ‘తెలంగాణ జాతీయ సమైక్యతా దినం’ గా పాటించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. అంతేకాదు.. సెప్టెంబర్ 16, 17, 18 తేదీలల్లో మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా.. ‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల’ ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది.
రాజరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామిక వ్యవస్థలోకి అడుగుపెట్టి.. ఈ ఏడాది సెప్టెంబర్17 నాటికి 75 ఏళ్లు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలోనే ఘనంగా వజ్రోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించుకుంది.
క్యాబినెట్ కొన్ని నిర్ణయాలు !

  • తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల’ ప్రారంభంలో భాగంగా 3 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాలను కేబినెట్ ఈ విధంగా నిర్ణయించింది.
    సెప్టెంబర్ 16 వ తేదీన… రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గ కేంద్రాల్లో విద్యార్థులు, యువతీ యువకులు, మహిళలతో భారీ ర్యాలీలు నిర్వహించాలి
    . * సెప్టెంబర్ 17 – ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు పబ్లిక్ గార్డెన్ లో జాతీయ జండా ఆవిష్కరణ చేసి ప్రసంగిస్తారు. అదే రోజు అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు , మున్సిపాలిటి, పంచాయితీ కేంద్రాల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సంబంధిత అధికారులు ప్రజా ప్రతినిధులు జాతీయ జండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించాలి
  • అదే రోజు (సెప్టెంబర్ 17) మధ్యాహ్నం బంజారా ఆదివాసీ భవన్ ల ప్రారంభోత్సవం. నక్లెస్ రోడ్డు నుంచి అంబేద్కర్ విగ్రహం మీదుగా ఎన్టీఆర్ స్టేడియం వరకు భారీ ఊరేగింపు ఉంటుంది. అనంతరం అక్కడే బహిరంగ సభ నిర్వహిస్తారు. ఈ సభకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తారు.
  • సెప్టెంబర్ 18 – అన్ని జిల్లా కేంద్రాల్లో స్వాతంత్ర్య సమరయోధులకు సన్మానాలు చేయాలి. కవులు కళాకారులను గుర్తించి సత్కరించాలి. ఘనంగా తెలంగాణ స్పూర్తిని చాటేలా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలి.

తెలంగాణ లో మత విదేశాలకు తావులేదు!


తెలంగాణలో మత విద్వేషాలకు తావులేదని, అందుకు ప్రయత్నించే దుష్టశక్తులను ఐక్యంగా తిప్పికొడదామని ప్రజాస్వామిక లౌకికవాద శక్తులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. మతం పేరుతో ప్రజల నడుమ విభజన తేవాలని చూసే స్వార్థ రాజకీయాలను తిప్పికొట్టేందుకు తమతో కలిసిరావాలని బుద్ది జీవులను మేధావులను సిఎం కెసిఆర్ ఆహ్వానించారు., ఈమేరకు సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభధ్రం, ఆపార్టీ రాష్ట్రకార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, ప్రగతి భవన్ లో సిఎం కెసిఆర్ తో సమావేశమయ్యారు.

సుమారు గంటపాటు పలు రాజకీయ జాతీయ అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ స్వార్థ
రాజకీయాల కోసం, విచ్చిన్నకర శక్తులు పచ్చని తెలంగాణలో మతం పేరుతో చిచ్చు పెట్టేందుకు కుట్రలు చేస్తున్నాయన్నారు. వీరి కుట్రలను తిప్పికొట్టేందుకు ప్రజాస్వామిక వాదులు మేధావులు ప్రజా పక్షం వహించే రాజకీయవేత్తలు కదలిరావాలని తాను ఇచ్చిన పిలుపుకు స్పందించి, మద్దతు ప్రకటించేందుకు ముందుకు వచ్చిన సిపిఎం పార్టీకి సిఎం కెసిఆర్ ధన్యవాదాలు తెలిపారు. కాగా, మతవిద్వేశ శక్తులకు ఎదుర్కునేందుకు సిఎం కెసిఆర్ చేస్తున్న పోరాటంలో తాము సంపూర్ణ మద్దతునందిస్తామని సిపిఎం నేతలు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ప్రజా సమస్యల పై సిపిఎం నేతలు సిఎం కెసిఆర్ కు వినతిపత్రాన్ని అందించారు.