శ్రీ భాగవత సప్తహానికి ఎనలేని ప్రత్యేకత ఉంది!


ప్రముఖ పురాణ ప్రవచకుడు సంతోష్ కుమార్ శాస్త్రి !

ప్రాచీన ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీ లక్ష్మీ

నరసింహ స్వామి కొలువై ఉన్న గోదావరి నది తీరంలో ఈ సంవత్సరం భాద్రపద మాసంలో పురాణ ప్రవచనం శ్రీమద్ భాగవత సప్తహానికి ఎనలేని ప్రత్యేకత ఉందని. ప్రముఖ పురాణ ప్రవచకుడు శృంగేరి పీఠ ఆస్థాన పౌరాణికులు, డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి అన్నారు.


ఈనెల 3 నుంచి స్థానిక బ్రాహ్మణ సంఘ భవనంలో వారం రోజులపాటు వైభవంగా కొనసాగిన శ్రీమద్ భాగవత సప్తాహం శనివారం రుక్మిణి కళ్యాణం తో ముగిసింది.


వేలాది సంవత్సరాల ఇతిహాసాలు, తాళపత్ర గ్రంధాలలో శ్రీకృష్ణుడు జన్మించింది. శ్రీ శుభ కృత నామ సంవత్సరంగా వివరించబడిందన్నారు. ప్రస్తుతం ఇది శ్రీ శుభ కృత నామ సంవత్సరం కావడం మన భాగ్యం అని సంతోష్ కుమార్ శాస్త్రి భక్తులకు వివరించారు.

అందుకోసమే ఈ సంవత్సరంలో శ్రీమద్ భాగవత సప్తహానికి ఎనలేని ప్రత్యేకత ఉందన్నారు. వేదికపై రుక్మిణి కళ్యాణం ను ప్రముఖ వేద పండితులు కోరిడే చంద్రశేఖర్ శర్మ, బొజ్జ రమేష్ శర్మ, మధు రామ, శర్మ కోరిడే రఘునాథ్ శర్మలు ఘనంగా నిర్వహించారు. స్థానిక దేవాలయం పక్షాన అభివృద్ధి కమిటీ చైర్మన్ రామయ్య, సభ్యులు, స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్తమ్మ , ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్, బాచంపల్లిని శాలువాలతో ఘనంగా సన్మానించారు.

మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్మపత్ని శ్రీమతి స్నేహలత ప్రారంభం, ముగింపు సప్తహ భాగవతం లో పాల్గొని బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రీ ని సన్మానించారు.

శ్రీ భాగవత సప్తాహం జ్ఞాన యజ్ఞం లాంటిది!
ప్రముఖ పురాణ ప్రవచకుడు

డా!! గ ర్రెపల్లి మహేశ్వర శర్మ


లోక కళ్యాణం, సకల జన సంక్షేమం కోసం, కొనసాగుతున్న శ్రీ భాగవత సప్తాహం జ్ఞాన యజ్ఞం లాంటిదని, శ్రీ శృంగేరి శారదాపీఠం ఆస్థాన పౌరాణికులు, ప్రవచకులు, డాక్టర్ గర్రెపల్లి మహేశ్వర శర్మ, అన్నారు.

ధర్మపురి క్షేత్రంలోని ప్రాచీన శ్రీ రామలింగేశ్వర స్వామి ( శివాలయం) ఆలయం ప్రాంగణంలో ఈ నెల 3 నుంచి శనివారం వరకు ఘనంగా కొనసాగింది. స్థానిక శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయం, మరియు శారద మహిళా మండలి వారి ఆధ్వర్యంలో, భాగవత సప్తాహం కొనసాగింది.

శనివారం రుక్మిణి కళ్యాణం తో అంగరంగ వైభవంగా కార్యక్రమం ముగిసింది. స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సత్యమ్మ, వైస్ చైర్మన్ ఇందారపు రామయ్య, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్.

తదితరులు దేవస్థానం పక్షాన , శారదా మహిళా మండలి పక్షాన పురాణ ప్రవచకుడు డాక్టర్ మహేశ్వర శర్మ ను ఘనంగా సన్మానించి సంభావన అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక బ్రాహ్మణ సంఘ భవనంలో, మరియు శివాలయ ప్రాంగణంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు .