25 నుంచి బతుకమ్మ పండుగ వేడుకలు
ఉన్నత స్థాయి సమావేశంలో సీఎస్‌


(J.Surender Kumar)
ఈ నెల 25 నుంచి అక్టోబర్‌ 3 వరకు కొనసాగే బతుకమ్మ పండుగకు విస్తృత ఏర్పా ట్లు చేయాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. బతుకమ్మ పండుగను రాష్ట్ర రాజధానితోపాటు, అన్ని జిల్లా కేంద్రాల్లో ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు.


బతుకమ్మ ఏర్పాట్లపై ఆయన బీఆర్కేభవన్‌లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అక్టోబర్‌ 3న నిర్వహించే సద్దుల బతుకమ్మకు హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌ను ముస్తాబు చేయాలని సూచించారు.
బతుకమ్మ ఘాట్‌తోపాటు ట్యాంక్‌బండ్‌ పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, రోడ్డు మరమ్మతులు వెంటనే చేపట్టాలని, విద్యుద్దీపాలతో అలంకరించాలని ఆదేశించారు. బతుకమ్మలను నిమజ్జనం చేసే ప్రాంతాల్లో ముందు జాగ్రత్తగా గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని చెప్పారు. ఎల్బీ స్టేడియంతోపాటు హైదరాబాద్‌లోని ప్రధాన కూడళ్లలో బతుకమ్మ లోగోలను ఏర్పాటు చేయాలని సూచించారు.


ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ కేవీ రమణాచారి మాట్లాడుతూ.. 9 రోజులపాటు కొనసాగే బతుకమ్మ ఉత్సవాలు రాష్ర్టానికి ప్రతిష్ఠాత్మకమైనవని, అందు కు తగ్గట్టు ఏర్పాట్లు చేయాలని కోరారు. సమావేశానికి డీజీపీ మహేందర్‌రెడ్డి, వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రాణికుముదిని, సునీల్‌శర్మ, రామకృష్ణారావు, అర్వింద్‌కుమార్‌, దివ్యదేవరాజన్‌, కార్శదర్శులు రవిగుప్తా, సందీప్‌కుమార్‌ సుల్తానియా, రిజ్వీ, జలమండలి ఎండీ దానకిశోర్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌, పోలీస్‌ కమిషనర్లు సీవీ ఆనంద్‌, స్టీఫెన్‌ రవీంద్ర, వైటీడీఏ చైర్మన్‌ కిషన్‌రావు, పురపాలకశాఖ సంచాలకుడు సత్యనారాయణ, దేవాదాయశాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌, విద్యాశాఖ డైరెక్టర్‌ దేవసేన, హైదరాబాద్‌ కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ తదితరులు హాజరయ్యారు

నిందితుడు ఉప్పు రమణారెడ్డి పై పీడి యాక్ట్ !
మల్యాల పోలీసులు


నిందితుడు ఉప్పు రమణారెడ్డి మల్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతూ సాధారణ ప్రజల మనసుల్లో భయాందోళనను సృష్టిస్తూ శాంతిభద్రతలకు విగాధం కలిగిస్తూ ప్రజా  జీవనంపై ప్రతికూల ప్రభావం కలిగిస్తూ మరియు  స్థానిక మహిళలు మరియు ప్రజల మనసుల్లో భయాందోళనలు సృష్టించి శాంతిభద్రతలకు మరియు సామాజిక శాంతికి భంగం కలిగిస్తున్నాడు.
ఇట్టి నేరస్థులపై గతంలో సుమారు 10 పోలీస్ స్టేషన్లో దాదాపు 35 దొంగతనం కేసులో మరియు ఒక ఫోక్సో కేసు నమోదు కావడం జరిగింది భవిష్యత్తులో ఇంకా ఎవరైనా దొంగతనాలు చేసినా జనాలను భయభ్రాంతులకు గురిచేసిన వారిపై పిడి యాక్ట్ అమలు చేయడం జరుగుతుందని మల్యాల సిఐ రమణమూర్తి తెలిపారు.
నియంత్రణ చట్టం 1986 (చట్టం సంఖ్య 1/1986), తెలంగాణా నియంత్రణ చట్టం ( సవరణ చట్టం సంఖ్య 13/2018)  ప్రకారం ఇతడిని  నేరాలకు పాల్పడే నేరస్తుని గా నిర్ధారించి, ఇతని బారి నుండి ప్రజలను రక్షించాలన్న ఉద్దేశ్యంతో తేది 21-09-2022 రోజున ఇతని పై జగిత్యాల జిల్లా కలెక్టర్ రవి ఉత్తర్వుల ప్రకారం పి.డి. యాక్ట్ పెట్టడం జరిగింది. కరీంనగర్ జిల్లా జైలు అధికారి సమక్షంలో మల్యాల సి.ఐ రమణమూర్తి , మల్యాల ఎస్.ఐ చిరంజీవి  పిడి యాక్టు ఉత్తర్వులు అందజేశారు,
ఈ  పీడీ యాక్ట్ ను అమలు చేయడంలో కీలక పాత్ర పోషించిన అధికారులను  జిల్లా ఎస్పీ శ్రీమతి సింధు శర్మ  అభినందించారు, ఇతడిని ఈ రోజు కరీంనగర్ జిల్లా  జైలు నుండి చర్లపల్లి  జైలు తరలించారు.,