తెలంగాణ ఏర్పాటుతోనే రాష్ట్రం అభివృద్ధి.
ఎమ్మెల్యే సంజయ్ కుమార్


తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోనే రాష్ట్రం తో పాటు జగిత్యాల పట్టణం గణనీయ అభివృద్ధి చెందిందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.

శుక్రవారం జగిత్యాల పట్టణ లోని ఐదువార్డులకు చెందిన 289 మంది లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన ఆసరా పెన్షన్ కార్డ్ లని జగిత్యాల పట్టణ రాయల్ ఫంక్షన్ హాల్ లో అందజేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ , వార్డులకు చెందిన 14 మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి,7గురు లబ్దిదారులకు 1 లక్ష 50 వేల రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ , మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి ప్రవీణ్ , పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ


తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాతనే జగిత్యాల పట్టణం అభివృద్ధి జరిగిందంటూ గణాంకాలతో వివరించారు.
₹ 4 కోట్ల20 లక్షలతో సమీకృత మార్కెట్ నిర్మాణం జరుగుతుంది
₹ 17 కోట్ల తో బ్లాక్ స్పాట్ రోడ్డు మంజూరు చేశామని అన్నారు …
వృద్ధాప్యం సమయంలో ఆసరా గా.₹ 2016 రూపాయలు పేద మధ్యతరగతి ప్రజల ఆసరా కోసమే ఆసరా పెన్షన్ లు అన్నారు.
కరోనా కష్ట కాలంలో సైతం ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఆపలేదని అన్నారు.₹.1500 రూపాయల చొప్పున వారి ఖాతాల్లో జమ చేసి,ఉచిత బియ్యం అందజేసారు అని గుర్తు చేశారు ….
సీఎం సహాయ నిది ద్వారా వైద్యం చేయించుకొని ఆర్థికంగా నష్ట పోయిన వారికి సీఎం సహాయ నిధి గొప్ప వరం అని అన్నారు ….
జగిత్యాల నడి బొడ్డున మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసుకుని,చుట్టూ ప్రదన రహదారుల కోసం కెనాల్ పైన మరియు చుట్టూ ₹ 10 కోట్ల నిధులు సైతం మంజూరు అయ్యాయని పనులు ప్రారంభం కానున్నాయని అన్నారు …
ఆలయాల, చర్చి,మసీద్ ల కమ్యూనిటీ హాల్, సంఘం భవనాలు నిర్మాణానికి నిదులు మంజూరు చేశామని అన్నారు ..
గతంలో 6వేలు విద్యుత్ స్తంబాలు ఉంటే, రాష్ట్రం వచ్చిన తర్వాత 2500, నూతన స్తంబాలు, 60 ట్రాన్స్ ఫార్మర్ లు వేశామని అన్నారు….
విద్య ,వైద్యం పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద పెట్టడం జరిగింది అని అన్నారు..
కొందరికి పెన్షన్ లు రాకపోవడం భాధాకరం అని అధైర్య పడవద్దని నూతన పెన్షన్ కోసం కృషి చేస్తామని అన్నారు….
ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ లు బాలే లత శంకర్ నక్క జీవన్, మేక పద్మావతి పవన్,. పంబాల రామ్ కుమార్,.అవారి శివ కేసరి బాబు. పట్టణ పార్టీ అధ్యక్షులు గట్టు సతీష్, మైనార్టీ పార్టీ అధ్యక్షులు అబ్దుల్ ఖాదర్ ముజాహిధ్, ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు , ఉపాధ్యక్షులు దుమల రాజ్ కుమార్, AMC వైస్ చైర్మన్ అసిఫ్, కౌన్సిలర్ కూతురు రాజేష్,కుసారి అనిల్, నాయకులు సమిండ్ల శ్రీనివాస్, బండారి నరేందర్,డిష్ జగన్,. తదితరులు పాల్గొన్నారు.


నివాళులు !
మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి 13 వ వర్దంతి సంధర్భంగా ధర్మపురి లోని నంది చౌక్ వద్ద వైస్సార్ చిత్ర పటానికి పూల దండ వేసి ధర్మపురి మండల కాంగ్రెస్ పక్షాన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు విద్య‌, వైద్య‌, ఉపాధి రంగాల‌ను సామాన్య ప్ర‌జ‌ల‌కు చేరువ చేసిన మ‌హ‌నీయుడు డాక్ట‌ర్ వైయ‌స్ఆర్‌ అని మండల అధ్యక్షులు సంగనభట్ల దినేష్ వైఎస్ సేవలు కొనియాడారు.


పరామర్శ !
ఇటీవల రాయపట్నం గ్రామంలో కరెంట్ షాక్ కి గురయ్యి చనిపోయిన గటికె చిన్నయ్య కుటుంబన్నీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్ పరామర్శించారు. ఇదే ప్రమాదంలో షాకుకు గురై చికిత్స పొందుతున్న ముక్కెర కమలాకర్ త్వరగా కోలుకోవాలని లక్ష్మణ్ కుమార్ అన్నారు.


పెన్షన్ కార్డుల పంపిణీ !
నూతన పెన్షన్ కార్డ్ లను పంపిణీ చేసిన ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ ,జెడ్పీ చైర్ పర్సన్ దావా వసంత సురేష్
సారంగాపూర్ మండల అర్పపల్లి, లక్ష్మి దేవి పల్లి, ధర్మ నాయక్ తాండా గ్రామాలలో 186 మంది కి నూతనంగా మంజూరైన పెన్షన్ కార్డ్ లను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ , జెడ్పీ చైర్ పర్సన్ దావా వసంత సురేష్ ,13 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన ₹ 2లక్షల 40 వేల రూపాయల విలువగల చెక్కులను,13 మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరైన చెక్కులను లబ్దిదారులకు అందజేసిన ఎమ్మెల్యే, జెడ్పీ చైర్ పర్సన్.
LOC పంపిణీ
అర్పాపల్లి గ్రామానికి చెందిన బొండ్ల మల్లీశ్వరి మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతూ శస్త్ర చికిత్స నిమిత్తం ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ స్థానిక నాయకులతో ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ కు సమస్యను తెలపగా ముఖ్యమంత్రి సహయనిధి ద్వారా మంజూరైన ₹ 2,50,000 రూపాయల LOC నీ మల్లీశ్వరి కుటుంబ సభ్యులకు అందజేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ గారు, జెడ్పీ చైర్ పర్సన్ దావా వసంత సురేష్ గారు.
ఈ కార్యక్రమంలో నాయకులు ఎంపీపీ కొల జమున,ZPTC మనోహర్ రెడ్డి, పాక్స్ ఛైర్మెన్ నరసింహ రెడ్డి, వైస్ ఎంపీపీ సురేందర్,సర్పంచుల ఫోరం రాజేందర్ రెడ్డి,సర్పంచ్ శ్రీలత ప్రభాకర్,లక్ష్మి,సంతోష్,ఎంపీటీసీ మమత,
ఉప సర్పంచ్ లింగారెడ్డి,రాజేశ్వరి,రాజేష్,గ్రామ శాక చిరంజీవి,మల్లేష్ ,ప్రజలు,నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


యువత ఉద్యోగాలు సాధించాలి !
కొప్పుల స్నేహలత

జగిత్యాల జిల్లా డిఎస్పీ నోటిఫికేషన్ లో 159 ఉద్యోగాలు ఉన్నాయని, ఈ కోచింగ్ సెంటర్ ను పూర్తి సద్వినియోగం చేసుకోవాలని, అందరూ కష్టపడి ఉద్యోగాలు ధర్మపురి నియోజకవర్గ యువత ఉద్యోగాలు సాధించాలని L M కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్పర్సన్, కొప్పుల స్నేహలత అన్నారు.


ధర్మపురి కేంద్రం లో LM కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో స్ధానిక షాధికాన ఫంక్షన్ హల్ లో DSC మరియు, గురుకుల టీచర్ అభ్యర్థుల, కోసం ఏర్పాటు చేసిన కోచింగ్ సెంటర్ ను ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్ పర్సన్ సంగి సత్యమ్మ జెడ్పిటిసి సభ్యురాలు బత్తిని అరుణ, మండల పరిషత్ అధ్యక్షులు ఎడ్ల చిట్టిబాబు, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ అయ్యోరి రాజేష్ కుమార్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
గతంలో ఎల్‌యం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా నిర్వహించిన కానిస్టేబుల్, ఎస్.ఐ దాదాపు చాలా క్వాలిఫై అయ్యీరు అని ఈ సందర్భంగా స్నేహలత అన్నారు.

ఉచిత కంటి ఆపరేషన్ లు చేసిన ఎమ్మెల్యే !


జగిత్యాల నియోజకవర్గ పరిధిలోనీ 13 మంది నిరుపేదలకు ఆపి, రోటరీ క్లబ్, మరియు జగిత్యాల పావని కంటి ఆసుపత్రి అధ్వర్యంలో, ఉచిత నేత్ర శస్త్ర చికిత్సలను ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ చేశారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ 13 మంది నిరుపేదలకు నేత్ర శస్త్ర చికిత్సలు చేయటం చాలా ఆనందంగా ఉన్నదని, ప్రపంచం మొత్తం ఉన్న అందులు భారత దేశం లో సగం మంది ఉన్నారని, రాష్ట్రంలో సైతం కంటి సమస్యలతో ఇబ్బందిపడే వారు అధికమని దీనిని గుర్తించి ముఖ్యమంత్రి కంటి వెలుగు లాంటి గొప్ప కార్యక్రమము చేపట్టారని, మెడికల్ కాలేజీ లో 4 గురు నేత్ర వైద్యులను నియమించామాని వారి సేవలను వినియోగించుకోవాలని అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి పేదల సంక్షేమానికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని,13 మందికి ఉచిత శస్త్ర చికిత్స చేయటం జరిగిందనీ, అందరికీ కంటి చూపు వచ్చిందని అన్నారు., ఈ కార్యక్రమంలో వైశ్య సంఘం అధ్యక్షులు మంచాల కృష్ణ, జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు టివి సూర్యం, RTA మెంబర్ సుధాకర్ రావు, మండల పార్టీ కోశాధికారి షేర్ల మహేష్, డా.విజయ్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.