( J.Surender Kumar )
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి సాధించి దేశానికి దిక్సూచిలో వెళ్తుంది అనే మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కావడం లేదని ఆయన ఈ సందర్భంగా గణాంకాలతో అభివృద్ధి అంశాలను వివరించారు.

తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి కొప్పుల. ఈశ్వర్ ,

మరియు జిల్లా కలెక్టర్ .ఎస్ పి సింధు శర్మ, అదనపు కలెక్టర్లు బిఎస్ లత, అరుణ శ్రీ, జడ్పీ చైర్ పర్సన్ దావా వసంత, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, జిల్లా జగిత్యాల ఆర్డీవో మాధురి,

గ్రంధాల చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్, ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు పోలీస్ శాఖ సిబ్బంది, జిల్లా అధికారులు వివిధ శాఖల అధికారులు కలెక్టరేట్ సూపర్డెంట్లు, సిబ్బంది విద్యార్థి విద్యార్థులు ప్రజలు పాల్గొన్నారు.
పోలీస్ కార్యాలయంలో..

తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీస్ కార్యాలయంలో జాతీయ పతాక ఆవిష్కరణ చేసిన జిల్లా ఎస్పీ శ్రీమతి సింధు శర్మ
ఈ కార్యక్రమం లో డిఎస్పీలు ప్రకాష్, రవీంద్ర రెడ్డి, .A.O అమర్నాథ్, .రిజర్వ్ ఇన్స్పెక్టర్లు వామనమూర్తి, .నవీన్, రూరల్ సీఐ కృష్ణకుమార్, DPO కార్యాలయ సిబ్బంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ
ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

జగిత్యాల పట్టణ 4 వ వార్డ్ కి చెందిన మాదాసు అజయ్ కు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన ₹60 వేల రూపాయల చెక్కును, షాహీన్ బేగం కు మంజూరైన ₹ 24 వేల రూపాయల చెక్కులను జగిత్యాల ఎమ్మేల్యే క్వార్టర్స్ లో అందజేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ క్యాదాసు నవీన్, నాయకులు పురుషోత్తం రావు, జిల్లా గంగాధర్,.వంశీ బాబు,.శేకర్,.తదితరులు పాల్గొన్నారు.
బీర్పూర్ లో…

భారతీయ జనతా పార్టీ బీర్పూర్ మండల శాఖ
ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఫోటోకు పూలమాలవేసి జాతీయ జెండా ఎగరవేయడం జరిగింది .. కార్యక్రమం అనంతరం మన ప్రియతమా నేత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర దామోదర్ దాస్ మోడీ గారి జన్మదినం ఘనంగా నిర్వహించి మిఠాయిల పంపిణీ చేయడం జరిగింది..ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శ్రీ మేడా జనార్ధన్, ప్రధాన కార్యదర్శి ఆడెపు రమేష్ , జిల్లా కార్యవర్గ సభ్యులు బూట్ల మార్కండేయ, కోశాధికారి మామిడిపల్లి శ్రీనివాస్ ,కిసాన్ మోర్చా సీనియర్ నాయకులు సభ దేవరాజ్యం, తదితరులు పాల్గొన్నారు.
ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో..

బీర్పూర్ మండల కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద రాష్ట్రీయ స్వయంసేవ సంఘం ఆధ్వర్యంలో నిజాం విముక్తా తెలంగాణ వజ్రోత్సవాలలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కొల్లూరి అనిల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఫోటోకు పూలమాల వేసి జాతీయ జెండా ఎగరవేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వక్తగా ముఖ్యఅతిథిగా వచ్చిన జిల్లా గ్రామ వికాస్ ప్రముఖ రంగు లక్ష్మీ నరహరి మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనలో కాసిం రాజ్వి రజాకర్ల ఆగడాలతో హిందువుల మానప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఈ కార్యక్రమంలో కటిక రెడ్డి సతీష్ , కందుకూరి రాకేష్, ఆడపు శాంతయ్య, మేడ మల్లేశం ,సమ్మెట వెంకటేష్ ,తదితరులు పాల్గొన్నారు
బుగ్గారం ఎంపీడీవో కార్యాలయంలో

జాతీయ సమైక్యత దినోత్సవ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించిన ఎంపీపీ బాదినేని రాజమణి రాజేందర్
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జెడ్పిటిసి బాదినేని రాజేందర్ వైస్ ఎంపీపీ జోగిని పెళ్లి సుచెందర్, మండల కో ఆప్షన్ సభ్యులు ఎండి అబ్దుల్ రహమాన్ ,మహిళా నాయకురాలు విజయ, సూపరిండెంట్ రాణి అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు
జిల్లా పరిషత్ కార్యాలయంలో..

జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసిన జగిత్యాల జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి దావ వసంత సురేష్ పాల్గొన్న జెడ్పీటీసీ సభ్యులు సంగెం మహేష్, జెడ్పీ సీఈవో రామానుజన్ చార్యులు, ఎంపిడివోలు రాజేశ్వరి, గంగాధర్ మండల ఆధికారులు, జెడ్పీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..
జిల్లా గ్రంధాలయ సంస్థలో..

జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా జిల్లా గ్రంధాలయ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసిన జగిత్యాల జిల్లా గ్రంధాలయ ఛైర్మెన్ డా.గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్
ఈ కార్యక్రమంలో గ్రంధాలయ సిబ్బంది శకుంతల, శంకర్ తదితరులు పాల్గొన్నారు..
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో..

జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బుగ్గారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వేముల సుభాష్, జిల్లా కార్యదర్శి పెద్దనవేని శంకర్, వైస్ ప్రెసిడెంట్ నగునూరి నర్సగౌడ్, నగునూరి రామగౌడ్, షేకళ్ల వెంకన్న, రాజేశం, రేంటం శ్రీధర్,.కోడీమ్యాల రాజన్న, నగునూరి వెంకన్న, మహమ్మద్ రహ్మద్ ఖాన్, కేతి తదితరులు పాల్గొన్నారు
విశ్వకర్మ జయంతి సందర్భంగా..

జగిత్యాల పట్టణం స్వర్ణ కార సంఘం లో విశ్వకర్మ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొన్నారు. పూజలు నిర్వహించి అనంతరం ఇండియన్ రెడ్ క్రాస్ అధ్వర్యంలో రక్త దాన శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో స్వర్ణకార సంఘం అధ్యక్షులు తోగిటి గంగాధర్, ప్రధాన కార్యదర్శి ఎనగంటి రవి కుమార్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కార్యదర్శి మంచాల కృష్ణ, సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, టివి సూర్యం, వేణుగోపాల్, తదితరులు పాల్గొన్నారు..
పోచమ్మ ఆలయంలో వార్షికోత్సవాలు!

జగిత్యాల పురాణిపేటలోని శ్రీ లోకమాత పోచమ్మ దేవాలయ 60 వ వార్షికోత్సవ ముగింపు వేడుకలు ఆదివారం జరగనున్నాయి. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు నిర్వాహక కమిటీ అధ్యక్షుడు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ రాజేందర్ ప్రకటనలో తెలిపారు.