ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్.
(J. Surender Kumar)
16న నిర్వహించు ర్యాలీ, భోజన ఏర్పాట్ల వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు
17న జిల్లా కేంద్రంలో ముఖ్య అతిథిచే జాతీయ పతాకావిష్కరణ
18న సాంస్కృతిక కార్యక్రమాలు, స్వాతంత్ర సమర యోధుల సన్మానం
తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల నిర్వహణ పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
జిల్లాలలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రొత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్నారు.

బుధవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, రాష్ట్ర ఉన్నత అధికారులతో కలిసి మూడు రోజుల పాటు నిర్వహించు తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టర్ లు, పోలీస్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయాల సముదాయంలోని వీడియో సమావేశ మందిరం నుండి జిల్లా కలెక్టర్ జి రవి .ఎస్ పి సింధు శర్మ. అదనపు కలెక్టర్ లు బిఎస్సి లతా. అరుణశ్రీ లతో కలిసి పాల్గొన్నారు.

సి.ఎస్.సోమేష్ కుమార్ మాట్లాడుతూ,
తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను జిల్లాలో సెప్టెంబర్ 16 నుంచి 18 వరకు కట్టుదిట్టంగా నిర్వహించాలని, 16న ప్రతి నియోజకవర్గంలో నిర్వహించే ర్యాలీ రూట్ మ్యాప్ తయారు చేయాలని సూచించారు. నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధుల సహకారంతో 15 వేల మందితో భారీ ర్యాలీ, సమావేశం నిర్వహించాలని, ప్రజలందరి నాణ్యమైన ఆహారం అందించాలని పేర్కొన్నారు. భారి సంఖ్యలో ప్రజలు హాజరవుతున్న నేపథ్యంలో భోజనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, అధిక సంఖ్యలో కౌంటర్లు, మండలాల వారీగా ఏర్పాటు చేయాలని సూచించారు. 17న జిల్లా కేంద్రాల్లో ముఖ్య అతిథిచే జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని, హైదరాబాద్ లో జరిగే ఆదివాసీ భవన్ బంజారా భవన్ ప్రారంభానికి జిల్లా కు కేటాయించిన లక్ష్యాల మేరకు ఎస్టీలను తరలించాలని, బస్సు, భోజన సౌకర్యాలు కల్పించేందుకు అదనపు నిధులు విడుదల చేసామని తెలిపారు.

సెప్టెంబర్ 18న జిల్లా కేంద్రాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని, కళాకారులను, స్వాతంత్ర సమరయోధుల సన్మానం చేయాలని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ముఖ్యమైన భవనాలు ట్రై కలర్ లైటింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ జి .రవి మాట్లాడుతూ
జగిత్యాల జిల్లా లో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను సెప్టెంబర్ 16 నుంచి 18 వరకు ప్రభుత్వ నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.
అనంతరం జిల్లా కలెక్టర్ జి.రవి, ఎస్పీ సింధు శర్మ లతో కలిసి వేడుకల ఏర్పాట్ల పై సమీక్షించారు.

16న జిల్లాలోని ధర్మపురి. జగిత్యాల. కోరుట్ల. అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 15 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు .
17న జిల్లాలో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించేందుకు, అలాగే,
సెప్టెంబర్ 18న జిల్లాలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జగిత్యాల .జిల్లా అధికారులు. ఆర్డీవోలు వినోద్ కుమార్ మాధురి. DPO నరేష్ .DEO జగన్మోహన్రెడ్డి. CEO రామనుజాచారి ,DIEO.నారాయణ,R&B శ్రీనివాస్,DYSO నరేశ్ DSCO. రాజకుమార్. AO. సురేష్. ED లక్ష్మీనారాయణ . కలెక్టరేట్ ఏవో మరియు సూపరెండెంట్లు అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు , తదితరులు పాల్గొన్నారు.