మంత్రి కొప్పుల ఈశ్వర్ !
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ధర్మపురిలో జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. అశేష జనవాహిణితో కలిసి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. ఈ ర్యాలీలో నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు పెద్ద సంఖ్యలో స్వచ్చందంగా తరలివచ్చి జాతీయ సమైక్యతా దినోత్సవ స్పూర్తిని చాటారు.

ఈ కార్యక్రమంలో ఎంపి వెంకటేష్ నేత జిల్లా కలెక్టర్ రవి నాయక్. ఎస్పీ సింధు శర్మ. మున్సిపల్ చైర్మన్ సంగీ సత్తెమ్మ. పలువురు ఎంపీపీలు. జెడ్పీటీసీ సభ్యులు. మార్కెట్ కమిటీ చైర్మన్. వివిధ సంఘాలు.కళాశాలల, పాఠశాలల విద్యార్థులు, పెద్ద ఎత్తున నియోజకవర్గ స్థాయి ప్రజలు పాల్గొన్నారు .
ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ

తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్.. రైతు బంధు. దళిత బంధు దేశానికే ఆదర్శం అని అన్నారు.
చరిత్ర తెలియని కొందరు సెప్టెంబర్ 17 తేదీ పై అనేక అనుమానాలు కల్పిస్తున్నారు .
పచ్చగా ఉన్న దేశం లో భగ్గుమనే విధంగా.. రక్త పాతం సృష్టించే విధంగా చేస్తున్నారు
తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిదేళ్లు గా కర్ఫ్యూ లేదు .
మత సామరస్యం తో అభివృద్ధిలో దూసుకు పోతుంది

రైతులు సుఖ శాంతులతో ఉన్నారు
ఐటి రంగంలో యువత ఉపాధి పొందుతున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన దక్షత తో
రాష్ట్రం ప్రగతి పథం లో దూసుకు పోతుంది.
తెలంగాణ ప్రభుత్వ పథకాలు దేశంలో మరెక్కడా అమలు కావడం లేదు.
ముఖ్యంగా బిజెపి పాలిత ప్రాంతాల ప్రజలే .. తెలంగాణ ప్రభుత్వ పథకాలు కోరుకుంటున్నారు.
దేశంలో పేదరికం పోయిన నాడే ఉచితాలు బంద్
చేయాలి అన్నారు.
దేశానికి రోల్ మోడల్ తెలంగాణ. సంక్షేమానికి ఆదర్శం తెలంగాణ రాష్ట్రానికి గుర్తింపు ఉందన్నారు.
జగిత్యాలలో…
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో!

17 సెప్టెంబర్, 2022 నాటికి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమై 75వ సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంగా సెప్టెంబర్ 16 నుంచి 18 వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్న తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు కార్యక్రమాలలో
జగిత్యాల జిల్లా కేంద్రం లో టౌన్ హల్ వద్ద విద్యార్థులు, యువతి యువకులు, మహిళలతో భారీ ర్యాలీ కార్యక్రమాన్ని ప్రారంబించిన జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ గారు జెడ్పీ చైర్ పర్సన్ దావా వసంత సురేష్ ,జిల్లా కలెక్టర్ జి రవి ,ఎస్పీ సింధు శర్మ ,లైబ్రరీ ఛైర్మెన్ డా చంద్రశేఖర్ గౌడ్ ,మున్సిపల్ చైర్ పర్సన్ లు, భోగ శ్రావణి ప్రవీణ్ ,మోర హనుమండ్లు .RDO మాధురి, ఎస్సీ కార్పొరేషన్ ఈడి లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు

ఈ కార్యక్రమంలో ఎంపీపీ లు, జెడ్పీటీసీ లు,కౌన్సిలర్ లు,AMC ఛైర్మెన్ లు,PACS ఛైర్మెన్ లు,సర్పంచులు, ఎంపిటిసి లు,ఉప సర్పంచులు, వివిధ హోదాల్లో ప్రజా ప్రతినిదులు,పార్టీ కార్యవర్గసభ్యులు, ,అధికారులు, కళాకారులు,ప్రజలు, తదితరులు, పాల్గొన్నారు.
మంత్రి కొప్పుల ఈశ్వర్ కు కృతజ్ఞతలు!
రైతుల సమితి అధ్యక్షుడు భీమన్న !
మంత్రి కొప్పుల ఈశ్వర్ చొరవతో రోళ్ల వాగు ప్రాజెక్టు ₹ 136.81 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ చేయించినందుకు రైతుల పక్షాన సమన్వయ సమితి అధ్యక్షులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు రోళ్ల వాగు ప్రాజెక్టు అంతకుముందు 90 మీటర్లు ఉండగా ప్రస్తుతం 120 మెటర్లకు పెంచడం జరిగింది అన్నారు.
దీనితో బీర్పూర్ ,మరియు ధర్మపురి మండలల రైతులకు సాగునీరు అందించేందుకు 0.25 టీఎంసీల నుండి 0.949 కి పెంచడం జరిగింది. ఉత్తర్వులు జరిచేయడంతో రెండు మండలాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని ప్రకటనలో పేర్కొన్నారు.