ఎస్ ఈ, మాధవరావు పర్యవేక్షణలో…
( J. Surender Kumar )
ధర్మపురి మండలంలోని వివిధ గ్రామాల్లో విద్యుత్ మరమత్తు పనులను సూపండెంట్ ఇంజనీర్ మాధవరావు పర్యవేక్షణలో శుక్రవారం యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు.

వివరాలు ఇలా ఉన్నాయి.
మండలంలో గత జూలై నెల నుండి కురిసిన భారీ వర్షాలు, గాలివాన, పిడుగులు, గోదావరి వరదల, కారణంగా మరియు వరదలలో మునిగిపోయిన ట్రాన్సుఫార్మర్లు, కాలిపోయిన ట్రాన్సుఫార్మర్లు, పడిపోయిన గద్దెలు, విరిగిపోయిన స్తంభాలు మరియు వాటి పనుల పురోగతిని తనిఖీ చేయడానికి గోపాల్ రావు, CMD వరంగల్ ఆదేశాల మేరకు 18 ప్రత్యేక ఇంజనీర్ల బృందాలు , జగిత్యాల జిల్లా S.E వేణుమాధవ్ పర్యవేక్షనలో గోదావరి పరివాహక ప్రాంతలన్నింటినీ తనిఖీ చేశారు. మిగిలిన పనులను కూడ త్వరగా పూర్తిచేయాలని ఆయన అధికారులు ఆదేశించారు.

శ్రీనివాసచారి DE, Quality control, వరంగల్ , హరికృష్ణ D E జగిత్యాల తనీఖీలు చేపట్టారు., రైతులు మోటార్లకు కెపాసిటర్లు బింగించుకోవాలని, అటోస్టాటర్లను తొలగించాలని, తద్వార ట్రాన్సుఫార్మర్ల పైన లోడు తగ్గి ట్రాన్సుఫార్మర్లు ఫేయిల్ అవకుండా ఉంటాయని రైతులకు అధికారులు వివరించారు. ఈ తనిఖీలలో ADE సింధూర్ శర్మ, స్థానిక A.E మనోహర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
రెండవ రోజు దసరా కోలాట సంబరాలు.!

జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఎల్.యం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ మరియు ధర్మపురి నియోజకవర్గం తెరాస పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దసరా కోలాట సంబరాల్లో భాగంగా శుక్రవారం గొల్లపల్లి, పెగడపల్లి, బుగ్గారం మండలాల నుండి జట్లు పాల్గొన్నాయి.

ఈ పోటీల్లో పాల్గొన్న ప్రతి జట్టు సభ్యులకు ఎల్.యం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్ పర్సన్ కొప్పుల స్నేహాలత గారు చీరలను అందించారు.