( J.Surender Kumar )
రెండు దశాబ్దాల క్రితం ఉలిక్కి పడ్డ జగిత్యాల పట్టణం.. ఆదివారం మరోసారి ఉలిక్కిపడింది. రెండు దశాబ్దాల క్రితం పట్టణంలో ఉగ్రవాది ఎన్కౌంటర్ తో ఉలికిపడిన జగిత్యాల అలాంటి ఆరోపణలు, అనుమానాలతో NIA ఆకస్మిక సోదాలు చేపట్టడంతో పోలీస్ యంత్రాంగం సైతం ఉలికి పడుతున్నట్టు సమాచారం. వివరాలు ఇలా ఉన్నాయి.

జిల్లా కేంద్రం లో ఆదివారం తెల్లవారు జాము నుంచి NIA సోదాలు,
నిషేధిత (PFI) పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, కేస్ లో నిందితులు, అనుమానితుల పోలీసుల భద్రత మధ్య ఇళ్లలో సోదాలు.,

టవర్ సర్కిల్ లోని కేర్ మెడికల్ షాప్, ఇస్లాంపుర, ఉస్మన్ పుర, తారకరామ నగర్, లోని అనుమానితుల ఇళ్లలో సోదాలు నిర్వహించిన NIA అధికారులు. ,పలు డాక్యుమెంట్స్ స్వాధీనం.,
PFI సంస్థకు ఉగ్రవాద మూలాలు ఉన్నాయని, జిల్లా కేంద్రం లో అనుమానితుల ఇళ్లలో తెల్లవారు జాము నుంచి NIA ( నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ) సోదాలు. చేపడుతున్నది.
మెడికల్ షాప్ లో సిసి పుటేజ్ ను.NIA అధికారులు పరిశీలించారు.

N.I.A ప్రకటన విడుదల!

* జులై 4న తెలంగాణ పోలీసులు నిజామాబాద్‌లోని పిఎఫ్‌ఐ క్యాడర్‌లపై నమోదు చేసిన కేసులో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లోని అనేక ప్రదేశాలలో ఎన్‌ఐఎ సోదాలు నిర్వహిస్తుంది, తరువాత దానిని ఎన్‌ఐఎ స్వాధీనం చేసుకుంది. PFI కేసు ( RC-03/2022/NIA/HYD ).
* కేసు మొదట 04/07/2022 న నిజామాబాద్. P S, తెలంగాణా వద్ద FIR నం.141/2022 గా నమోదు చేయబడింది. రాష్ట్ర పోలీసుల దర్యాప్తులో, నలుగురు నిందితులు అబ్దుల్ కాదర్, షేక్ సహదుల్లా, ఎండీ ఇమ్రాన్ మరియు ఎండీ అబ్దుల్ మోబిన్‌లను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత, కేసును 26/08/2022న NIA మళ్లీ నమోదు చేసింది.
* రోజు (18/09/2022), తెలంగాణలోని 38 స్థానాల్లో (నిజామాబాద్‌లో 23, హైదరాబాద్‌లో 04, జగిత్యాలలో 07, నిర్మల్‌లో 02, ఆదిలాబాద్ మరియు కరీంనగర్ జిల్లాల్లో 01 చొప్పున) మరియు ఆంధ్రాలో 02 చోట్ల NIA సోదాలు నిర్వహించింది. తెలంగాణ, నిజామాబాద్ జిల్లాకు చెందిన అబ్దుల్ ఖాదర్, మరియు మరో 26 మంది వ్యక్తులకు సంబంధించిన కేసులో ప్రదేశ్ (కర్నూలు మరియు నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కటి ).

* నిందితులు ఉగ్రవాద చర్యలకు పాల్పడేందుకు మరియు మతం ఆధారంగా వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించడానికి శిక్షణ ఇవ్వడం కోసం శిబిరాలను నిర్వహిస్తున్నారు.
* NIA నిర్వహించిన సోదాల్లో, డిజిటల్ పరికరాలు, డాక్యుమెంట్లు, రెండు బాకులు, నగదు రూ.8,31,500/- మొదలైన నేరారోపణ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. విచారణ నిమిత్తం నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
కేసులు విచారణ దశలో ఉందని ప్రకటనలో పేర్కొన్నారు.