ఉత్తమ ఉపాధ్యాయులుగా రాజన్న ,రమేష్ !


ఉత్తమ ఉపాధ్యాయులుగా ధర్మపురి  బాలికల ఉన్నత పాఠశాల  ప్రధానోపాధ్యాయులు చెరుకు రాజన్న , దోనూర్ ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కాసెట్టి రమేష్ ల ను ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుకు ఎంపిక చేసింది.

సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వీరిని జిల్లా కేంద్రంలో ప్రభుత్వ యంత్రాంగం సన్మానించనున్నారు. మీరు ఎంపిక పట్ల ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘం నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఘనంగా ఆరంభమైన భాగవత సప్తహాలు !


భాద్రపద మాసం పురస్కరించుకొని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం,మరియు స్థానిక శారదామహిళామండలి, ఆధ్వర్యంలో  శనివారం నుండి  అనగా తేది 03-09-2022 నుండి 10-09-2022 వరకు బ్రహ్మశ్రీ గర్రెపల్లి మహేశ్వర శర్మ, మానకొండూర్ గారిచే  రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో గల వేదికపై నిర్వహించబడే ” భాగవత సప్తాహ కార్యక్రమం” విషయంలొ దేవస్థానం పక్షాన కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్, రెనవేషన్ కమిటి సభ్యులు ఇందారపు రామన్న , అక్కనపల్లి సురేందర్ , వేముల నరేష్ , ఇనగంటి రమ వెంకటేశ్వరరావు , సంగెం సురేష్ ,  గందె పద్మ శ్రీనివాస్, వేదపండితులు ,అర్చకులు, సిబ్బంది , మహిళలు దేవస్థానం నుండి మేళతాళాలతో వారి ఇంటికి వెల్లి వారికి పూలమాల శేష వస్త్రం ఇచ్చి సాదరంగా ఆహ్వానించిన పిదప నగర సంకీర్తన కార్యక్రమం అనంతరం శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంనకు స్వాగతించారు.


మొదటగా భాగవత గ్రంథానికి పూజచేసి ప్రవచన కార్యక్రమము ప్రారంభించారు.
అలాగే భాద్రపద మాసం పురస్కరించుకొని స్థానిక భ్రాహ్మణ సంఘం భవనంలో బ్రహ్మ శ్రీ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి , గారిచే చెప్పబడు భాగవత సప్తాహ కార్యక్రమంనకుగాను వారి ఇంటికి కూడా దేవస్థానం పక్షానవెల్లి, సాదరంగా స్వాగతం పలికి పూలమాలతో శేష వస్త్రం తో సత్కరించి, నగర సంకీర్తన కార్యక్రమం అనంతరం వారిని భ్రాహ్మణ సంఘ భవనంలోకి స్వాగతించారు.


తదనంతరం మొదటగా భాగవత గ్రంథానికి పూజచేసి ప్రవచన కార్యక్రమము ప్రారంభించారు.
ఈరెండు కార్యక్రమంలకు గాను సంక్షేమ శాఖ మంత్రి సతీమణి స్నేహలత ఈశ్వర్ పాల్గొన్నారు.